Author: Editor's Desk, Tattva News

మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసహ్యం కలిగిస్తున్నాయని, ఓటర్లను అవమానించే రీతిలో ఇవి సాగుతున్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే విమర్శించారు. మహారాష్ట్రలో తిరుగుబాటు రాజకీయాలనే విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను అవే తిరుగుబాటు రాజకీయాలు వెంటాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసహ్యంగా ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇంటికి వెళ్లి దీన్ని గురించి అడిగినా తిట్లు ఎదురవుతాయని రాజ్ థాకరే పేర్కొన్నారు. ఇది ఓటర్లను దారుణంగా అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు.ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి దాపురించిందని, మహారాష్ట్రలో ఇదో దురదృష్టకర పరిస్థితని ఆయన తెలిపారు. అజిత్ పవార్ నాయకత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన దరిమిలా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాజ్ థాకరే స్పందిస్తూ ఈ పరిణామాల వెనుక ఎవరున్నారన్నది స్పష్టంగా తెలియడం లేదని…

Read More

టీమిండియా పురుషుల క్రికెట్‌ జట్టుకు చీఫ్‌ సెలెక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ నియమితులయ్యారు. బీసీసీఐకి చెందిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఆయన్ను ఏకగ్రీవంగా చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌ తర్వాత చేతన్‌ శర్మ రాజీనామా చేయడంతో చీఫ్‌ సెలక్టర్‌ స్థానం ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉంది. దీంతో చీఫ్‌ సెలక్టర్‌ పదవి కోసం జూన్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. దరఖాస్తుదారులకు సోమవారం నాడు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరంజపే, శివ్‌ సుందర్‌ దాస్‌తో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ అజిత్‌ అగార్కర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. 2007లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో అగార్కర్ ఉన్నాడు. 45 ఏళ్ల అగార్కర్ 26 టెస్టులు, 191 వ‌న్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో అత‌ను 58 వికెట్లు తీయ‌గా, వ‌న్డేల్లో 288…

Read More

ఇండిగో విమానయాన సంస్థ తన అంతర్జాతీయ కార్యకలాపాలను బలోపేతం చేసే క్రమంలో జూన్ 15వ తేదీ నుండి హైదరాబాద్– రస్ అల్ ఖైమా మధ్య కొత్త రోజువారీ డైరెక్ట్ విమానాన్ని నడపనున్నట్టు ప్రకటించింది. వేసవి షెడ్యూల్‌కు అదనంగా ఈ సరికొత్త జోడింపుతో టూరిస్టులు, బిజినెస్ వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇండిగో అంచనా వేస్తోంది. సెప్టెంబరు 2022లో ముంబయి నుండి రాస్ అల్ ఖైమాకు విమానయాన సంస్థ మొదటిసారిగా డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌కు కూడా డైరెక్ట్ ఫ్లయిట్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో కూడా మరింతగా సేవలందించాలనే దాని నిబద్ధతను బలోపేతం చేసిందని సేల్స్ హెడ్ వినయ్ తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త విమానాలను ప్రవేశపెట్టినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా చెప్పారు. ఈ సంవత్సరం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలలో పెరుగుదలను చూస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశపు ప్రముఖ క్యారియర్‌గా తాము కొత్త…

Read More

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ – ఎస్‌సీఓ  వర్చువల్‌ సమావేశంలో ఉగ్రవాదంపై జరిగిన చర్చలో పాక్ లక్ష్యంగా పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.  సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్‌సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ముందే పాకిస్థాన్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భౌగోళిక వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారులతో పోరాడుతున్న అనేక దేశాలు.. ప్రస్తుతం ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ప్రధాన సమస్యలుగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇలాంటి వాటిని అన్ని దేశాలు కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో పాటు ఇతర ఎస్‌సీఓ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చారు. ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ బాధ్యలను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు తొలగించింది. సోము వీర్రాజును పదవి నుంచి తప్పించిన బీజేపీ నాయకత్వం, ఆ సమాచారాన్ని అధికారికంగా ఆయనకు తెలిపింది. మంగళవారం సోమువీర్రాజుకు ఫోన్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం పూర్తయినందున తప్పిస్తున్నట్లు తెలిపారు. పదవికి రాజీనామా చేయాలని సూచించారు. సోము వీర్రాజు స్థానంలో మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. అయితే ముందు మీడియాలో సత్య కుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినా పురంధేశ్వరికి పదవి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యనిగా…

