Author: Editor's Desk, Tattva News

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, పీయూష్ గోయల్ లతో భేటీలు జరిపి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మొదట కేటీఆర్ ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిశారు. అయితే, రాత్రి హోమ్ మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉన్నప్పట్టికీ ఆయన తీరిక లేకుండా ఉండడంతొ కలవడం సాధ్యం కాలేదు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పెట్రోలియం సహజ వాయు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ఆయన కోరారు. లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి…

Read More

కేదార్‌నాథ్ ఆలయం బంగారు తాపడం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీచే దర్యాప్తు చేయించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. గర్‌వాల్ కమిషనర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి హరిశ్చంద్ర సెమ్వాల్‌ను ఆదేశించినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి సత్పాల్ మహరాజ్ వెల్లడించారు. సాంకేతిక నిపుణులతోపాటు స్వర్ణకారులు కమిటీలో ఉండాలని ఆయన సూచించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దోషులు ఎవరో తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి వివరించారు. శ్రీబద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం 1939 ప్రకారం విరాళాలు అంగీకరించవచ్చునని, బంగారు తాపడం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని వివరించారు. భారత పురావస్తుశాఖ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరిగాయని చెప్పారు. గర్భగుడిలో బంగారు పూత పూయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాత అనుమతి తీసుఉన్నారని స్పష్టం చేశారు.…

Read More

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే కసరత్తు దాదాపు నెలరోజులుగా సాగుతోంది. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి, సీనియర్‌ నేత సోమణ్ణ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తానంటూ ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నలిస్‌కుమార్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తనవంతుగా కృషి చేస్తానని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, అధ్యక్ష పదవి ఇస్తే వంద రోజుల్లోనే పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది చూపుతానని సోమన్న తెలిపారు. రెండుసార్లు ఢిల్లీ వెళ్లి సీనియర్‌ నేతలను కలిశానని, పలు విషయాలు ప్రస్తావించానని చెప్పారు. 45ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, అధ్యక్ష పదవిని నిభాయిస్తానని వివరించానని…

Read More

రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని యెవ్‌జనీ ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్‌ గ్రూప్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేసింది. శనివారం ఉదయం జాతిని ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రసంగించిన కాసేపటికే వాగ్నర్‌ గ్రూప్‌ తన ప్రకటనను వెలువరించింది. ‘అతి త్వరలో మనం దేశానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. రష్యాపై సొంత ప్రైవేటు మిలటరీ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ తిరుగుబాటు చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అనూహ్య తిరుగుబాటుపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రైవేటు సైన్యం తిరుగుబాటును కఠినంగా అణచివేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వాగ్నర్ గ్రూప్ కూడా అంతే దీటుగా స్పందించింది. తమ దళాలు మాస్కో దిశగా దూసుకుపోతున్నాయని, పుతిన్ పెద్ద తప్పు చేశారని, త్వరలోనే రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తాడని వెల్లడించింది. రష్యా లోని రెండు కీలక…

Read More

డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా 12 మందికి డ్రగ్స్‌ విక్రయించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అంతే కాకుండా.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఒక హీరోయిన్‌తో పాటు టాలీవుడ్‌లో ఐటమ్‌ సాంగ్‌ చేసిన మరో హీరోయిన్‌కు కూడా నిందితుడు డ్రగ్‌ సరఫరా చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను పోలీసులు డీకోడ్‌ చేయగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో కేపీ చౌదరి వందలసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అషురెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. కొన్ని మీడియా వర్గాల్లో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు విచారణలో తెలిసిన వివరాలు ప్రకారం11 మందితో అనుమానాస్పద బ్యాంక్‌…

Read More

బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం నిర్వహించిన ప్రతిపక్షాల ఐక్యత తొలి సమావేశంలో 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి బిజెపిని ఓడించాలని నిర్ణయించారు. దేశంలో ఉన్న 17 పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని నిర్ణయించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఏవిధంగా పోరాడాలనే విషయంపై జులై 10- 12 తేదీలలో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో సమావేశమై ఒక ఎజెండాను రూపొందిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్ తెలిపారు. ప్రస్తుతం పాట్నాలో జరిగిన సమావేశం ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగు మాత్రమేనని భేటీలో పాల్గొన్న నేతలు వెల్లడించారు. అయితే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ కలిసికట్టుగా పోరాడాలని ఈ సమావేశంలో…

Read More

హైద‌రాబాద్‌లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరిన‌ట్లు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయిస్తే.. ల్యాండ్ ఫ‌ర్ ల్యాండ్ కూడా ఇస్తామ‌ని, తొమ్మిదేండ్ల కాలంలో ఐదుగురు ర‌క్ష‌ణ శాఖ మంత్రుల‌ను 15 నుంచి 20 సార్లు క‌లిశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. స్వ‌యంగా ప్ర‌ధానిని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసారని చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రం భార‌త‌దేశంలోనే శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న న‌గ‌రం అంటూ ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం ఉద్యోగాలు ఒక్క హైద‌రాబాద్ నుంచే వ‌స్తున్నాయని తెలిపారు. మ‌రో వైపు వ్యాక్సిన్ ప్రొడ‌క్ష‌న్‌కు హైద‌రాబాద్ గ్లోబ‌ల్ హ‌బ్‌గా మారిందని, ఫార్మా, బ‌యోటెక్ రంగంలో అదే విధంగా ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో కూడా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రంగా ఎదిగిందని వివరించారు. ఏ ర‌కంగా చూసినా ఈ…

Read More

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది మే 31 వ తేది వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లో భక్తులు శ్రీవారికి రూ.860 కోట్లకు పైగా విరాళాలు అందించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 176 పురాతన ఆలయాల పునరుద్దరణకు రూ.93 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ. 10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని, వీటిలో 1953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మిస్తాయని ఆయన వివరించారు. 2018 ఆగస్టు 28 న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైందని, 2019 సెప్టెంబర్‌ 23 న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000 విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి…

Read More

భారత్ ఎదగటమే కాకుండా త్వరిత గతిన అభివృద్ది చెందుతున్నామని చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మూడు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ప్రపంచాభివృద్ధి భారత్ – అమెరికా కలిసి నడవాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పరోక్షంగా పాకిస్థాన్ కు హెచ్చరికలు చేశారు. ప్రపంచంలోనే భారత్ ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా మారుతోందని వివరించారు. 9/11 దాడులు,26/11 దాడులను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దశాబ్దాల కాలం గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఎలాంటి సందేహాలకు తావు ఉండకూడదని తేల్చి చెప్పారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై గౌరవం , వివాదాలను శాంతియుతంగా పరిష్కరించటం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించటం పైనే గ్లోబల్ ఆర్దర్…

Read More

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మ‌ద్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో బిజెపి కీల‌క‌నేత అమిత్ షాతో కెటిఆర్ భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మరో ఐదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నా కేటీఆర్, అమిత్ షా భేటీలో ఇతర రాజకీయ వ్యవహారాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల…

Read More