జాతీయ నీటి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం లభించింది. శనివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 4వ జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖర్ ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి బహుమతి అందుకుంది. రెండో స్థానంలో ఒడిశా, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. 11 విభాగాల్లో పురస్కారాలు ఇచ్చారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ తుడు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. రాష్ట్రం తరపున జలవనరుల అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ పాఠశాల విభాగంలో నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం రెండో స్థానం, ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సిసిఎల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మూడో స్థానం పొంది పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల విభాగంలో ఆనంతపురంలోని ఆక్టా ఫ్రెటరాు ఏకోలజీ…
Author: Editor's Desk, Tattva News
భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఇప్పుడు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నో ట్లు గల్లంతయ్యాయి. ఈ నోట్ల సంబంధిత వివరాలు సమాచారం ద్రవ్య విషయాల అత్యున్నత అధీకృత సంస్థ ఆర్‌బిఐ వద్ద లేదని వెల్లడైంది. సామాజిక కార్యకర్త మనోరంజన్ రా య్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అర్జీ క్రమంలో ఈ అత్యంత కీలకమైన సున్నితమైన ఆర్థిక ద్రవ్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, రూ.500 నోట్లు అదృశ్యమైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు కొట్టిపారేసింది. ఈ నివేదిక పూర్తిగా తప్పు అని, సమాచారాన్ని తప్పుగా వివరించారని తెలిపింది. ముద్రణాలయాల నుంచి ఆర్బీఐకి సరఫరా అయిన అన్ని బ్యాంక్‌నోట్లు సరైన విధంగా లెక్కల్లోకి వచ్చాయని తెలిపింది. ముద్రణాలయాల నుంచి ఆర్టీఐ చట్టం, 2005 ప్రకారం సేకరించిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వివరించారని తెలిపింది. బ్యాంక్‌నోట్ల లెక్కలు సక్రమంగా ఉండేలా చేసే పటిష్ట వ్యవస్థ ఆర్బీఐకి…
చైనాలో చాలామంది యువత లక్షలు వచ్చే జీతానికి బదులు సంతోషాన్ని కోరుకుంటున్నారు. అందుకే వైట్ కాలర్ ఉద్యోగాలు వదిలేసి వెయిటర్స్, చెఫ్స్, క్లీనర్స్, క్యాషియర్స్ వంటి బ్లూకాలర్ జాబ్స్ లోకి మారిపోతున్నారట. ఈ మేరకు జోరుగా వార్తలు వస్తున్నాయి. మై ఫస్ట్ ఫిజికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ జియోహోంగ్షులో వైట్ కాలర్ ఉద్యోగాలు వదిలేసిన వారు తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఈ ఉద్యోగాలలోలో తక్కువ వేతనం వచ్చినప్పటికీ ఎక్కువ సంతృప్తి, పనిలో ఆనందం ఉన్నాయని చెబుతున్నారు. టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ లో పనిచేసిన ఓ యువతి తాను కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో కుక్ గా పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఎనలేని ఆనందాన్ని పొందుతున్నానని పేర్కొన్నారు. రోజుకు తాను దాదాపు 140 డాలర్లు (భారత కరెన్సీలో రూ.11,000) సంపాదిస్తున్నానని, కానీ ఇప్పుడు తన…
నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ) దాచేపల్లి రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8 గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక ఏసీబీ కోర్టులో రవీందర్ గుప్తాను హాజరుపరిచారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్ గుప్తా లంచం డిమాండ్ చేయడంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వాహకులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరోవైపు, గత కొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం…
తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రానున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన విశాఖపట్టణం, తిరుపతి రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రూట్‌లో ట్రయల్ రన్ పూర్తి కాగా, సాధారణ కార్యకలాపాలకు అనువుంగా ఉందని రైల్వే శాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ వందేభారత్ రైలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరాన్ని హైదరాబాద్ నగరంతో అనుసంధానం చేస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం మరింత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు పట్టణాలకు హైదరాబాద్‌తో కనెక్ట్ చేయడం వల్ల ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం రెండు గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే నాగ్‌పూర్ వందేభారత్ రైలు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే,…