Read More

గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని చెబుతూ వచ్చే తొమ్మిది నెలల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఐదు గంటలపాటు కొనసాగడం గమనార్హం. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌లో జరిగిన ఈ భేటీపై నరేంద్ర మోదీ తాజాగా ట్వీట్ చేవారు. మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని ఆయన వెల్లడించారు. విధానపరమైన అంశాలపై చర్చలు జరిగిన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భారత్ 2047 వరకు అభివృద్ధి చెందే అవకాశాలపై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జరిగిన ఈ కీలకమైన భేటీలో వచ్చే ఎన్నికలను అభివృద్ధి అజెండాపై ఎదుర్కోబోతున్నట్లు ప్రధాని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. తమ అభివృద్ధి అజెండాపై నడుస్తున్నదని చెబుతూ అభివృద్ధి…

Read More

ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్‌ నివేదిక సమర్పించింది. బాలాసోర్‌ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్‌ సిగ్నలింగ్‌’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా బహుళ స్థాయిలో జరిగిన లోపాలను ఎత్తి చూపింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని నివేదిక పేర్కొన్న సేఫ్టీ కమిషన్‌.. గతంలో లోపాన్ని సరి చేస్తే ప్రమాదం జరిగేది కాదని రైల్వే సేఫ్టీ కమిషన్ రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలో పేర్కొంది. రాంగ్‌ వైరింగ్‌, సిగ్నలింగ్‌, సర్క్యూట్‌లో లోపాలు ప్రమాదానికి కారణమని కమిషన్‌ నివేదికలో తెలిపింది. 2022 మే 16న సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలోని ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో రాంగ్‌ వైరింగ్, కేబుల్‌లో లోపాల కారణంగా ఇలాంటి ఘటనలే జరిగిందని కమిషన్‌, ఈ సంఘటన తర్వాత…

Read More

రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలతో పాటు పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలను ఈ పోర్టల్‌లోనే నమోదు చేయాలని తెలిపింది. దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ”సమగ్రమైన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ పథకం” లో భాగంగా ఎలక్షన్‌ కమిషన్‌ ఈ పోర్టల్‌ను 3సీ వ్యూహంలో తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్రమ నిధులను అరికట్టడం, రాజకీయ పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఏడాది పాటు ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఈ పోర్టల్‌ పనిచేస్తుందని వెల్లడించాయి. ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951 మరియు కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక నివేదికలను…

Read More

ప్రతిపక్షాల తదుపరి భేటీ బెంగళూరులో ఈ నెల 17 18 తేదీలలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. బిజెపి వాషింగ్ మిషన్ ద్వారా ఇప్పుడు జరిగిన ముంబై ఆపరేషన్ పరిణామంతో ప్రతిపక్షాలు ఏకం కావాలనే సంకల్పం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్ పార్టీలో తిరుగుబాటుకు దిగి, మంత్రివర్గంలో చేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలనే ఆలోచన ఇప్పుడు మరింతగా కార్యాచరణకు మారుతుందని చెప్పారు. గత వారంలో ఎన్‌సిపి నేత శరద్ పవార్ ముంబైలో మాట్లాడుతూ ప్రతిపక్షాల తదుపరి సమావేశం బెంగళూరులోనే ఈ నెల 13, 14వ తేదీలలో జరుగుతుందని తెలిపారు. అయితే ఈ తేదీలలో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ సెషన్ ఉండటంతో , అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని ఈ నెల 17 , 18 తేదీల్లో బెంగళూరులో జరిపేందుకు…

Read More

తెలంగాణలో ఎవరు ఎవరికి బీ టీమో ప్రజలకు బాగా తెలుసునని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నడపలేక చేతులెత్తేసిన రాహుల్ గాంధీ  బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఖతం అంటున్న వారి పరిస్థితేంటో నాలుగు నెలల్లో ప్రజలు తేలుస్తారని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాని నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేయలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం,…

Read More