దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతం, సామాజిక వర్గం లేదు.. ప్రజలంతా ప్రధాని మోదీ పాలన పట్ల మొగ్గు చూపుతున్నారని బిజెపి ఎంపి, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. దక్షిణాదిలో బిజెపిని విస్తరించే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు జాతీయ నాయకత్వం ప్రాధాన్యమిస్తుందని చెబుతూ అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ ఎన్నికల బాధ్యులుగా ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ లను నియమించారని వెల్లడించారు. స్థానిక అంశాల ప్రభావితంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోదీకి ఓటు వేసేందుకు కర్ణాటక ప్రజలు సిద్దంగా ఉన్నారని డా. లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పట్ల విసుగు చెందిన ప్రజలు బిజెపికి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. వరంగల్ సభకు హాజరైన ప్రజలను చూస్తే ఇది అర్థం అవుతోందని చెప్పారు. ప్రధాని హోదాలో…
Author: Editor's Desk, Tattva News
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆగస్టు 14న మరోసారి విచారించనుంది. అయితే, అప్పటిలోగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను కోర్టులో దాఖలు చేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెబీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ‘దర్యాప్తు పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని మెహతా పేర్కొన్నారు. నిపుణుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందని, దీనిపై సమాధానం దాఖలు చేశామని, ఆరోపణలతో సంబంధం లేదన్నారు. సెబీ సమాధానం తమకు పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట జాబితా చేసిన మరికొన్ని పిటిషన్లపై విచారణ ముగిసిన వెంటనే ఈ అంశాన్ని విచారణకు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. 2019 నిబంధనల మార్పుతో విదేశీ నిధుల…
కాంగ్రెస్ అగ్ర నేత ప్రచార నినాదం ‘ప్రేమ దుకాణం (మొహ బ్బత్ కా దుకాణ్)’పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తావిస్తూ నిజానికి ఆయన ‘విద్వేష మెగా మాల్’ను నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలంతా ప్రధాని మోదీపై ద్వేషం వెదజల్లుతున్నారని మండిపడ్డారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ప్రజాసంక్షేమం పట్టదని.. అవి కుటుంబ పార్టీలుగా మారిపోతున్నాయని విమర్శించారు. ‘ప్రపంచ వేదికలపై మోదీకి ప్రశంసలు దక్కినప్పుడల్లా కాంగ్రెస్ వాళ్లు మనస్తాపానికి గురవుతారు. ఆయన్ను వ్యతిరేకించే ప్రయత్నంలో మన దేశాన్నే వ్యతిరేకిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ బ్రిటన్ వెళ్లి భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారని చెబుతూ ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించి, లక్షన్నర మందిని జైళ్లలో తోశారని గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలకు ఉపక్రమిస్తున్నారని…
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఆగస్టు రెండు నుంచి సోమవారం, శుక్రవారం మినహా మిగిలిన పని దినాల్లో వీటిపై విచారణ జరుగుతుందని తెలిపింది. ఈ అధికరణ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌ను, మాజీ విద్యార్థి నేత షెహలా రషీద్‌ను అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో, అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ-కశ్మీరులో పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని తెలిపింది. మూడు దశాబ్దాల సంక్షోభం తర్వాత మునుపెన్నడూ లేని అభివృద్ధి, ప్రగతి, భద్రత, స్థిరత్వం రావడానికి ఈ చర్య దోహదపడిందని తెలిపింది. మూడేళ్ల నుంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఎటువంటి సమ్మెలు, ఆందోళనలు జరగడం…
కృత్రిమ మేధస్సు (ఐఎ) ప్రక్రియతో కృత్రిమ మహిళా యాంకర్‌ను రూపొందించారు. ఐఎను వాడుకుని వార్తలు చదివే యాంకర్‌ను రూపొందించారు. ఈ యాంకర్‌కు లిసా అనే పేరు పెట్టారు. ఈ లిసా ఇప్పుడు ఓడిషాలోని ఓటీవీ వార్తా ఛానెల్ ద్వారా వార్తలు చదువుతుంది. సంబంధిత కృత్రిమ మహిళా యాంకర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే అత్యద్భుత ఘట్టం భువనేశ్వర్‌లో సోమవారం జరిగింది. తమ సంస్థ వార్తా జర్నలిజంలో ప్రవేశించి పాతికేళ్లు అయిన దశలో ఓ కీలక మైలురాయిగా ఈ ఐఎ యాంకర్ లిసా ఇక తమ టీవీ ఛానల్ ద్వారా వార్తలను అందిస్తారని ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ జగి మంగత్ పండా తెలిపారు. లిసా అన్ని భాషలను మాట్లాడగలదు. అయితే ఇప్పటికైతే దీనిని కేవలం ఆంగ్లం, ఒడిషి భాషలకు పరిమితం చేశారు. తమ రాష్ట్ర భాషలో శిక్షణ చాలా కష్టం అయిందని , అయినా దీనిని సాధించినట్లు తెలిపారు. మనుష్యుల మాదిరిగా స్పష్టమైన ఉచ్ఛారణ…
అగ్రి- డ్రోన్ తయారీదారు ఐఒ టెక్ వరల్డ్ ఏవిగేషన్ నుంచి 500 డ్రోన్ల కొనుగోలుకు సహకార ఎరువుల ప్రధాన సంస్థ ఇఫ్కో ఆర్డర్లు జారీ చేసింది. ఈ మేరకు భారీ కాంట్రాక్ట్‌ను ఐఒ టెక్ పొందిందని సోమవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్లను ప్రధానంగా నానో లిక్విడ్ యూరియా, డీఏపీ స్ప్రే చేయడానికి ఉపయోగిస్తారు. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) తన ఉత్పత్తులైన నానో యూరియా, నానో డిఎపి (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) స్ప్రే చేయడానికి 2,500 డ్రోన్‌లను సేకరించాలని యోచిస్తోంది. 5,000 మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను రూపొందించాలని యోచిస్తోంది. వారికి డ్రోన్‌ల ద్వారా స్ప్రే చేయడంలో శిక్షణ ఇవ్వనుంది. ”డిసెంబర్ 2023 నాటికి కంపెనీ 500 డ్రోన్‌లను ఇఫ్కోకు డెలివరీ చేస్తుంది” అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనూప్ ఉపాధ్యాయ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్ల వాడకం వల్ల సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా వ్యవసాయ…
పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు మరింత ప్రోత్సహించేందుకు రెడ్కో(తెలంగాణ పునరుద్దరణ ఇంధన వనరుల వనరుల సంస్థ) అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు పెంచి తద్వారా వాహనదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 40 చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా మరో 180 చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్లలో విద్యుత్ చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు టిఎస్ రెడ్కో ఆధ్వర్యంలో స్థలాలను అన్వేషిస్తున్నారు. చార్జింగ్ స్టేషన్ల కోసం కేవలం సంస్థకు చెందిన స్థలాల్లోనే కాకుండా ప్రైవేట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో, షాపింగ్ మాల్స్‌లో అపార్ట్‌మెంట్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.అంతే కాకుండా వాహనాల వినియోగాన్ని బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామంటున్నారు. విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను కేవలం నగరానికి పరిమితం…
రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది ప్రభుత్వం పని అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కుకీ గ్రూప్‌ల తరఫున సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వేస్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హింస, ఇతర సమస్యలను మరింత తీవ్రతరం చేసేందుకు ప్రొసీడింగ్స్‌ను ఉపయోగించుకోవాలని కోరుకోవడం లేదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో కోర్టు పరిమితులను దృష్టిలో ఉంచుకొని సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని పేర్కొంది. సమస్యను అర్థం చేసుకున్నామని, ఏమైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఏం చేయగలదన్నదానిపై తమకు స్పష్టత ఉందని, ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే చూసుకుంటామని, ఇది మానవతా సంక్షోభమేనని పేర్కొంది.…
ఏపీలో మహిళల అదృశ్యంకు, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధం ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒక వంక వైసిపి మంత్రులు పవన్ కళ్యాణ్ వాఖ్యాలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఈ వాఖ్యలపై వివరణలు ఇవ్వాలంటూ ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళల మిస్సింగ్ ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు పవన్ కల్యాణ్‌పై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారాహి యాత్రలో పవన్ తమపై నిందలు వేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వాలంటీర్లు చెప్పారు. తాము ఏం చేస్తున్నామో ఆయన చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల…
ఉజ్జయిని మహంకాళి వేడుకల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. బోనాల ఉత్సవాల్లో ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది తనకు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.., మీ వెంటా ఉంటానని చెప్పారు.ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని అభయమిచ్చారు. ”అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి..ప్రజలు భయపడ వద్దని అభయం ఇచ్చారు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం నాదేనని చెప్పారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భాధ్యత నాదేనని, ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని స్వర్ణలత అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. బోనాలు కార్యక్రమం బాగా…