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి కొందరు ఆగంతకులు ఇంఫాల్‌లోని కొంగ్బా ప్రాంతంలోని రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఇంటిని దగ్ధం చేశారు. ప్రస్తుతం విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాను ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్నానని, కానీ, తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో ‘ అర్థం చేసుకోలేకపోతున్నానని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. `కొందరు నా ఇంటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కూల్చేశారు. ఈ సంగతి తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నా రాష్ట్రంలో సహచర పౌరులు ఇటువంటి పని, కార్యక్రమాలు చేస్తారని నేనెప్పుడూ అంగీకరించలేదు. ఇటువంటి ఘటన జరుగవద్దని నేను దేవుడిని ప్రార్థించాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. `తొలిసారి దాడి చేసినప్పుడు భద్రతా సిబ్బంది రక్షించారు. కానీ రెండోసారి గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో అంతా సాధారణంగా ఉందనుకున్న సమయంలో అకస్మాత్తుగా…
ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదని జమ్మూ-కశ్మీరులోని ముగ్గురు అక్కచెల్లెళ్లు నిరూపించారు. వీరు తొలి ప్రయత్నంలోనే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో విజయం సాధించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కఠినమైన పరీక్షలో వీరు చెప్పుకోదగ్గ మార్కులు సంపాదించారు. ఈ కజిన్ సిస్టర్స్ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు కావడం గమనార్హం. టుబ బషీర్, రుట్బా బషీర్, అర్బిష్ కజిన్ సిస్టర్స్. వీరు శ్రీనగర్ సమీపంలోని నౌషీరాకు చెందినవారు. వీరు శ్రీనగర్‌లోని ఇస్లామియా హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివారు. కశ్మీరు లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం వల్ల విపరీతమైన సమస్యలు ఎదురైనప్పటికీ వీరు మొక్కవోని దీక్షతో చదివారు. తల్లిదండ్రుల సహకారం, సరైన శిక్షణ వల్ల వీరు నీట్ పరీక్షలో విజయం సాధించారు. అర్బిష్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో వైద్యులు లేరన్నారు. అందుకే తాను వైద్యురాలిని కావాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇదే మొదటి, చివరి ప్రయత్నమని భావించి తాను నీట్ పరీక్ష కోసం…
లాంగ్ మార్చ్ 2డీ రాకెట్‌ను చైనా ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా 41 ఉపగ్రహాలను పంపింది. ఒకే మిషన్‌లో అన్ని శాటిలైట్లను పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో చైనా సరికొత్త రికార్డును సృష్టించిందని జిన్హువా మీడియా తెలిపింది. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయువన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్‌లో ఇది 476వ ఫ్లయిట్ మిషన్ కావడం విశేషం. ఇటీవల చంద్రునిపై వ్యోమగాములను ఉంచాలనే లక్ష్యంతో చైనా తన కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యక్తులను పంపిన సంగతి తెలిసిందే. చైనా ప్రయోగించిన శాటిలైట్లు.. కమర్షియల్ రిమోట్ సెన్సింగ్ సర్వీసులను కల్పించనున్నాయి. ఆ శాటిలైట్లలో 36 జిలిన్-1 సిరీస్‌కు చెందినవి. గురువారం నాటి ప్రయోగంతో ఇప్పటి వరకు చైనా మొత్తం 108 జిలిన్-1 శాలిలైట్లను ప్రయోగించినట్లు జిన్హువా తెలిపింది. దీంతో 100 కంటే అధిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో…
ప్రధాని నరేంద్ మోదీ జూన్ 20-25 వరకు అమెరికా, ఈజిప్టు దేశాల్లో అధికారిక పర్యటన చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా పర్యటించనున్నారు. ఈ పర్యటన న్యూయార్క్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో మోదీ పాల్గొననున్నారు. జూన్ 22న వాషింగ్టన్ డి.సికి వెళ్లనున్నారు. అక్కడ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఆయనకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఉన్నతస్థాయి సమావేశంలో ఇరువురు నేతలు చర్చలు జరుపుతారు. ఇక అదేరోజు సాయంత్రం మోదీ గౌరవర్థం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఎ) విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ స్పీకర్ చార్లెస్…
మహిళా పోలీస్ అధికారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన తమిళనాడు మాజీ స్పెషనల్ డీజీపీ రాజేశ్ దాస్‌ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ఆయనకు మూడేళ్ల కఠిన జైలు శిక్షను విధిస్తూ విల్లుపురం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 2021లో మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పర్యటన సందర్భంగా భద్రతా విధులకు వెళ్లి సమయంలో తనపై రాజేశ్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఆరోపించారు. ఆమె మాజీ డీజీపీపై చేసిన ఫిర్యాదులో తనకు ఎదురైన ఇబ్బందులను తెలియజేశారు. రాజేశ్ దాస్ తన చేతిని ముద్దాడుతూ, అతడి మొబైల్ ఫోనులో తన ఫొటోలు చూపిస్తూ తన ఫేవరెట్ లిస్ట్ అని చెప్పారని ఆమె వాపోయారు. స్పెషల్ డీజీపీ అతని కారులో కూర్చుని తదుపరి మీటింగ్‌కు రావాలని కోరారు.అలాగే పెరంబూర్ వరకూ డ్రాప్ చేస్తానన్నారు. సీఎం కార్యక్రమం ముగిసిన అనంతరం…