ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదు అని తేల్చి చెప్పారు. ముందుస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు హడావుడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. “జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం. మళ్లీ సీఎం జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతీ ఎమ్మెల్యేకు ప్రజలు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్ పూర్తిగా పాజిటివ్ ఓటునే నమ్ముకున్నారు” అని తెలిపారు. ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే మీడియా ఛానెల్స్ హడావుడి ఇదంతా ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని సజ్జల కోరారుచంద్రబాబు మాదిరిగా అలిపిరి ఘటనను అడ్డం పెట్టుకోవాల్సిన పని తమకు లేదని, ఆ పేరుతో చంద్రబాబు తన పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ముందస్తుపై ఎల్లోమీడియాలో…
Author: Editor's Desk, Tattva News
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ ప్రయోగానికి సిద్ధం అయ్యింది. జూలై నెల 14న చంద్రయాన్ -3 ఉపగ్రహ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. గత వైఫల్యాలను సరిచేసి సరికొత్త సాంకేతిక పరికరాలతో తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి చంద్రయాన్ ప్రయోగం జరపనుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఇస్రో ఎల్విఎం మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్ -3 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుండి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ ప్రయోగం జరుగుతుంది. చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను సాధించడానికి ప్రధానముగా ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహిస్తుంది. చంద్రునిపై ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ వాతావరణ పరిస్థితుల పైన అధ్యనం చేయడానికి భవిషత్‌లో మానవ సహిత చంద్రయాన్ ప్రయాణానికి అవసరమైన పరిశోధనల…
పేద గిరిజనుడైన దశరథ్ రావత్ ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే ఒక వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణ అడిగారు. ప్రవేశ్ శుక్లాను అత్యంత కఠినంగా శిక్షించాలని సీఎం చౌహాన్ ఇప్పటికే ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడిన మానవ మృగం ప్రవేశ్ శుక్లా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక షాప్ లో మొబైల్ రీచార్జ్ కోసం వచ్చిన దశరథ్ రావత్ అనే గిరిజనుడు, షాప్ బిజీగా ఉండడంతో బయట కూర్చుని వెయిట్ చేస్తున్నాడు. బాగా మద్యం పట్టించి, సిగరెట్ తాగుతూ అటువైపు వచ్చిన ప్రవేశ్ శుక్లా దశరథ్ రావత్ ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. అక్కడి వారు, ఆ షాపు అతను…
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. తెలంగాణ, ఎపిలతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న సీజేలను సుప్రీంకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేసింది. దీంతో వీరి స్థానాల్లో కొత్త ప్రధాన నాయమూర్తులను నియమించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పేరును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు జడ్జి ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం ఇంతకు ముందే సిఫారసు చేసింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ పేరు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సెప్టెంబర్ 5 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ నమోదు చేసిన కేసుల విచారణ ముగిసే వరకు ఇడి కేసుల విచారణ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ సంజరు కరోల్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసు పూర్తి స్థాయి విచారణను ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలా అన్నది ఆరోజు…
కాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ బుధవారం సాయంత్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. కాజీపేట(హసన్‌పర్తి) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్‌ను నిర్మించాలని కోరారు. దీంతో పాటు ఈనెల 8న వరంగల్‌లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్‌కు సంబంధించి భూమి పూజ ఏర్పాట్లపై అశ్విని వైష్ణవ్ బండి సంజయ్‌తో చర్చించారు. కాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆయనను కోరారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అశ్విని వైష్ణవ్ వెంటనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి…
కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు తమిళనాడు జల వనరుల మంత్రి దురైమురుగన్ అభ్యర్థించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ను ఆయన కలుసుకుని ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ జూన్ నెలకు సంబంధించి తమిళనాడు 12,213 టిఎంసి (తౌజండ్ మిలియన్ క్యూబిక్ ) అడుగుల వరకు కావేరీ జలాలను పొందవలసిన అర్హత ఉందని , కానీ 2993 టిఎంసి అడుగుల వరకే పొందగలిగామని, ఇంకా 9220 టిఎంసి అడుగుల నీరు లోటు ఉందని చెప్పారు. జులై 3 నాటి వరకున్న పరిస్థితిని ఈ డేటా చెబుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమిళనాడు కావేరీ డెల్టా ప్రాంతం తీవ్ర ప్రభావానికి గురవుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కావేరీ జలాల యాజమాన్య అథారిటీ చర్యలు తీసుకోవలసి ఉందని…
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మహా వికాస్ ఆఘాఢీలో ఉన్న ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన – బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ పరిణామంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు అజిత్ పవార్, ఇటు శరద్ పవార్ తమ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేపట్టారు. ఈ బల ప్రదర్శనలో పార్టీలో అధిక శాతం మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు వెళ్లడంతో శరద్ పవార్ వర్గానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇదే అదనుగా అజిత్ పవార్ ఎన్నికల కమిషన్ వద్దకు చేరారు. ఎన్సీపీలో తలెత్తిన తాజా సంక్షోభం ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకుంది. బుధవారం నిర్వహించిన బల ప్రదర్శనలో తమ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్న అజిత్ పవార్ పార్టీ తమదేనని…
తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మరోసారి తనను నియమించడం పట్ల తాను అలిగిన్నట్లు వస్తున్న కథనాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ విధానంకు కట్టుబడి ఉంటానని, ప్రధాని మోదీ వరంగల్ పర్యటన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంకు తాను హాజరు కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారవేస్తూ కాబినెట్ మార్పులు జరిగేవరకు మంత్రి పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను పార్టీకి విధేయుడినని.. క్రమశిక్షణ గల కార్యకర్తనని చెప్పుకొచ్చారు. గతంలోనూ తాను రెండు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశానన్న కిషన్ రెడ్ అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని చెప్పారు. “కేంద్రమంత్రిగా ప్రధాని నాకు బాధ్యతలు ఇచ్చారు. నాకు ఫలానా కావాలని పార్టీ ఎప్పుడూ ఏదీ అడగలేదు. పార్టీ గుర్తించి ఇచ్చిన అన్ని పదవులను నిర్వర్తించా. పార్టీ విధానానికి కట్టుబడి ఉంటా”…
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు వద్ద రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు ఘర్షణపడి కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో న్యాయవాదులు కాల్పులు జరుపుకోగా పోలీసులు కోర్టు వద్దకు పరుగులు తీసినట్లు పోలీసు అదికారి ఒకరు వెల్లడించారు. తీస్ హజారీ కోర్టు వద్ద తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగిన రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు గాలిలో కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని డిసిపి(నార్త్) సాగర్ సింగ్ కల్సీ తెలిపారు. ఢిల్లీలో ఏడు జిల్లా కోర్టులు ఉన్నాయి. తీస్ హజారీ, రోహిణి, సాకేత్, ద్వారక, కర్కర్‌దూమ, రూస్ అవెన్యూ, పాటియాలా హౌస్ కోర్టుతోపాటు ప్రధాన ఢిల్లీ హైకోర్టు ఉన్నాయి. జిల్లా కోర్టులలో పోలిస్తే హైకోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయి. తీస్ హజారీ కోర్టు వద్ద న్యాయవాదులు ఘర్షణ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్ణనమిస్తున్నాయి. న్యాయవాదులు పరస్పరం దూషించుకోవడం,…