ఉద్యోగ నియామకాల విధానంలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురావడంతో అవినీతి, బంధుప్రీతికి ఎక్కడా అవకాశం లేకుండా అంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రోజ్‌గార్ మేళా సందర్భంగా దేశ వ్యాప్తంగా 71,000 ఉద్యోగ నియామక పత్రాలను మంగళవారం ప్రధాని మోదీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నియామక అవకాశాలు, మౌలిక సదుపాయాలు విస్తృత పర్చడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం దగ్గర నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్ అయిందని చెప్పారు. దేశంలో ఉపాధి రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకమూ యువతకు ఉపాధి కల్పించేందుకు మార్గంగా నిలిచిందని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా కృషి చేశామని పేర్కొన్నారు ఈరోజు…
Author: Editor's Desk, Tattva News
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘స్పై’ సినిమాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్యాల నేపథ్యంలో నిర్మిస్తున్నారు. సోమవారమే న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద ‘స్పై’ టీజర్ విడుదల చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చారు. సుభాష్‌చంద్రబోస్ గారి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ దాని పనులు చాలామందికి తెలీవు. ఎంటర్ ట్కెన్ మెంట్ తోపాటు దేశానికి తెలియాల్సిన పాయింట్ ఇందులో వుందని హీరో నిఖిల్ హైదరాబాద్ లో మీడియాతో చెప్పారు. ఈ మధ్యకాలంలో జాతీయ అంశాలు ఉన్న సినిమాలు ఏవైనా వస్తేఏదో ఎజెండాతో వస్తున్నట్లు ఒక ముద్ర వేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. స్పై అజెండా బేస్డ్ సినిమానా? అనే ప్రశ్న ‘స్పై’ టీమ్‌కు ఎదురైంది. దీనికి నిఖిల్ సమాధానమిస్తూ..…
పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి త్వరలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో మే 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలుస్తోంది. 2014 మే 26న భారత ప్రధానిగా మోదీ మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2020 డిసెంబర్‌లో ఆయన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన చేయగా 2021 అక్టోబర్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించారు. దాదాపుగా పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణ పనులను కేంద్ర గృహ నిర్మాణ శాఖ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. మొత్తం 1,224 మంది ఎంపీలకు కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త…
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణాలో సహితం ఆ పార్టీ లో జోష్ పెరుగుతున్నది. ఇప్పటి వరకు సొంతంగా పార్టీ పెట్టుకొని, పాదయాత్ర ద్వారా తెలంగాణాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహితం కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసే దిశలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సంవత్సరం చివరిలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా ప్రభావం చూపలేమని గ్రహించిన ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర వహించిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తున్నది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్లను పొందడంతోపాటు ఏపీలో సీఎం జగన్ కు చెక్ పెట్టవచ్చని శివకుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ విషయమై ఇప్పటికే వారిద్దరి మధ్య…
మయన్మార్ లో మోకా తుఫాను సోమవారం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల పలు పట్టణాల్లో వరదలు పోటెత్తాయి. తీరంలోని పది లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీళ్లు చేరాయి. తుఫాను ధాటికి పశ్చిమ మయన్మార్ తీర ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. సిత్వె టౌన్ షిప్‌లో మఠాలు, స్కూళ్లలో తలదాచుకున్న 20 వేల మందిలో బలమైన గాలులకు 700 మంది గాయపడ్డారు. భీకర గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరద నీళ్లు వీధులు, ఇండ్లలోకి చేరాయి. దీంతో స్థానికులు బిల్డింగులు, అపార్ట్మెంట్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సముద్ర మట్టం 12 అడుగుల ఎత్తుకు పెరిగింది. సముద్రపు నీళ్లలో చిక్కుకున్న వెయ్యి మందిని రెస్క్యూ బలగాలు రక్షించాయి. తుఫాను ధాటికి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. ఆదివారం మధ్యాహ్నం మోకా తుఫాను తీరం దాటింది. ‘‘ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత తుఫాను కాస్త బలహీనపడింది. వరద…
