Author: Editor's Desk, Tattva News

ఏషియన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో భారత క్రీడాకారులు సత్తాను చాటుతున్నారు. వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొన్న క్రీడాకారులు ఇప్పటివరకు 9 మెడల్స్‌ను సాధించి పతకాల జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం అథ్లెట్స్‌ జాబితాలో ఐదు స్వర్ణాలు, ఒక వెండి, మూడు రజత పతకాలు సాధించారు.  మూడోరోజు గురువారం జరిగిన వందమీటర్ల హర్డిల్‌లో తెలుగు తేజం జ్యోతి యర్రాజి స్వర్ణం స్వర్ణం సాధించింది.  జ్యోతి యర్రాజి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్నానికి చెందిన తెలుగు క్రీడాకారిణి. జ్యోతి విజయంతో భారత పట్టికలో ఐదు స్వర్ణాలు చేరాయి. బెస్ట్‌ త్రోలో తాజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ బెస్ట్‌ రెండవ ప్రయత్నంలో 19.80 మీటర్ల నుంచి 20.23 మీటర్లు త్రో చేసి స్వర్ణాన్ని సాధించాడు. తాజిందర్‌ పాల్‌ ఇప్పటివరకు ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు. ఆడిన ప్రతిసారి స్వర్ణం సాధిస్తూ వస్తున్నాడు. ఇదే ఆటలో ఇరాన్‌కు చెంది మెహదీ శబరీ సిల్వర్‌ సాధించగా, కజకిస్థాన్‌కు చెందిన ఇనావ్‌…

Read More

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు చేరారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకట నారాయణ భట్టిల చేత సిజెఐ డివై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు పూర్తి సంఖ్యాబలం 34 కాగా ఈ ఇద్దరి చేరికతో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.  తెలంగాణ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భూయాన్, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భట్టిల పదోన్నతికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం వీరి నియామకకాలపైఒక ప్రకటన చేశారు. జస్టిస్ భూయాన్1964 ఆగస్టు 2న జన్మించిన భూయాన్ 2011 అక్టోబర్ 17న గౌహతి హౌకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీనియర్ న్యాయమూర్తిగా భూయాన్ 2022 జూన్ 29న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయశాఖలో ముఖ్యంగా టాక్సేషన్‌లో ఆయనకు విశేష అనుభవం ఉంది. భూయాన్ గతంలో…

Read More

రాష్ట్రంలో అసైండ్ భూములు పొందిన వారికి ఆ భూములపై 20 ఏళ్ళ తర్వాత వారికి పూర్తి భూ యాజమాన్యపు హక్కులు కల్పించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకూ 33లక్షల 29వేల ఎకరాలకు 19లక్షల 21వేల మందికి అసైండ్ భూములను పంపిణీ చేయగా, వాటిలో 27లక్షల 41 వేల ఎకరాలకు సంబంధించి 15 లక్షల 21 వేల మందికి లబ్ది కలుగుతుందని చెప్పారు. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సుఫర్ యాక్టులో సవరణలు తీసుకువచ్చి గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసాహసోపేతమైన అసైండ్ భూమున్నసాగుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర జిడిపికి 2శాతం వచ్చే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అసైండ్ భూములకు సంబంధించి గతంలో ఎవరైనా భూస్వాములు లేదా మరెవరైనా ఆభూములను కొన్నా, బలవంతంగా స్వాధీన పర్చుకున్నా కొనుగోలులు…

Read More

టమోటాల ధర దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వాటికి భద్రత అందుబాటులోకి వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ధర పెరగడంతో తప్పని పరిస్థితి అయ్యింది. కర్ణాటకలోని ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ కోలార్ మార్కెట్‌లో ఇది అనివార్యమైంది.  టమోటాకి అన్యూహాంగా పెరిగిన గిరాకీ ఇప్పుడు సెక్యూరిటీ తప్పని పరిస్థితిగా మారింది.  కర్ణాటకలో కోలార్ టమోటా మార్కెట్ లో పోలీస్ భద్రత మధ్య టమోటా విక్రయాలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. కోలార్ మార్కెట్ లో 14 కిలోల టమోటా బాక్స్ ధర రూ. 2200 నుంచి 2500 మేర ఉండడంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు టమోటా ఎగుమతి అవుతుంది. దీంతో టమోటాకు మరింత డిమాండ్ పెరిగింది. రేటు ఊహకు అందకుండా ఉండటంతో టమోటా మార్కెట్ లో అడుగడుగున సీసీ కెమెరాలు, అదనపు భద్రత ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించాల్సిన…

