ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపే లక్ష్యంగా పార్టీని సన్నద్ధం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నడ్డా, బిఎల్.సంతోష్‌లు సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 11 రాస్త్రాల రాష్ట్ర అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాన్ని హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు సాధించడం అవసరమని పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రాల వారీగా ఉదయం నుంచి బీజేపీ…
Author: Editor's Desk, Tattva News
తాను ప్రేమించిన యువకుడి కోసం స్వదేశంలో భారతను వదిలిపెట్టి, అనుమతి లేకుండా భారత్ కు చేరుకొని, పోలీసుల చేత చిక్కి, చివరకు ఇక్కడి యువకుడిని వివాహం చేసుకొని, ఇక భారత్ తనదైందని ఓ పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ సంతోషం వ్యక్తం చేసింది. యుపికి చెందిన సచిన్ మీనాతో పబ్‌జీ ద్వారా పరిచయం పెంచుకున్న హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాకు చేరుకుంది. నలుగురు పిల్లల ఆమె, సచిన్ ప్రేమలో పడ్డారు. అంతకు ముందే పెళ్లి చేసుకున్నారు. అక్రమంగా వచ్చిన వీరికి ఆశ్రయం కల్పించిన సచిన్‌ను, అక్రమంగా వచ్చినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కాగా బెయిల్ రావడంతో ఇక్కడి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీమా మాట్లాడుతూ తన భర్త హిందువు అని, ఇక తాను కూడా హిందువునే అని, ఈ భారత్ తనదే అని సంతోషం వ్యక్తం చేశారు.…
రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘె ఈ నెల 21 నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీని ఆయన కలుసుకుని వివిధ అంశాలపై చర్చిస్తారని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గత ఏడాది శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ప్రజాందోళనలు, చివరకు గొటాభయ రాజపక్ష అధికార పీఠం నుంచి వైదొలగవలసి రావడం తదితర పరిణామాలు ఎన్నో సంభవించాయి. అధ్యక్షునిగా విక్రమ్ సింఘె గత ఏడాది జులైలో పగ్గాలు చేపట్టిన తరువాత భారత్‌లో పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి భారత్‌కు చెందిన విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వచ్చే వారం భారత్‌కు రానున్నారు. విక్రమ్ సింఘె భారత్‌కు వచ్చే ముందు విద్యుత్, ఇంధనం, వ్యవసాయం, సాగర్ జలాల భద్రత తదితర భారత ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఖరారు చేసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విక్రమ్ సింఘెతోపాటు శ్రీలంక…
ఉత్తర భారత్‌లో పలు రాష్ట్రాల్లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది మరణించారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమైపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రిడ్జీలు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లి 1982 నాటి నుంచి అత్యధికంగా ఒక్కరోజులోనే 153 మి.మీ.ల వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్ళు, ఇతర నిర్మాణాలు పెద్ద తిన్నాయి. ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లో ఒక కారుపై కొండచరియ విరిగిపడింది. దీంతో కారు గంగా నదిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మెరుపు వరదలకు శనివారం సాయంత్రం ఇద్దరు జవాన్లు వరద నీటిలో కొట్టుకుపోయారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. చిత్తోడ్‌గఢ్‌లో పిడుగు పడి ఒక పురుషుడు, ఒక మహిళ మరణించగా, సవాయ్ మధోపూర్‌లో…
పశ్చిమ బెంగాల్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. బాంబు దాడులు, బులెట్ల వర్షంతో రక్తపుటేరులు పారాయి. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 18 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బిహార్ జిల్లాలతో పాటుగా క్షిణ 24 పరగణాలు, భంగార్, తూర్పు మిడ్నపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణలను నిలువరించడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అల్లరి మూకలు, ఆందోళనకారులపై చర్యలు తీసుకొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడానికి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ బాక్స్‌లను ఎత్తుకెళ్లడం, ధ్వంసం…
రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ ప్రకటన జారీ చేసింది. ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్ కచ్చితంగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆధార్ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పథకాలు తిరస్కరించకూడదు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్ నంబరు కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికేట్లను ఎటువంటి సర్వీసు రుసుము లేకుండా అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ…
శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్ శనివారం స్పందించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కోరినట్లు తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ నుంచి శివసేన రాజ్యాంగం తనకు అందినట్లు రాహుల్ నార్వేకర్ శుక్రవారం చెప్పారు. ముఖ్యమంత్రి షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సత్వర విచారణ జరపాలని శాసనసభ సభాపతిని ఆదేశించాలని ఇటీవల శివసేన (యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 జూన్ నెలలో షిండే వర్గం బీజేపీతో చేతులు…
పాకిస్థాన్‌కు చెందిన మహిళా నిఘా ఏజెంట్ ఆకర్షణకు గురై భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత రహస్యమైన క్షిపణి వ్యవస్థ రహస్యాలను చేరవేస్తున్నాడనే ఆరోపణలపై డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ లో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. పాక్ నిఘా ఏజెంట్ వలపు వలలో పడిన ఆయన, ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్టు పోలీస్‌లు తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో ఉన్న వివరాల ప్రకారం ప్రదీప్ కురుల్కర్ మహారాష్ట్ర లోని పుణెలో గల రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్‌డీవో) ల్యాబ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది ఆయనకు జారా దాస్‌గుప్తా పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తానో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, బ్రిటన్‌లో పనిచేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆయనకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి క్రమంగా స్నేహం పెంచుకుంది. వీరిద్దరూ వాట్సాప్‌లో…
వందే భారత్‌తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్, అనుభూతి అండ్ విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నవాటిలో ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు చార్జీలు తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ చార్జీలు కూడా ప్రయాణికుల రద్దీని బట్టి మారుతూ ఉంటాయని స్పష్టం చేసింది. వసతి సౌకర్యాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే ఉద్దేశంతో రైళ్లలో ఏసీ సీటింగ్‌తో కూడిన రాయితీ చార్జీల పథకాలను ప్రవేశపెట్టేందుకు రైల్వే జోన్‌ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ పథకం అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లతో సహా ఏసీ సీటింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు వర్తిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. తగ్గింపు విషయంలో ప్రాథమిక చార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు ఉంటుంది. రిజర్వేషన్ చార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్టీ, మొదలైన ఇతర చార్జీలు…
కెసిఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని, ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హన్మకొండలో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో ప్రసంగిస్తూ భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఒక బిజెపి కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెబుతూ జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని తెలిపారు. బిజెపి తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని పేర్కొంటూ అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు…