Author: Editor's Desk, Tattva News

అవినీతిపై చర్యలు తీసుకోవడంలో వెనకాడే ప్రసక్తే లేదని, అందుకు భయపడేవాడు మోదీయే కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనకంజవేయబోనని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.7,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు. అనంతరం రాయపూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ చత్తీస్‌గఢ్ సంక్షేమానికి చర్యలు చర్యలు చేపట్టడంలో తాను వెనకంజవేయబోనని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు తాము పెడతామని చెబుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు శత్రువని ధ్వజమెత్తారు. చత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఆ గాలి వీస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని…

Read More

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులోని విధానసౌధలో 14వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం పెంచినట్లు ప్రకటించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై అదనపు ఎక్సైజ్ సుంకం (ఏఈడీ) కూడా 20 శాతం పెరిగిందని వెల్ల‌డించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీర్ సహా లిక్కర్ ధరలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 18 స్లాబ్ ల్లో అదనంగా 20% ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. ఈ పెంపు తర్వాత కూడా కర్నాటకలో లిక్కర్ ధరలు పొరుగు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉంటాయని సిద్ధ రామయ్య తెలిపారు.కర్ణాటకలో ఇప్పటి వరకు 14 బడ్జెట్ లను ప్రవేశపెట్టి సిద్దరామయ్య రికార్డు నెలకొల్పారు. బీర్ పై 10 శాతం (175 శాతం నుండి 185 శాతానికి) పెరిగిందని తెలిపారు. సిద్ధరామయ్య రూ.3,27,747 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటించగా, ఇందులో రూ.2,50,933 కోట్లు రెవెన్యూ వ్యయానికి, రూ.54,374 కోట్లు మూలధన వ్యయానికి, రూ.22,441 కోట్లు…

Read More

భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం ప్రధానమైనదని కేంద్ర సముద్ర విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో సముద్ర సమాచారం, సలహా సేవలపై భారీ అవగాహన కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు.  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తదితరుల సమక్షంలో కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం హైదరాబాద్ వారు మత్స్యకారులు చేపల వేట యజమానులకు నిరంతరం సముద్ర సమాచారం అందిస్తున్నారని తెలిపారు.  సునామీ వంటి ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు హెచ్చరికలు జారీ…

Read More

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి భారీ మార్పులకు, చేర్పులకు దిగుతోంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్‌ నేత ప్రకాష్‌ జవదేకర్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది.  అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ను నియమించింది. ఇక ప్రకాశ్‌ జవదేకర్‌ గతంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌.. ఇలా 2008 నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. పార్లమెంట్‌లో పలు కమిటీలకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిచారు.  2021లో కేంద్ర మంత్రి పదవికి దూరమయ్యారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు. బిజెపిలో కీల‌క‌నేత‌గా ఉన్న జ‌వ‌దేక‌ర్ తెలంగాణ‌లో బిజెపిని అధికారంలోకి తీసుకువ‌స్తాడ‌నే భ‌రోసాతో పార్టీ ఎన్నిక‌ల ఇన్ చార్జీ గా నియ‌మించింది.  ఇక ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్చార్జిగా ఓపీ మాథుర్,…

Read More

నేపాల్ ప్రధాని ప్రచండ (పుష్పకమల్ దహల్) నోరు జారి చిక్కుల్లో పడ్డారు. తాను ప్రధాని పీఠం ఎక్కడానికి తెరవెనుక ఏం జరిగిందో చెప్పి సమస్యలను ఆహ్వానించారు. `రోడ్స్ టు ద వ్యాలీ: ద లెగాసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని ప్రచండ ముఖ్య అతిథిగా హాజరాయ్యరు. నేపాల్ లో స్థిరపడిన భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ పై ఈ పుస్తకం తీసుకువచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని ప్రచండ మాట్లాడుతూ, తాను ప్రధానమంత్రి కావడానికి కారణం సర్దార్ ప్రీతమ్ సింగ్ అని వెల్లడించారు. తనను ప్రధాని పీఠం ఎక్కిండానికి సర్దార్ ప్రీతమ్ సింగ్ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరిపారని, ఖాట్మండూలోని రాజకీయ వర్గాలతో చర్చలు జరిపారని తెలిపారు. తాను ప్రధానిగా రావడం వెనుక సర్దార్ ప్రీతమ్ సింగ్ కృషి చాలా ఉందని కొనియాడారు. నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన తన…

Read More

దేశ అత్యున్నత న్యాయస్థానంపై నిరాధార, కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన కోర్టు ఘధిక్కార పిటిషన్‌కు సంబంధించి హిందూత్వ నాయకుడు యతి నరసింఘానందకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. యతి నరసింఘానందపై సాక్షి నెల్లి అనే హక్కుల కార్యకర్త దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది.  ఈ వ్యవస్థపైన, ఈ రాజకీయ నాయకులపైన, ఈ సుప్రీంకోర్టుపైన, ఈ సైన్యం పైన నమ్మకం ఉన్నవారు కుక్కచావు చస్తారు అంటూ యతి నరసింఘానంద గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా దీనిపై సాక్షి నెల్లి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.  సుప్రీంకోర్టు పైన, రాజ్యాంగంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యతి సరసింహానందపై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి కోరుతూ సాక్షి నెల్లి దరఖాస్తు చేసుకోగా 2022 జనవరిలో అప్పటి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్…

Read More

యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు చైన్‌ లాగడంతో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు.  కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా చిన్న గాయం కాకుండా ఉండటానికి ఓ వ్యక్తి కారణం. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే చైన్‌ లాగడంతో రైలు ఆగింది. అంతే కాకుండా ప్ర‌యాణీకుల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. ఆ బోగీలు ప్ర‌యాణీకులు వెంట‌నే కింద‌కు దిగారు.. మిగిలిన బోగీల ప్ర‌యాణీకుల‌ను సైతం హెచ్చ‌రించ‌డంతో వారు సైతం బోగీల నుంచి బ‌య‌ట‌కు దూకేశారు.  ప్ర‌యాణీకులు దిగుతుండ‌గానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. ఎస్ 4, 5, 6, పూర్తిగా కాలిపోగా,మ‌రో నాలుగు బోగీలు పాక్షికంగా త‌గుల‌బ‌డ్డాయి. కాగా ఇంత‌మంది ప్రాణాలు…

Read More

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. మోదీ పేరుతో చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు గుజరాత్ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఇవాళ తీర్పు వెలువరించింది.  2019 ఎన్నికల సమయంలో కర్నాటకలో ప్రచారం చేస్తూ మోడీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలేనా అంటూ రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది తీర్పు వెలువరించింది.  ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.  అనంతరం ఆయన సూరత్ కోర్టు తీర్పును…

Read More

సాధారణంగా వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వాలు నెలనెలా పెన్షన్ అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే అవివాహితులకు కూడా నెల నెలా పెన్షన్ అందించాలని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఓ ప్రకటన చేశారు. హర్యానా రాష్ట్రంలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని వారి వార్షికాదాయం రూ.1.8 లక్షల లోపు ఉంటే వారికి రూ.2,750 నెలవారీ పెన్షన్ అందజేస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రూ. 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ఒకే వయస్సు గల వితంతువులు (మగ,ఆడ ఇద్దరికీ) కూడా పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 65,000 మంది అవివాహిత పురుషులు, స్త్రీలకు పరివార్ పెహచాన్ పత్ర పథకం కింద పెన్షన్ అందించబడుతుందని సీఎం తెలిపారు. అంతకుముందు, జూన్ 26న…

Read More

ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను నిర్మూలించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి)కి అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మార్గదర్శకాల ఇవ్వాలని కోరుతూ రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వి తల్లులు రాధిక వేముల, అబేద తాడ్వి దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.  ఈ పిటీషన్‌ను జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇది విద్యార్థులు, పిల్లలు ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల ప్రయోజనాలకు సంబంధించిన అంశం. భవిష్యత్తులో అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని యుజిసికి జస్టిస్‌ బోపన్న సూచించారు.  ఈ పిటిషన్‌ వ్యతిరేకత లేనిదని, కాబట్టీ అభ్యంతరాల రూపంలో సమాధానం ఇవ్వకుండా, పిటిషన్‌లో లేవనెత్తిన ఆందోళనలను యుజిసి ఎలా పరిష్కరిస్తోందో, సరిదిద్దుతుందో తెలపాలని జస్టిస్‌ బోపన్న కోరారు. ఈ ఏడాదిలో…

Read More