తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే, అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాంబరంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలన ప్రజలకు వివరించేలా మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాభివృద్ధి తక్కువగా జరిగిందని చెప్పారు. కానీ, ప్రధాని మోదీ అధికారం చేపట్టి తర్వాత దేశాభివృద్ధి వేగవంతమైందని చెబుతూ కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ (రాజదండం) ఏర్పాటు తమిళనాడుకు సరికొత్త అధ్యాయం సృష్టించిందని తెలిపారు. అందువల్ల సెంగోల్ ప్రాముఖ్యత ప్రపంచానికే తెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రానికే వన్నె తెచ్చిన సెంగోల్‌ను పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలోనే ఆర్థికాభివృద్ధి మందగించకుండా కాపాడిన వ్యక్తి ప్రధాని మోదీ అని చెప్పారు. తమిళం ప్రపంచంలోనే ప్రాచీన భాష అని, తిరువళ్లువర్ సహా పలువురు…
Author: Editor's Desk, Tattva News
ఏపీలో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్స్ కేసులో ఇప్పటికే భారీగా ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మంగళవారం మరిన్ని చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్స్ కు చెందిన 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా గ్రూపుల్లో లావాదేవీలకు అవకాశం లేకుండా చేశారు. అలాగే త్వరలో మార్గదర్శి చిట్స్ పై కేంద్ర సంస్ధలతో దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నిస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో మంగళవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి టర్నోవర్ రూ.604 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు వ్యవహారంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అనంతపురం, అరండల్ పేట, నరసరావుపేట, విశాఖ, తణుకు, రాజమండ్రి బ్రాంచ్ ల పరిధిలో ఈ గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో అతిపెద్ద చిట్ ఫండ్…
రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. వడగాలుల తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్రం, ఐఎండికి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తుందని తెలిపారు. మరోవైపు వేడిగాలులు, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్)ని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఈ ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేలా తగిన సలహాలు , సూచనలు ఇవ్వాలని కోరారు. వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని మాండవీయ…
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని తన పూర్వపు విద్యాసంస్థ ఐఐటి బొంబాయితో తన అనుబంధాన్ని ప్రగాఢంగా చాటుకున్నారు. ఈ ప్రముఖ విద్యాసంస్థకు రూ 315 కోట్ల విరాళం అందించారు. ఎందరో ఐటి ప్రతిభావంతులకు వేదిక అయిన ఐఐటి ముంబైతో తన 50 ఏండ్ల అనుబంధాన్ని చాటుకుంటూ నిలేకని ఈ దాతృత్వపు ఆత్మీయతను చాటుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టాకోసం ఈ సంస్థలో విద్యార్థిగా 1973లో చేరారు. తన భవితకు ఈ విద్యాసంస్థ బంగారు బాటలు వేసిందని,ఈ సంస్థ బాగుకు, రాబోయే విద్యార్థితరానికి మేలు చేయాలనే సంకల్పంతో తాను విరాళాన్ని తన బాధ్యతగా అందిస్తున్నట్లు నిలేకని తరఫున ప్రకటన వెలువడింది. ముంబై ఐఐటిలో అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి సాధనాసంపత్తిని పెంపొందింపచేసేందుకు, తద్వారా ఈ సంస్థ మరింత ప్రామాణికంగా ఉండేందుకు ఈ విరాళాన్ని ఉద్దేశించినట్లు వివరించారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలో పరిశోధనల విస్తృతికి ఐఐటి బొంబాయి ద్వారా మరింతగా ప్రగాఢ టెక్ స్టార్టప్‌ల…
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల స్థాయిల్లో రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో స్వభావంతో సహా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పబ్లిస్ చేయడం తప్పనిసరని పేర్కొంది. పార్టీలు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన సవివరమైన సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని, నేరచరితులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. అదే సమయంలో నేర చరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయలేకపోవడాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, గతంలో అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు, వారి ఎంపికకు గల కారణాలతో పాటు జాబితాను పబ్లిష్ చేయడంలో విఫలమైనందుకు పలు పార్టీలను సుప్రీంకోర్టు మందలించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ…
మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. కాంటో సంబల్, చింగ్‌మాంగ్ గ్రామాల్లో ఆదివారం భారీగా కాల్పులు జరిగినట్లు సమాచారం. అదే సమయంలో కంటో సంబల్‌లోని ఐదు ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డాడు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాయుధ దుండగులు కాంటో సంబల్ నుంచి చింగ్‌మాంగ్ గ్రామం వైపు అకారణంగా కాల్పులు జరిపారని సైన్యం పేర్కొంది. సామాన్యుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ జవాన్ గాయపడ్డాడని, అతన్ని లిమాఖోంగ్ సైనిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా స్థానికుడు ఒకరు మాట్లాడుతూ ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాంటో సంబల్‌పై కాల్పులు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని, ఎవరైనా అడ్డం వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పవన్ కళ్యాణ్ ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆయన భద్రత విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని వై-కేటగిరి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పాలన గురించి అమిత్ షా, జేపీ నడ్డాలు స్పష్టమైన సంకేతాలిచ్చారని ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. ఏపీలో ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుందని దుయ్యబట్టారు. లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటి…
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గొప్ప వృద్ధిని నమోదు చేశాయి. 2023 జూన్ 17వ తేదీకి నికర పన్నుల సేకరణరూ.3,79,760 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఈ సేకరణ రూ. 3,41,568 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికర పన్ను సేకరణ 11.18 శాతం పెరిగింది. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 3,79,760 కోట్లు (17.06.2023 నాటికి)లో కార్పొరేషన్ పన్ను (సీఐటి) రూ. 1,56,949 కోట్లు (నికర రిఫండ్), వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టిటి)తో సహా రూ. 2,22,196 కోట్లు (నికర రిఫండ్) ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల స్థూల సేకరణ (రిఫండ్స్ కోసం సర్దుబాటు చేయడానికి ముందు) రూ. 4,19,338 కోట్లు ఉంటే, ఇది 2022-23 ఆర్థిక సంవత్సరపు వసూళ్ల కంటే 12.73% వృద్ధిని నమోదు చేసింది. అంటే మునుపటి ఆర్థిక సంవత్సరం సంబంధిత కాలంలో ఈ పన్ను సేకరణ రూ. 3,71,982 కోట్లు ఉంది. స్థూల పన్ను సేకరణ రూ. 4,19,338 కోట్లలో కార్పొరేషన్ పన్ను (సిఐటి) రూ.…
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) సోమవారం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ తెలిపారు. జేడీయూలో తమ పార్టీని విలీనం చేయబోమని సంతోష్ స్పష్టం చేశారు.మంత్రి పదవికి రాజీనామా చేసిన సుమన్, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఏఎంజాతీయ కార్యవర్గం సమావేశం అవుతుందని చెప్పారు. “మేము థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఎంపికను కూడా తెరిచి ఉంచుతున్నాము” అని హెచ్‌ఏఎం అధ్యక్షుడు చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం స్థాపించబడినప్పటి నుంచి చాలాసార్లు మిత్రపక్షాలు మార్చింది హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ. బీజేపీ జెడియుని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నితీష్ కుమార్ ఆరోపిస్తూ ఆర్జేడీతో కలిసి మహాగఠబందన్ సంకిర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు…
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. సోమవారం జరిగిన సమావేశం విశేషాలను ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులకు వివరించారు. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటుచేసిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్పీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోందని యన తెలిపారు. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నిరాదరణకు…