Author: Editor's Desk, Tattva News

తెలంగాణలో రజాకార్ల, బకాసురుల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ నిర్వహించినట్లే.. తెలంగాణలో హిందువులను సంఘటితం చేసేందుకు హిందూ ఏక్తా యాత్ర చేపట్టామని చెప్పారు. కర్నాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడం వల్లే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. కరీంనగర్‌‌‌‌లో ఆదివారం రాత్రి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి ఆయన హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. ‘‘హిందువుల గురించి మాట్లాడొద్దంటున్నారు. తెలంగాణలో 80 శాతానికి పైగా హిందువులు ఉన్న హిందువుల గురించి మాట్లాడాలా వద్దా’’ అని ప్రజలను ప్రశ్నించారు. ఇక్కడ కూడా పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటే ఒప్పుకొందామా?” అని ప్రశ్నించారు. మజ్లిస్‌ పార్టీ పెద్దలకు చెందిన మెడికల్‌…

Read More

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తేల్చేందుకు మాత్రం కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్య, తదితర కీలక నేతలతో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రధానంగా ఈ పోటీ ఆశిస్తున్న శివకుమార్, సిద్దరామయ్యలను ఢిల్లీకి పిలిపించారు. సోమవారం ఈ విషయమై ఢిల్లీలో సంప్రదింపులు జరుగుతున్నాయి. కర్ణాటక తదుపరి సీఎంను ఎంపిక చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకే వదిలేయాలని సీఎల్‌పీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. సమావేశానికి ముందు, సీఎల్పీ తన నివేదికను పార్టీ హైకమాండ్‌కు పంపుతుందని, ఇది తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి పేరును నిర్ణయించడానికి సమయం తీసుకుంటుందని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య ముందు వరుసలో ఉన్న…

Read More

తీరిక లేకుండా ఆఫీస్ పనిచేస్తూ గడిపే కార్పొరేట్ ఉద్యోగులకు విధినిర్వహణలో ఉండగానే తమ తమ ఆఫీస్ లలోనే మద్యం సేవించే సౌలభ్యాన్ని హర్యానా ప్రభుత్వం కలిగించింది. ఈ మేరకు 2023 – 2024 మద్యం పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. ఈ నిర్ణయానికి మే 9న హర్యానా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అయితే, తక్కువ ఆల్కహాల్ ఉండే మద్యాన్ని మాత్రమే తాగాలని షరతు విధించింది. ఆల్కహాల్ తక్కువగా ఉండే బీర్లు, వైన్లు, మరికొన్ని పానీయాలను పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తోటి ఉద్యోగులతో కలిసి మద్యం సేవించవచ్చని చెప్పింది. 5 వేల మందికిపైగా ఉద్యోగులు ఉండి, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆఫీసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. జూన్‌ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హర్యానా సర్కార్ తెలిపింది. ఈ అనుమతి కోసం కార్పొరేట్‌ సంస్థలకు ఎల్-10 ఎఫ్ అనే…

Read More

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు వారాలుగా నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు తన నిరసనకు మద్దతు తెలుపవలసినదిగా బిజెపి మహిళా నేతలను అభ్యర్ధించారు. ఇప్పటివరకు అధికార బీజేపీకి చెందిన ఏ నాయకుడు కూడా భారత రెజ్లర్లకు మద్దతుగా ముందుకు రాలేదు. సోమవారం నుంచి బీజేపీకి చెందిన మహిళా ఎంపీలందరికీ రెజ్లర్లకు మద్దతు తెలియజేయాలని లేఖలు రాస్తామని వినేశ్ పోగట్ తెలిపారు. దేశంలోని మహిళల భద్రత గురించి వారు మాట్లాడుతూ తాము కూడా వారి బిడ్డలమే అని పేర్కొంటూ బీజేపీలోని మహిళా లీడర్లు, కేంద్ర ప్రభుత్వంలోని మహిళా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. తాము వారికి (అధికార పార్టీ మహిళా పార్లమెంటేరియన్లు) బహిరంగ లేఖ రాస్తున్నామని చెబుతూ తమ తోటి రెజ్లర్లు ఆ లేఖలను చేతితో అందజేస్తారని ఆమె తెలిపారు.  ఇ-మెయిల్ ద్వారా కూడా లేఖలు పంపిస్తామని చెప్పారు. ఇన్ని…

