ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య రికార్డు స్థాయిలో 110 మిలియన్లకు చేరుకుంది. ఉక్రెయిన్, సూడాన్‌లలో యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం వంటి పరిస్థితులతో లక్షలాది మంది భద్రత కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్ హెచ్‌సిఆర్) పేర్కొంది. గత ఏడాది సుమారు 19 మిలియన్ల (190 లక్షలు) మంది తమ ప్రాంతాలను వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలిరావడంతో ఆ ఏడాది నిరాశ్రయుల సంఖ్యలో అత్యధిక వార్షిక పెరుగుదల నమోదైందని యుఎన్‌హెచ్‌సిఆర్ బుధవారం విడుదల చేసిన ‘యాన్యువల్ ఫోర్స్‌డ్ డిస్‌ప్లేస్‌మెంట్ రిపోర్ట్’లో తెలిపింది. దీంతో గతేడాది చివరి నాటికి ఆ సంఖ్య 108.4కు చేరినట్లు పేర్కొంది. 2023లో ప్రపంచంలో బలవంతపు స్థల మార్పిడి నిరంతరం పెరుగుతూనే ఉందని, గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ధనిక దేశాలతో పోలిస్తే.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం పేద దేశాలకు భారంగా మారుతోందని నివేదిక…
Author: Editor's Desk, Tattva News
బిపోర్‌జాయ్ తుఫాను అంతకంతకూ తీవ్రమౌతూ గుజరాత్‌పై విరుచుకుపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) బుధవారం తెలిపింది. గుజరాత్‌లోని సౌరాష్ర, కచ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జునాగఢ్, ద్వారక తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుఫాను తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం తుఫాను గుజరాత్ లోని జఖౌ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో ఈ తుఫాను కలిగించే నష్టాన్ని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భుజ్ విమానాశ్రయాన్ని జూలై 16 వరకు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దృష్ట్యా హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. బిపర్‌జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు,…
ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామిరెడ్డితోపాటు పీకే అయ్యర్, డీసీ ఆడిటర్ మణి ఊమెన్‌లను కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నది. కెనరా బ్యాంకు, ఐడీబీఏ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసిన మోసం కేసులో ఈడీ బుధవారం అరెస్టులు చేసింది. పలు బ్యాంకులు నుంచి రూ.8800 కోట్ల రుణాలను వెంకట్రామిరెడ్డి గతంలో తీసుకున్నారు. ఈ రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగవేసినందుకు గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేయగా, ఆయన షరుతలతో కూడిన బెయిల్‌పై అప్పట్లో బయటకొచ్చారు. అయితే సిబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి గత కొంతకాలంగా విచారణ చేపడుతోంది. అందులో భాగంగా వెంకటరామిరెడ్డితో పాటు…
సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డోర్సే చెబుతున్న విషయాలన్నీ పచ్చి అబద్ధాలని కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపారేశారు. బహుశా ట్విట్టర్ చరిత్ర నుంచి చాలా సందేహాస్పద కాలాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ట్వీట్ చేశారు. సోమవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డోర్సే భారత ప్రభుత్వంపై ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఏ ప్రభుత్వంనుంచైనా మీకు ఒత్తిళ్లు ఎదురయ్యాయా? అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డోర్సే భారత్‌ను ఉదహరించారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వంనుంచి తమకు చాలా అభ్యర్థనలు వచ్చేవని డోర్సే ఆరోపించారు. ఒకానొక…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని వీరి ఇల్లు, ఆఫీసుల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏకంగా 70 ప్రత్యేక బృందాలు ఈ సోదాలను జరుపుతున్నట్టు సమాచారం. శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తుండగా దానికి సంబంధించిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల సోదాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. కూకట్ పల్లిలోని జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో కూడా ఐటీ అధికారుల సోదాలు…
