ఆదిపురుష్ సహా భారత చిత్రాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు సహా పర్యాటక నగరమైన పోఖ్రాలలో సోమవారం నుండి భారత చిత్రాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీత.. ఆగేయ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మిస్తే.. ‘ఆదిపురుష్’ సినిమాలో మాత్రం భారత్‌లోనే జన్మించినట్లు చూపించారంటూ అక్కడి అధికారులు మండిపడుతున్నారు. అలాగే ఖాట్మండులోని 17 థియేటర్‌లలో ఎలాంటి హిందీ సినిమా ప్రదర్శించకుండా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఖాట్మాండు మేయర్ బలెంద్ర షా పేర్కొన్నారు. సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్‌ని మూడు రోజుల క్రితం కోరినట్లు తెలిపారు. సంబంధిత సన్నివేశాన్ని మార్చకపోతే ఖాట్మండు మెట్రోపాలిటిన్ సిటీ (కెఎంసి)లో ఏ హిందీ చిత్రం ప్రదర్శితమయ్యే అవకాశం ఉండదని తెలిపారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ అభ్యంతకరకర పదాలను ఇంకా తొలగించలేదని.. దీంతో జూన్ 19 నుంచి ఖాట్మాండ్ మెట్రోపాలిటన్ (కెఎంసి) పరిధిలోని థియేటర్లలో ‘ఆదిపురుష్’ సహా అన్ని…
Author: Editor's Desk, Tattva News
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్, సిబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు గత నెల 31న మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసును విచారించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. గత మంగళవారం గత మంగళవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్,…
సిక్కింను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఉత్తర సిక్కిం జిల్లాలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను ఆర్మీ రక్షించినట్లు అధికారులు తెలిపారు. స్టైకింగ్, లయన్ డివిజన్, త్రిశక్తి కార్ప్స్ దళాలు ఆదివారం ఉత్తర సిక్కింలోని చుంగ్తాంగ్ వద్ద చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టక్ వైపు తరలించడానికి తాత్కాలిక వంతెనను దాటడానికి సహాయం చేసినట్లు తెలిపారు. గురువారం నుండి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పెంగాంగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో పాటు కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో లెచెన్, లచుంగ్ ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. దీంతో పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1500 మంది పర్యటకులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి తరలించారని, …
న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు బెంజిమిన్ నెతన్యాహు నేతృత్వంలోని పచ్చి ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర న్యాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ అంతటా మళ్లీ నిరసనలు హౌరెత్తాయి. అప్రజాస్వామికమైన ఈ న్యాయ సంస్కరణలపై ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ప్రతిష్టంభనలో పడిన కొద్ది రోజులకే టెల్ అవీవ్‌తో సహా అన్ని ముఖ్య పట్టణాలు నిరసనలతో అట్టుడికిపోయాయి. కరడుగట్టిన మితవాది బెంజిమిన్ నెతన్యాహు న్యాయమూర్తుల ఎంపిక అధికారం ప్రభుత్వానికే ఉండాలని పట్టుబడుతున్నారు అంతేకాదు, న్యాయ వ్యవస్థ అధికారాలకు కత్తెర వేసే పలు ప్రతిపాదనలను ఈ బిల్లులో పొందుపరిచారు. ఇజ్రాయిలీ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసేలా ఈ సంస్కరణలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. న్యాయ సంస్కరణలపై నిరసనలు వెల్లువెత్తుతుండడంతో దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని, ఇంతవరకు ఈ బిల్లును పక్కన పెడుతున్నామని గత మార్చిలో నెతన్యాహు ప్రకటించారు. ఈ వినాశకర సంస్కరణలపౖౖె అధ్యక్షుడు ఐసాక్ హెరోజ్ ప్రతిపక్షాలతో చర్చలు జరిపారు. బుధవారం ప్రతిపక్ష నాయకులు యాయిర్ లాపిడ్,…
గూగుల్ ప్లేస్టోర్ నుండి వివిధ రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తూనే ఉంటాం, యాప్‌లలో ప్రమాదకరమైనవి ఉంటాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిస్తోంది. ఈ సంస్థ స్పైవేర్‌ను కనుగొంది. ఇది ఫోన్ ఇమెయిల్‌ల సమాచారంతో పాటు ఫోన్ కెమెరాను ఉపయోగించి రికార్డులను కూడా దొంగిలిస్తుంది. ఈ స్పైవేర్ దేశంలోని 42 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వ్యాపించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 105 యాప్‌ల ద్వారా ఫోన్‌కి చేరిన దీని పేరు ‘స్పిన్ ఓకే’గా గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు రాకుండా, అనుమానాస్పద యాప్‌లను వారి మొబైల్ ఫోన్‌ల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖల సిబ్బందిని ఆదేశించింది. ఈ స్పైవేర్‌ను నివారించేందుకు వివిధ నిపుణులు కొన్ని మార్గాలను సూచించారు. కారణం లేకుండానే ఫోన్‌లో పదే పదే ప్రకటనలు వస్తూ ఉండడం మనం గమనిస్తాం. ఈ పరిస్థితిలో మీ…
జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్ ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్ ప్రచురణ సంస్థను ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని జ్యూరీ ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్టు చెప్పింది. జాతి, కుల, మత, లింగ బేధం లేకుండా గాంధీజా బాటలో శాంతియుత మార్గంలో నవప్రపంచ నిర్మాణానికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఈ ప్రైజ్‌ను ఏటా అందిస్తుంటారు. ఈ పురస్కారం కింద రూ.కోటి నగదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు. మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. 2019లో…
కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) హైదరాబాద్‍లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. విశాఖపట్నంలో ఔట్ డోర్ షూటింగ్ పూర్తి చేసుకొని, వారం క్రితం హైదరాబాద్ వచ్చాక రాకేశ్ మాస్టర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆయన రక్త విరేచనాలు చేసుకొని ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆదివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సాయంత్రం అయిదు గంటలకు రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. తీవ్రమైన మెటాబాలిక్ ఎసిడోసిన్ కావటంతో ఆయన శరీరంలోని కొన్ని అవయవాలు ఫెయిల్ అయ్యాయని, చివరి నిమిషంలో ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆట అనే డ్యాన్స్ షో ద్వారా రాకేశ్ మాస్టర్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ‘ఢీ’ షోలో చేశారు. అనంతరం ఆయనకు సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. చాలా సూపర్ హిట్ పాటలకు ఆయన కొరియోగ్రఫీ…
దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి యుగమని, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే వారిపై అకృత్యాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన ప్రజాస్వామిక సిద్ధాంతాలు అత్యున్నతమైనవని, మన రాజ్యాంగం సర్వోత్కృష్టమైనదని చెప్పారు. మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆదివారం మాట్లాడుతూ అయితే జూన్ 25 మన దేశంలో ఎమర్జెన్సీని విధించిన రోజు అని, దాన్ని ఎన్నటికీ మర్చిపోబోమని స్పష్టం చేశారు. 1975లో అప్పటి ప్రదాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. భారత దేశం గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసుకున్న విపత్తు నిర్వహణ సత్తా నేడు గొప్ప దృష్టాంతంగా మారిందని, బిపర్‌జోయ్ తుపాన్ వల్ల కచ్‌లో విధ్వంసం జరిగినా, ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలు , సర్వసన్నద్ధతతో ఎదుర్కొన్నారని ప్రధాని ప్రశంసించారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనా, భారతీయుల సమష్టి శక్తి , ఉమ్మడి బలం ప్రతి…
ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉందని, అధికారం నుంచి పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది చెబుతూ ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ “నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో ఉభయగోదావరి జిల్లాల పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే అని చెబుతూ, అయితే భయపెట్టే కొలది తాను మరింత రాటు దేలుతానని స్పష్టం చేశారు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసేందుకు జనసేన పార్టీ ప్రణాళిక ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బలమైన సిద్ధాంతమే మనందరినీ కలిపిందని పేర్కొంటూ…
సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు నిచ్చారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రివ్వూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ నుండి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ కంబైంన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాగా పని చేసిందని కొనియాడారు. ఏప్రిల్‌లో సుఖేయ్ జెట్‌లో ప్రయాణించడం తనకు చాలా గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్ల నుండి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం…