బైక్ టాక్సీ అందించే ఉబెర్, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఢిల్లీ సర్కారు కొత్త విధాన్ని రూపొందించే వరకు ద్విచక్ర వాహనాలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ సర్కారు కొత్తగా నోటీసు జారీ చేసింది. ఢిల్లీలో బైక్-టాక్సీలు నడపకూడదని, ఉల్లంఘనలకు పాల్పడే అగ్రిగేటర్లకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం-1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ జారీ చేసిన షోకాజ్ నోటీసును రాపిడో ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఆదేశాలు ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను, సహజ న్యాయ సూత్రాలను ర్యాపిడో ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.…
Author: Editor's Desk, Tattva News
దేశంలోని ప్రముఖులు, పౌరుల వ్యక్తిగత వివరాల కొవిన్ పోర్టల్ నుంచి లీకయ్యాయని వచ్చిన వార్తలు అసత్య ప్రచారాలు అని కేంద్ర ఆరోగ్య శాఖకొట్టి పారేసింది. ఆరోగ్యశాఖకు సంబంధించిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని తేల్చి చెప్పింది. కొవిన్ పోర్టల్‌లోని ప్రముఖులు, రాజకీయ నేతలు సహా సామాన్య పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉందని, ఎలాంటి భయాలు వద్దని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత సమాచారం లీకైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని వెల్లడించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్‌టీని కేంద్రం కోరింది. కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమైందని, అందులోని సమాచారాన్ని రహస్యంగా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ – డీడీఓఎస్, రెగ్యులర్ వల్నరబిలిటీ అసెస్‌మెంట్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు వెల్లడించింది. ఓటీపీ వినియోగించి మాత్రమే కొవిన్ పోర్టల్‌లోని సమాచారాన్ని చూడగలమని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.…
కర్ణాటక ఎన్నికలలో సగానికి సగం బలం కోల్పోయిన జేడీఎస్ రానున్న లోక్ సభ ఎన్నికలలో బిజెపితో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కొట్టిపారేసారు. లోక్‌సభ ఎన్నికలకు ఇతర పార్టీలతో సర్దుబాట్లు లేదా అవగావహనపై ఇప్పుడు ఎటువంటి ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పరిస్థితిని బట్టి అవసరం అయినప్పుడు దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీల మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక లోపాయికారి అంశంపై చర్చ జరగడం సర్వసాధారణం. ఇందులో అనేకం కేవలం ఊహాగానాలకు కూడా దారితీస్తుంటాయని కుమారస్వామి తెలిపారు. ఇప్పుడు వెలువడ్డ వార్త కేవలం వదంతా లేక ఇందులో నిజం ఉందా? అనేదానిపై కేవలం ఎన్నికల దశలోనే లేదా ఈ ప్రక్రియల తరుణంలోనే ఏదైనా చెప్పేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా తమ పార్టీలో జిల్లాలవారి…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి వారాహితో ప్రచారం ప్రారంభించనున్న సందర్భంగా సోమవారం ధర్మపరిరక్షణ యాగం చేశారు. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ గావించారు. సోమవారం ఉదయం 6గం.55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్థితియుక్త…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిన్ పోర్టల్ టెలిగ్రామ్‌లో లీకైంది. కరోనా వ్యాక్సిన్ డోస్‌లను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌లో దేశ ప్రజల సమాచారాన్ని నిక్షిప్తం చేసింది. ఈ కొవిన్ పోర్టల్‌లో సమాచారం లీక్ కావడంతో ప్రజల ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ సమాచారం, పాస్‌పోర్ట్ నెంబర్ సహా పుట్టిన తేదీ, వ్యాక్సిన్ పొందిన ప్రాంతం తదితర సమాచారం మొత్తం లీకైనట్లు తెలుస్తోంది. అలాగే వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకున్నారన్న సమాచారంతో పాటు ఫోన్ నెంబర్లు కూడా లీకయ్యాయి. ఫోన్ నెంబర్‌కు బదులుగా ఆధార్ నెంబర్‌ను నమోదు చేసినప్పటికీ ఈ వివరాలు మొత్తాన్ని పొందవచ్చని మొదటగా మలయాళ వెబ్‌సైట్ ది ఫోర్త్ న్యూస్ నివేదించింది. ఎవరు యాక్సెస్ చేసినా సమాచారం అందుబాటులోకి వచ్చే విధంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కాంగ్రెస్ నేతలు కెసి. వేణుగోపాల్, జైరాం రమేష్,…