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 18 గంటల సేపు విచారించి బుధవారం తెల్లవారు జామున కస్టడీలో తీసుకుంది. ఆ వెంటనే వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడకు చేరుకోగానే సెంథిల్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని బిగ్గరగా ఏడవడంతో హైడ్రామా చేటుచేసుకుంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు చెబుతుండగా, అధికారికంగా అరెస్టు విషయాన్ని తమకు తెలియజేయలేదని డీఎంకే నేతలు తెలిపారు. ఆయనపై లంచం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈడీ విచారణకు గతంలో అనుమతి ఇచ్చింది. దీంతో మనీల్యాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ మంత్రి బాలాజీతో పాటూ మరికొంత మంది ఇళ్లలో సోదాలు నిర్వహించింది. సచివాలయంలో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్‌లో కూడా తనిఖీలు జరిగాయి. మంత్రి సెంథిల్ బాలాజీ భారీ స్థాయిలో మనీ…
పర్యాటక ప్రదేశంగా అంబేడ్కర్ స్మృతివనం తీర్చిదిద్దుతామని రాష్ట్ర హరిత, సుందరీకరణ కార్పొరేషన్ ఎండీ బి. రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 125 అడుగుల అంబేడ్కర్ స్మృతి వనాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. అంబేడ్కర్ స్మృతి వనంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి ఏయే ప్రాంతంలో సుందరీకరణ పనులు ప్రారంభించాలో సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి సూచనలతో పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్మృతివనం మొత్తం విస్తీర్ణం 19.4 ఎకరాలు కాగా, ఇందులో 8.9 ఎకరాలు పచ్చదనానికి కేటాయించామని కార్పొరేషన్ ఎండీ బి.రాజశేఖర రెడ్డి వివరించారు. విగ్రహం చుట్టూ పచ్చదనం ఉండేలా ముందు వైపు 1.65 ఎకరాలు, వెనుక వైపు 5.39 ఎకరాలు, కుడివైపు 1.48 ఎకరాలు, ఎడమవైపు 0.35 ఎకరాల్లో గ్రీనరీ పనులు చేపడుతున్నామని ఆయన…
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. దయాకర్ రెడ్డి మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుండి రెండు సార్లు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంకు కృషిచేసిన వారిలో దయాకర్ రెడ్డి ఒకరని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్ రెడ్డి పనిచేశారు. దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డికి టీడీపీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజకీయ జీవితం టీడీపీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది. సీతా దయాకర్ రెడ్డి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.…
ఉత్తర ప్రదేశ్ త్వరలోనే భారత్ కు గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని ఆ రాష్త్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. కైలాష్ మఠ్ లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ యూపీ అభివృద్ధిలో ఎలా పరుగులు తీస్తోందో కార్యకర్తలకు వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో యూపీ గతంలో ఉన్న బీమారూ స్టేట్ (అనారోగ్య రాష్ట్రం) నుంచి ఇప్పుడు అభివృద్ధి రాష్ట్రంగా పరుగులు తీస్తోందని ఆదిత్యనాథ్ బీజేపీ కార్యకర్తలకు తెలిపారు. ప్రస్తుతం యూపీ అభివృద్ధికీ, భద్రతకు, సుపరిపాలనకు మోడల్ గా మారిందని యోగీ వెల్లడించారు. త్వరలో భారత్ కే గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని యోగీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహా యజ్ఞంలో కలిసి రావాలని ప్రజల్ని కూడా కోరారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో యూపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టిఫిన్ పే చర్చా మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్యనాథ్ వెల్లడించారు. బీజేపీ…
ప్రచండ గాలులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న భీకర తుఫాను ‘బిపర్‌జోయ్’ కారణంగా జరిగబోయే ఆస్తినష్టాన్ని వీలైనంతగా నివారిస్తూ, ప్రాణనష్టం ఏమాత్రం లేకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఈ తుఫాను ప్రభావం, సన్నద్ధతపై సోమవారం ఆయన అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో ప్రమాదం అంచున ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాను గాలులతో జరిగే విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని తుఫాను వెలిసిన వెంటనే వేగంగా పునరుద్ధరించేలా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కేవలం మనుషులే కాదు, జంతువులకు కూడా భద్రత కల్పించాలని ప్రధాని అధికారులను కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించేలా తగిన సహకారం అందించాలని, అలాగే విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు మొదలైన అన్ని అవసరమైన సేవలకు కలిగే విఘాతాన్ని అంచనా వేసుకుని, తక్షణమే పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్…