Read More

కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) తదుపరి డైరెక్టర్‌గా కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ విరమణ అనంతరం ప్రవీణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం సమావేశమైంది. కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డిజిపి సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఈ పదవి కోసం ఎంపిక చేసింది. చివరికి ప్రవీణ్ సూద్‌ను సిబిఐ డైరెక్టర్‌గా నియమించింది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ రెండేళ్ల పదవీ కాలం మే 25తో ముగుస్తుంది. ఆయన తర్వాత ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్‌గా…

Read More

మోచా తుఫాను ఆదివారం నేల తాకనుండడంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు వేలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మోచా తుఫాను వల్ల అక్కడ పెను నష్టం సంభవించే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాలలో మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన లక్షలాది మంది శరణార్థులు నివసిస్తున్నారు. గాలి వేగం గంటకు 210 కిమీ. (130 మైళ్ల) వేగంతో వీచనున్నది. ఈ తుఫాను హరికేన్ 4వ కేటగిరికి సమానం. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఆగ్నేయ బంగ్లాదేశ్‌, ఉత్తర మయన్మార్‌ మధ్య సిట్టవా సమీపంలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 180 నుంచి 190, అప్పుడపుడు 210 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తరువాత పెను తుఫాన్‌ సాయంత్రానికి మరింత బలహీనపడిందని పేర్కొంది. తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొందని, నాలుగైదు…

Read More

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కు వైసీపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చేసింది. కరకట్ట వద్ద ఉన్న బాబు గెస్ట్ హౌస్ ని అకస్మాత్తుగా అటాచ్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసే ముందు స్థానిక న్యాయమూర్తికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీనిని కరకట్ట వద్ద లింగమనేని అనే రియల్ ఎస్టేట్ బిగ్ షాట్ నిర్మించి, చంద్రబాబుకు ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు క్విడ్ ప్రోకో గా దీనిని ఇచ్చారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్న అనేక కేసులను ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం పెద్దలు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారని అంటున్నారు.…

Read More

మహారాష్ట్ర అకోలా జిల్లా పాతబస్తీలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో 144 సెక్షన్‌ విధించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. చిన్న వివాదం కాస్త ముదిరి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ విధించినట్లు అకోలా కలెక్టర్ నీమా అరోరా పేర్కొన్నారు. నిరసనకారుల గుంపు పలు వాహనాలను ధ్వంసం చేసిందని, వివాదస్పద ఘటన తర్వాత పాతబస్తీ పోలీస్ స్టేషన్‌ ఎదు జనం గుమిగూడారని అధికార వర్గాలు తెలిపారు. ఓ గుంపు వాహనాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అకోలాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట అకోట్‌ ఫైల్‌ ప్రాంతంలో…

Read More

మల్లినాధుని జన్మస్థలం, మెదక్ జిల్లా కొల్చారంలో తెలుగు సంస్కృత భాషా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యల కోసం కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. సమైక్య పాలనలో విస్మరించబడిన తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింపచేసుకోవాలని సిఎం తెలిపారు. కాలగర్భంలో విస్మరించబడిన మల్లినాథసూరి వంటి నాటి ప్రముఖ భాషా కవి పండిత మహనీయుల ఘన చరిత్రలను వెలికితీయాలని సిఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ భావి తరాలకు శాంతిని భక్తిభావనలు పంచే ఆధ్మాత్మిక కేంద్రంగా, అన్ని వర్గాలకు అందుబాటులో వుండే కమ్యునిటీ సెంటర్‌గా కొనసాగుతుందని సిఎం ఆకాంక్షించారు. ఈ భవనాన్ని, ఈ నెల 31వ తేదీన ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో బ్రాహ్మణ పరిషత్ భవన్ రాష్ట్రంలో దైవ భక్తిని పెంపొందించే దిశగా ఆధ్మాత్మిక…

Read More

తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్‌ఓడీలు, ఉద్యోగులందరూ హాజరవుతారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టియర్స్ డే’గా జరుపనున్నారు. అమరుల స్మారక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, విద్యుద్దీపాలతో వెలిగించి.. గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలని నిర్ణయించారు. అలాగే జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేయననున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి. మరో 20రోజుల పాటు వరుసగా ఆయా శాఖలు సాధించిన…

Read More