అమెరికా నేతృత్వంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు చైనాను లక్ష్యంగా చేసుకునేందుకు డీ కపులింగ్ స్థానంలో డీ రిస్కింగ్‌తో వ్యవహరిస్తున్నాయని, కానీ ఇది కొత్త సీసాలో పాత సారా వంటిదని చైనా వ్యాఖ్యానించింది. ‘డీ రిస్కింగ్’ గురించి మాట్లాడేటపుడు ముందుగా అసలు ముప్పు ఎక్కడ ఉన్నదో గుర్తించాలి, శాంతి, సౌభాగ్యం, మానవాళి సంక్షేమం వీటికి నిజమైన ముప్పు చైనా వ్యతిరేకుల నుండే వస్తోందని చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా వ్యాఖ్యానించింది. చైనాను లక్ష్యంగా చేసుకునే డీ రిస్కింగ్ గురించి కొందరు మాట్లాడుతున్నారు. చైనా నుంచి ప్రపంచానికి ఎలాంటి ముప్పు లేదు. అసలు ముప్పు అంతా అమెరికా, దాని తైనాతీల నుంచే. వాటి గుత్తాధిపత్య ధోరణి నుంచే. అందుకే పశ్చిమ దేశాల డీ రిస్కింగ్ ఇప్పుడు ప్రపంచానికి అవసరం అని పేర్కొన్నది. పశ్చిమ దేశాలు తమ అహంకారాన్ని వీడి బహుళ ధ్రువ ప్రపంచం వాస్తవికతను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మంచిదని సిన్హువా…
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్ర జలశక్తి 2023-24 నీటి సంవత్సరంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడటం లేదు. 50:50 ప్రాతిపదికన కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ పట్టుబడుతున్నప్పటికీ బచావత్ ‘ట్రిబ్యునల్ ను అనుసరించి 66:34 నిష్పత్తినే కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. వేసవి కాలం పూర్తయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయం దగ్గర పడుతుంటంతో ఎగువన వర్షాలు పడితే కృష్ణాలో ప్రధాన ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలంకు వరదలు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో వాటాలను తేల్చాలని రెండు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. దీనిపై గత ఏడాది దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో రిజర్వాయర్ మేనేజ్ మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) ఏర్పాటయింది. రెండు రాష్ట్రాల్ర జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో పాటు జెన్ కో ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది నుంచి ఈ…
జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. విశాఖలోని రైల్వేస్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో 20 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు. కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన ఫొటో పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెప్పుకుంటున్నారు కానీ.. రైతుల ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల విషయంలో.. ఏపీ మూడో స్థానంలో ఉందన్న అమిత్ షా.. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం విద్రోహ శక్తుల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో ఏపీ…
బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా తమను వేధించారంటూ మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీస్‌లు ఆరోపణలకు బలం చేకూర్చే ఫోటో, ఆడియో, వీడియో సాక్షాలు ఉంటే ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరారు. బ్రిజ్ భూషణ్ తమను 2016 నుంచి 2019 మధ్య లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇద్దరు మహిళా రెజ్లర్లు ఏప్రిల్ 21న ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్ పోలీస్ సేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రిజ్ భూషణ్ శ్వాసను పరీక్షించే నెపంతో 10 నుంచి 15 నిమిషాల సేపు ఆయన తమ ఛాతీపై చేతులు వేసేవాడని, అక్కడి నుంచి చేతులు కిందకు జారుస్తూ పొట్టపై నొక్కేవాడని, ఆ సమయంలో తాను ఛాతీకి అడ్డంగా తన చేతిని పెట్టుకున్నానని రెజ్లర్లలో ఒకరు ఆరోపించారు. ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఇద్దరు మహిళా…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుండి తలపెట్టిన వరాహ యాత్ర మార్గంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ యాత్ర సాగే కోనసీమ జిల్లాలో సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు శనివారం రాత్రి పోలీసులు ప్రకటన జారీ చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆంక్షలపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. జనసేన యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే పోలీసులు ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 28 వరకు వపన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. అమలాపురంలో దాదాపు మూడు నెలల…