బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. హింసాత్మక నిరసనల కారణంగా ఓ కిరాణా దుకాణం యజమాని మరణానికి ఆమె కూడా కారణమని పేర్కొంటూ ఈ కేసు నమోదైంది. ఆమెతో పాటు ఆరుగురు వ్యక్తులను కూడా పోలీసులు ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చారు. వారిలో అవామీ లీగ్ పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. నిరసనలకు సంబంధించి షేక్ హసీనాపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. రిజర్వేషన్ల రద్దుకు అనుకూలంగా జులై 19న ముహమ్మద్‌పూర్‌లో ఆందోళన జరిగింది. అయితే నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబూ సయ్యద్ అనే కిరాణా దుకాణం యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దాంతో చనిపోయిన వ్యక్తి సన్నిహితుడు ఈ కేసు పెట్టారు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్లా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్…
Author: Editor's Desk, Tattva News
పశ్చిమబెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికంగా ఈ కేసు దర్యాప్తులో గణనీయమైన పురోగతి కనిపించడం లేదని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. యంత్రాంగం బాధితురాలి లేదా బాధితురాలి కుటుంబంతో లేదని పేర్కొనడం సమంజసమేనని కోర్టు పేర్కొంది. ఆగస్ట్ 14 ఉదయం 10.00 గంటలకల్లా కేసు డైరీ, ఇతర రికార్డులను సిబిఐకి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించాలని నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులను కోర్టు కోరింది. ఈ కేసు మొదట్లో ప్రిన్పిపాల్‌పై హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని, తాలా పోలీస్ స్టేషన్‌నలో అసహజ మరణంగా ఎందుకు నమోదు చేశారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ట్రైనీ మృతదేహం రహదారిపై కనిపించలేదని, ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేయాలని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మరు భట్టాచార్యలతో కూడిన డివిజన్…
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన సిగ్గుచేటని కోల్‌కతాలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందనేందుకు ప్రత్యక్ష ఉదాహరణని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వంలా వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరుగుతున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సీఎంగా ఉన్న రాస్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. కాగా, ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యురాలి హత్యాచార కేసులో దర్యాప్తు ప్రారంభమైందని, నిందితుడిని సత్వరమే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆదివారం లోగా పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కితీసుకురాకుంటే కేసును సీబీఐకి అప్పగిస్తామని దీదీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై తనకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ సమాచారం అందించగానే విచారకర…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం వెల్లడించింది. సిబిఐ, ఇడి కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఇడి అరెస్టు చేయగా, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో…
దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బిఎ), నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తాయి. మొత్తం 13 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఐఐటి మద్రాస్ అగ్ర స్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి. ఐఐటి మద్రాస్ తర్వాత, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి), బెంగళూరు, ఐఐటి బాంబే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంజనీరింగ్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ మొత్తం విభాగాల్లో అగ్రస్థానంలో నిలవగా, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే తరువాతి స్థానాల్లో నిలిచాయి. పరిశోధనా విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అత్యుత్తమ సంస్థగా నిలిచింది. యూనివర్శిటీ విభాగంలో ఐఐఎస్‌సి బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు), జామియా…
హిండెన్‌బర్గ్ తాజా నివేదికపై బీజేపీ పాలకులే లక్ష్యంగా విమర్శల దాడి చేపట్టిన కాంగ్రెస్ తీరును బీజేపీ ఎండగట్టింది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత స్టాక్ మార్కెట్ల సమగ్రతను ప్రశ్నిస్తూ దేశంలో ఆర్దిక అరాచకాన్ని ప్రేరేపిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ నివేదిక శనివారం వచ్చిందని, ఆదివారం దీనిపై గందరగోళం చెలరేగితే సోమవారం క్యాపిటల్ మార్కెట్‌లో అస్ధిరత నెలకొంటుందని గుర్తు చేశారు. అదానీ విదేశ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో వెల్లడించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ఆరోపణలు నిరాధారమైనవని మాధవి పురి బుచ్ తోసిపుచ్చారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. ఇక ఈ నివేదిక వెల్లడించిన సమయాన్ని పరిశీలిస్తే ఏదో జరుగుతున్నదని అర్ధమవుతుందని…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టు నుండి బెయిల్ పై విడుదల కావడంతో తనకు కూడా అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగలదని ఎదురు చూసిన బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కె కవితకు సోమవారం నిరాశ ఎదురైనది. ఈ కేసులో సిబిఐ, ఈడీ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం వారిద్దరికీ నోటీసులు ఇస్తూ, కేసును ఈ నెల 20కు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్…
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షల మంది హిందువులు, బుద్ధిస్ట్లు, క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. చిట్టగాంగ్‌లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు ఏడు లక్షల మంది హాజరైనట్లు అంచనా. మరోవైపు అమెరికాలోనూ ‘బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించండి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 300 ఇండియన్-అమెరికన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన హిందువులు ఇందులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఉద్దేశంతో పనిచేసే మీడియా సంస్థల్ని మూసివేయక తప్పదని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ హెచ్చరించింది. నిజాయతీని మీడియా కాపాడకపోతే ఏ దేశమైనా పతనమవుతుందని హోంశాఖ సలహాదారుడు సఖావత్ హుస్సేన్ పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా రఫాత్ అహ్మద్ ఆదివారం ప్రమాణం చేశారు. ఆందోళనకారుల అల్టిమేటంతో ఒబైదుల్ హసన్ ప్రధాన న్యాయమూర్తి స్థానం నుంచి వైదొగిలిన విషయం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితాను తయారీని ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కొత్త పేరు (గ్రామ సంక్షేమ కార్యాలయం)తో అక్టోబరు 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళనను వీఆర్వో సంఘాలు స్వాగతించాయి. ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల పనితీరు, బాధ్యతలు, స్థానిక సమస్యలు, పరిష్కార చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు.…
బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హ స్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. “సెయింట్ మార్టిన్ ద్వీ పంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి, అమెరికా కు బంగాళా ఖాతంలో పట్టు కల్పిస్తే ప్రధాని పదవిలో కొనసాగేదాన్ని” అని ఆమె అమెరికాపై నేరుగా ఆరోపణలు చేశారు. విద్యార్థుల శవాలపై అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకొన్నారని, దానిని అంగీకరించలేక ప్రధాని పదవికి తాను రాజీనామా చేశానని హసీనా పేర్కొన్నారు. అతివాదుల మాయలో పడవద్దని బంగ్లాదేశ్ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. తిరిగి త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తానని తెలిపారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు, సామాన్యులు హత్యకు గురైన విషయం తెలిసి చాలా బాధపడ్డానని హసీనా చెప్పుకొచ్చారు. పలువురు పార్టీ నేతల ఇళ్లను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది మే నెలలో కూడా హసీనా ఓ…