నాలుగు రోజుల తర్జనభర్జనల అనంతరం సస్పెన్స్ ఓ కొలిక్కి వచ్చింది. కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగాను, స్టేట్ యూనిట్ చీఫ్‌గాను డి.కె.శివకుమార్ కానున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ తరఫున కెసి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా గురువారం పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే అధికారిక ఎన్నికలు ముగిసే వరకు శివకుమార్ కెపిసిసి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. డికె. శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా ఉండాలన్న షరతుకు పార్టీ అంగీకరించడంతో డీల్ కుదిరింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఇద్దరు కర్ణాటక నేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పలు దఫాలుగా జరిపిన సమావేశాల అనంతరం ఎట్టకేలకు దక్షిణాది కర్ణాటక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా శివకుమార్ నియమితులు కానున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన గురువారం సాయంత్రం 7.00 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) సమావేశంలో వెలువడనున్నది. కాగామే 20 మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణలో టీఎస్ పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నిందితుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఈకేసులో తాజాగా సిట్ అధికారులు మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. దీంతో పేపర్ లీక్ కేసులో అరెస్టైన పాత్రధారులు, సూత్రధారుల సంఖ్య 35కి చేరుకుంది. బుధవారం అరెస్ట్ చేసిన వాళ్లలో ఈ పేపర్ లీక్ స్కామ్ కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి రాజశేఖర్ భార్యతో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి సిట్ అధికారులుతీసుకున్నారు. వాళ్లను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన వాళ్లను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సిట్ అధికారులు వాళ్లిస్తున్న సమాచారం ప్రకారం కొత్త వాళ్లను ఈవ్యవహారంతో సంబంధాలు ఉన్న వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అయితే పేపర్ లీక్ స్కామ్‌లో మరికొందరు ఉన్నట్లుగా సిట్ భావిస్తోంది. వాళ్ల పేర్లను బయటకులాగి కటకటాల వెనక్కి పంపేందుకు విచారణ వేగవంతం చేస్తోంది. బుధవారం అరెస్ట్ చేసిన నలుగురి కంటే ముందు ముగ్గురు కీలక సూత్రధారుల్ని అరెస్ట్ చేశారు.…
భూతాపం కారణంగా సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని అనేక తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు భవిష్యత్‌లో ముంపునకు గురువుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మిగతా పట్టణాలతో పోలిస్తే, మూడురెట్ల వేగంగా న్యూయార్క్ సిటీ మునిగిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలో ఏ నగరంలోనూ లేని విధంగా ఆకాశహర్య్మాలతో కాంక్రీట్ జంగిల్‌ను తలపించేలా న్యూయార్క్ సిటీ అభివృద్ధి చెందింది. అయితే అక్కడి నేల తట్టుకోలేనంత బరువుతో ఆ భవనాలు కట్టేశారు. ఫలితంగా నెమ్మదిగా కుంగటం మొదలైంది. స్పష్టంగా చెప్పాలంటే మన ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్ కుంగిపోయి ఇళ్లు బీటలవారి, నేల నెఱ్రలువీరిన తీరులో న్యూయార్క్ శిథిలమవబోతోందన్నమాట. కాకపోతే జోషిమఠ్ పర్వత సానువుల్లో ఉంది. న్యూయార్క్ సిటీ సముద్రతీరంలో ఉంది. అడ్వాన్సింగ్ ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ జర్నల్‌లో ఇటీవల న్యూయార్క్ సిటీ ముంపునకు సంబంధించిన పరిశోదనా పత్రం ప్రచురితమైంది. సముద్రమట్టాలు పెరగడం, నగరంలో కాంక్రీట్ నిర్మాణాల బరువును అక్కడి నేల…
టిడిపి నేత ఎవి సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. వీరిద్దరిని కర్నూలు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. నంద్యాల జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఎవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సుబ్బా రెడ్డిని కారులో ఎక్కించి, అక్కడ్నించి ఆస్పత్రికి తరలించారు. ఎవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదుయ్యాయి. ఈ క్రమంలోనే అఖిలప్రియ పిఎ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆనంతరం బుధవారం ఉదయం అఖిలప్రియ ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.…