Read More

ఇస్రో మ‌రో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశ‌గా చంద్ర‌యాన్‌-3 ప‌య‌న‌మైంది. శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్ నుంచి ఇవాళ ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్ర‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ త‌ర్వాత అన్ని ద‌శ‌ల్లోనూ ఆ రాకెట్ బూస్ట‌ర్లు స‌క్ర‌మంగా మండాయి. ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌తో చంద్రయాన్‌-3 వెళ్తోంది. ఆగ‌స్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండ‌ర్ దిగే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉప‌రిత‌లాన్ని అధ్య‌య‌నం చేసేందుకు పేలోడ్‌లో ప్ర‌త్యేక ప‌రిక‌రాన్ని పంపుతున్నారు. ఇస్రో ప్ర‌యోగాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్య‌లో జ‌నం వ‌చ్చారు. స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్ వద్ద ఉన్న గ్యాల‌రీ నుంచి ఆ ప్ర‌యోగాన్ని వీక్షించారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు, మాజీ శాస్త్ర‌వేత్త‌లు కూడా చంద్ర‌యాన్ ప్ర‌యోగాన్ని వీక్షించారు. రూ. 613 కోట్లతో చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టును చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. రాకెట్ నుంచి చంద్ర‌యాన్‌-3 విజ‌య‌వంతంగా వేరుప‌డింది. చంద్రయాన్…

Read More

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్’​ను అందించారు​. ఎలిసీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో ఈ పురస్కారాన్ని అందజేశారు.  ఫ్రాన్స్‌ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమైనది. ఇక ఓ దేశ ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా, కింగ్‌ చార్లెస్‌, ఫ్రాన్స్‌ మాజీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఐక్యరాజ్యసమితి మాజీ కార్యదర్శి బుట్రోస్‌ ఘాలీలు గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. ‘ప్రధాని మోదీకి ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్‌ను ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందించారు. కోట్లాది మంది భారతీయుల తరఫున మేక్రాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు’ అంటూ భారత…

Read More

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఫుల్‌ బెట్‌ విలువపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌తో పాటు, గుర్రం పందెలు, కాసినోపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి 20వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీ 2-3 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లిస్తోందని, సామాన్యులు తినే ఆహార పదార్ధాలపై కూడా 5 శాతం జీఎస్టీ ఉందని చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు పన్నులను జీజీఆర్‌లో 18 శాతంగా చెల్లిస్తున్నాయని, ఇది వాస్తవంలో 2-3 శాతంగా ఉందని జీఎస్టీ కౌన్సిల్‌లోని సభ్యుల్లో ఒకరు చెప్పారని ఆయన తెలిపారు. గత సంవత్సరం వీటిపై జీఎస్టీ రూపంలో 1,700 కోట్లు మాత్రమే వచ్చాయని, తాజా నిర్ణయంతో ఇది 15,000-20,000 కోట్ల వరకు ఉంటుందని…

Read More

దేశంలో యూపీ తర్వాత ఆంద్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తిరుపతిలో గురువారం రూ.2900 కోట్లతో అభివృద్ధి చేయనున్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్ కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు..అంతకు మునుపు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మాణం, రూ.500 కోట్లతో ఏపీ ప్రభుత్వం – నేషనల్ హైవే సంస్థ మధ్య ఎం.వో యు జరిగిందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్క్ టెక్ నిర్మాణం చేస్తామని చెబుతూ దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు – చెన్నై మధ్య అభివృద్ధికి రూ.20 వేల కోట్లతో 260 కి.మీ రహదారి నిర్మాణం చేపట్టామని, వీటిలో 92 కి.మీ ఏపీ గుడిపాల మీదుగా వెళ్తుందని చెప్పారు. చిత్తూరు -తచూరు 82 కి.మీ రూ.4,800 కోట్లు, ఢిల్లీ…

Read More

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లే ముందు మరోసారి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పేద దేశాల ఎదుగుదలకు భారత్‌ వేదిక లాంటిదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ లేకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) పరిపూర్ణం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌కు బయల్దేరే ముందు ఫ్రెంచ్‌ డెయిలీ ‘లెస్‌ ఎకోస్‌’తో గురువారం ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదు? ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? ఇందుకోసం తాము ఎలాంటి పాత్ర పోషించాలి? అన్నదానిపై భారత్‌ సహా చాలా దేశాలు స్పష్టంగా ఉన్నాయి” అని ఆయన…

Read More

శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బిఎస్ రావు) కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. విజయవాడలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్ రావు తన నివాసంలో బాత్రూంలో జారిపడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. ఆయన తలకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసిన డాక్టర్ బీఎస్ రావు తొలుత ఇంగ్లాండ్‌, ఇరాన్‌లో వైద్యుడిగా సేవలు అందించారు. 1986లో విజయవాడలో ‘శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కాలేజీ’ని ప్రారంభించారు. ఆయన వేసిన ఈ అడుగు ఆ తర్వాత కాలంలో విద్యా రంగంలో పెను మార్పులకు కారణమైంది. అనతి కాలంలోనే మంచి గుర్తింపు రావడంతో…

Read More