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో విచారణను హాజరుకావలసిందిగా వైసిపి ఎంపి అవినాష్ రెడ్డికి సిబిఐ తాజాగా సోమవారం మరో నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ కోఠిలోని కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రావలసిందిగా ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఇప్పటికే పలు మార్లు విచారణకు హాజరైన అవినాష్ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని గతంలో ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ విచారించిన కోర్టు అవినాష్ కు బెయిల్ మంజూరు చేయకుండా విచారణను వాయిదా వేసింది. దీనిపై సుప్రీం కోర్టుకు అప్పిల్ కు అవినాశ్ వెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు గత నెల 25 వ తేది వరకు మాత్రమే అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 25 తర్వాత అవినాష్ అరెస్ట్ తప్పదనే వాదలను బలంగా వినిపించాయి. తాజాగా సిబిఐ అకస్మికంగా అవినాష్ కు విచారణకు రావలసిందిగా నోటీస్…
తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని మొదటినుండి అసంతృప్తితో మగ్గిపోతున్న కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తాజాగా తమ పార్టీకి చెందిన రాజస్థాన్ ప్రభుత్వంకు అల్టిమేటం జారీ చేశారు. తాను కోరిన మూడు డిమాండ్లు నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన తప్పదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను సోమవారం హెచ్చరించారు. రాష్ట్రంలో గత బిజేపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదంటూ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాటు సాగించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో పైలట్ మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. అవినీతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌తోపాటు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌పిఎస్‌సి)ను రద్దు చేసి తిరిగి పునరుద్ధరించాలని, పేపర్ లీక్…
భాగ్యనగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్), హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించి బాబానగర్, చాంద్రాయణ గుట్టలో ఈ ఇద్దరు హిజ్బ్ ఉత్ తహరీర్ (హెచ్‌యుటి) మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 19కి చేరింది. అరెస్టైన వారిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 11 మంది, మిగిలిన ఎనిమిది మంది హైదరాబాద్‌కు చెందిన వారు. కాగా సోమవారం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులను స్థానిక కోర్టులో హాజరుపర్చి భోపాల్‌కు తరలించారు. అయితే దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్‌తో ఏదో ఒక లింకు బయటపడేది. అయితే ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు తగ్గాయి. కానీ హైదరాబాద్‌లోనే ఎనిమిది మంది ఉగ్రవాదులు అరెస్ట్ కావడం కలకలం రేపుతుంది. నిందితులు తమ ఉనినికి బయటకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసు కున్నారు. డార్క్ వెబ్ సైట్లను వినియోగించారు.…
భారత దేశం, అమెరికా బహుళ రంగాల్లో సత్సంబంధాలను విస్తరించుకుంటున్నాయి. ఎగుమతుల నియంత్రణలను గాడిలో పెట్టడం, హై-టెక్ కామర్స్‌ను మరింత విస్తరించడం, ఇరు దేశాలు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు మార్గం సుగమం చేయడం వంటివాటిపై దృష్టి పెడుతున్నాయి. వీటన్నిటి కోసం ఇనీషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐసెట్) ఫలితాలను అమలు చేయడంలో భాగంగా మొదటి వ్యూహాత్మక వాణిజ్య చర్చలు జూన్ 4, 5 తేదీల్లో జరగబోతున్నాయి. ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య ఐసెట్ (ఐసెట్) మొదటి సమావేశం జనవరి 31న జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు అమెరికన్ కామర్స్ సెక్రటరీ గినా రైమండో మార్చి 10న భారత దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక వాణిజ్య చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా వచ్చే నెల ప్రారంభంలో అమెరికా వెళ్తారు. అమెరికన్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ అండర్…
ముంబై డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఫ్యామిలీ నుంచి కేపీ గోసావి అనే సాక్షి సుమారు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సీబీఐ అధికారులు తమ విచారణలో తేల్చారు. క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో దొరికిన ఆర్యన్ ఖాన్‌పై కేసు పెట్టకుండా ఉండేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖడే రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే సీబీఐ ఇటీవల ఆ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021, అక్టోబర్ 2న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆ క్రూయిజ్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు ఆరోపణలు రావడంతో దానిపై నార్కోటిక్స్ పోలీసులు దాడి చేశారు. అయితే ఈ కేసులో సమీర్ వాంఖడేపై ఆరోపణలు రావడంతో శుక్రవారం (మే 12న) సీబీఐ అధికారులు సుమారు 29 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ముంబై, ఢిల్లీ, రాంచీ, లక్నో, గౌహతి, చెన్నై నగరాల్లోనూ…