దేశ రక్షణ రంగానికి చెందిన కీలక రహస్య సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందించారన్న నేరంపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రఘువంశీ, మాజీ నేవీ కమాండర్ ఆశిష్ పాఠక్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్ట్ చేసింది. రఘువంశీ, పాఠక్‌లను స్పెషల్ సిబిఐ కోర్టు ముందు హాజరు పర్చగా, వారిని ఆరు రోజుల పాటు సిబిఐ కస్టడీకి పంపించారు. కొంతమంది భారతీయ జర్నలిస్టులు రక్షణ రంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని విదేశీసంస్థలకు అందిస్తున్నారని, దీనివల్ల మిత్ర దేశాలతో భారత్‌కు ఉన్న దౌత్యసంబంధాలకు విఘాతం కలుగుతుందని సమాచారం అందడంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి రఘువంశీని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారిస్తోంది. ఢిల్లీ పోలీస్‌ల నుంచి సిబిఐ ఈ కేసును స్వీకరించి విచారణ చేపట్టింది. జర్నలిస్ట్ రఘువంశీ రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ప్రాజెక్టుల వివరాలు, భవిష్యత్తులో రక్షణ దళాలు సేకరించనున్న ఆయుధాలు వంటి వాటికి సంబంధించిన అత్యంత కీలక…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మే 9 తర్వాత దాఖలైన ఏ కేసులోనూ మే 31 వరకు అరెస్ట్ చేయొద్దని పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తనను మళ్లీ అరెస్టు చేయబోతుందనే అనుమానంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ ఖాన్ ఇమ్రాన్ విజ్ఞప్తిని అంగీకరించారు. ఈ వాదనల సమయంలో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫున గోహర్ ఖాన్ వాదనలు వినిపించారు. ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన అన్ని కేసుల వివరాలను కోరుతూ పీటీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. పీటీఐ చీఫ్‌పై దేశవ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయని ఖాన్ పార్టీ చెబుతోంది. అల్- ఖాదిర్…
అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలి విజయం లభించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం.జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ…
టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ నాయకులు రోడ్డున పడి కొట్టుకున్నారు. నంద్యాల జిల్లాలో పాదయాత్ర జరుగుతుండగా రెండు వర్గాల మధ‌్య తలెత్తిన ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దిగవంత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఆస్తుల వివాదం నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డికి అఖిల ప్రియ వర్గానికి మధ్య గత కొన్నాళ్లుగా రగడ నడుస్తోంది. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి గాయపడ్డారు. దానితో, భూమా అఖిల ప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం నంద్యాలకు తరలించారు. అఖిలప్రియ పి ఎ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం బుధవారం ఉదయాన్నే ఆమె ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు నిన్నటి ఘటన, అక్కడి పరిణామాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆమెను…
పాకిస్థాన్ ఏజెంట్‌కు సున్నితమైన రహస్య సమాచారం అందించినందుకు గాను డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కురుల్కర్‌కు ఫుణె స్పెషల్ కోర్టు రిమాండ్ విధించింది. మే 29 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మే 3వ తేదీన కురుల్కర్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కురుల్కర్ పూణేలోని డీఆర్‌డీఓ ల్యాబ్‌లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కేసులో కురుల్కర్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ పేర్కొనడంతో ప్రత్యేక కోర్టు అతని కస్టడీని పొడిగించింది. వాట్సాప్, వీడియో కాల్స్ సహాయంతో శాస్త్రవేత్త “పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్” (పిఐఓ) ఏజెంట్‌తో సన్నిహితంగా ఉన్నారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారి గత వారం పేర్కొన్నారు. ఇది హనీట్రాప్ కేసుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. సైంటిస్టు కురుల్కర్‌ను అరెస్టు చేసిన తర్వాత పలు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు…
దేశంలోకి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి రుతు పవనాలు కేరళ లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండి) తెలియజేసింది. అప్పటి వరకు ఎండలు మండుతాయని వెల్లడించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసిన హీట్ వేవ్ ఈనెల మొదటి, రెండువారాల్లో తక్కువగా ఉందని, ఇప్పుడు క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలియజేశారు. గత ఏడాది మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకున్నాయి. కాగా 2021లో జూన్ 3న, అంతకు ముందు ఏడాది జూన్ 1న ప్రవేశించాయి. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పటినప్పటికీ భారత్‌లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం గత నెల ప్రకటించింది. దేశంలో…