Author: Editor's Desk, Tattva News

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రతా వైఫల్యాలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రానికి ముష్కరుల నుంచి ముప్పు పొంచి ఉందని, కేంద్ర నిఘా సంస్థలు పలుమార్లు హెచ్చరిస్తున్నా అడుగడుగునా నిర్వహణ లోపం కనిపిస్తోంది. తాజాగా గత నెల 30న ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని, సులభ కార్మికుల రూపంలో తిరుమల పుణ్య క్షేత్రంలో ఉగ్రవాదులు ప్రవేశించారని తిరుపతి జిల్లా ఎస్‌పి పరమేశ్వరరెడ్డికి మెయిల్‌ రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుమల కొండతో పాటుగా తిరుపతి, అలిపిరి ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫేక్‌ ఈ మెయిల్‌ అని తెలియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఫేక్‌ మెయిల్‌ పంపిన వారి కోసం పోలీసులు కనిపెట్టే పనిలో పడ్డారు. నాలుగంచెల భద్రత కలిగి, అనుక్షణం సిసి కెమెరాల నిఘా నేత్రంలో ఉండే తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ భక్తుడు సెల్‌ ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో…

Read More

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారునిగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక రకాలు ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కేసీఆర్ సలహాదారుగా చేరుతారని లేదా రెరా చైర్మన్ అవుతారని లేదా బీఆర్ఎస్‌లో చేరి ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. సోమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ – క్యాట్‌ ఉత్తర్వులతో సోమేష్ కుమార్ రాష్ట్రంలోనే కొనసాగారు. ఆ సమయంలో ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా…

Read More

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. ఏఈఈ పేపర్‌ కూడా లీక్‌ కావడంతో, ఈ కేసులో తాజాగా మ‌రో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. ఈ న‌లుగురు ప్రధాన నిందితుడు ప్రవీణ్ ను ఎఈఈ పేప‌ర్ కొనుగోలు చేసిన‌ట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ న‌లుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా ఏఈఈ పరీక్ష పేపర్‌ను ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ లీక్‌ చేసి ఒక్కో పేపర్‌ను రూ.10 లక్షలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. చాలా మందికి ఏఈఈ పేపర్‌ను ప్రవీణ్‌ అమ్మాడని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం కూడా ముగ్గురిని  సిట్ అరెస్ట్ చేసింది.  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్  కొనుగోలు  చేసిన ముగ్గురిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.  ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ నుండి  ఈ ముగ్గురు పేపర్ ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. మనోజ్, మురళీధర్ రెడ్డితో పాటు మరో…

Read More

పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ లో పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. మార్చి 7న ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, మంగళవారం ఆర్మీ అరెస్ట్ చేసింది. ఇస్లామాబాద్ లోని కోర్టు వద్ద ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఇమ్రాన్ లాయర్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పాక్ ఆర్మీ అతనిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో పిటిఐ పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. తనను హత్య…

Read More

రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్‌అవెన్యూ కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తంచేసింది. స్టేట్‌మెంట్ల సాయంతో తప్ప, ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడింది. అప్రూవర్‌ చెప్పిన వివరాలనే ఈడీ ప్రామాణికంగా తీసుకోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. రూ. 100 కోట్ల అక్రమాలు జరిగినట్టు చెప్తున్న ఈడీ నగదును మాత్రం లక్షల్లోనే చూపించడంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ విస్మయం వ్యక్తంచేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం రాజేశ్‌ జోషి, వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రాకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు. మద్యం పాలసీలో అక్రమ లావాదేవీలు జరిగాయనడానికి ఈడీ తగిన ఆధారాలు చూపించట్లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం, బిఆర్ఎస్…

Read More

లవ్ జిహాద్ పేరుతో తెలంగాణలో కూడా దారుణాలకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం ఆయన పార్లమెంట్ సభ్యుడు డా. కె. లక్ష్మ ణ్‌తో కలిసి కాచిగూడలోని తారకరామ థియేటర్ లో సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా కేరళ స్టోరీస్ అని చెప్పారు. పేరు ప్రఖ్యాతలు, వ్యాపారం కోసం సినిమా తీయలేదని, ఈ సినిమా సమాజానికి కొన్ని జాగ్రత్తలు చెప్పిందని చెప్పారు. కేరళ తో పాటు దేశవ్యాప్తంగా ఐసిస్‌లాంటి ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంటు న్నాయని పేర్కొంటూ ఇది కేరళకు మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. సినిమాలో చూపించింది 5 నుంచి 10 శాతమే మాత్రమే అని చెబుతూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశాన్ని అస్థిర పర్చాలని ఉగ్రవాద శక్తులూ చూస్తున్నాయని, ఈ సినిమాను తప్పకుండా మీ పిల్లలకు చూపించాలని సూచించారు. తెలుగు…

Read More

పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఈ ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లలోకి గృహ ప్రవేశాలు చేయాలని భారీ టార్గెట్‌ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కొద్దిలో దాన్ని అందుకోలేకపోయింది. అప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల ఇళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఉగాది సమయంలో లబ్దిదారుల సెంటిమెంట్‌, అసెంబ్లి సమావేశాలు జరుగుతుండడంతో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. అప్పుడు వాయిదా పడ్డ ఐదు లక్షల గృహ ప్రవేశాలను ఈసారి ఈనెల చివరిలోపు పెద్ద పండుగలా జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని సిఎం జగన్మోహన్‌రెడ్డి హౌసింగ్‌ అధికారులను తెలియజేసి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొద్దిగా పనులు ఆలస్యమైనప్పటికీ రోజుకు రెండు వేల గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీ షా తెలిపారు. భారీ టార్గెట్‌ను పెట్టుకున్న హౌసింగ్‌ అధికారులు అందకనుగుణంగా చకాచకా పనులు సాగిస్తున్నారు. ఇతర డిపార్టమెంట్లలో నిధుల కొరత ఉన్నప్పటికీ…

Read More

తమ రాష్ట్రంలో “ది కేరళ స్టోరీ” సినిమాపై నిషేధం విధిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ సినిమా దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో విద్వేషపూరిత, హింసాత్మక ఘటనలను నివారించేందుకు, శాంతిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఆమె చెప్పారు. కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో ఈ సినిమాను నిర్మించారు. మే 5న ఈ చిత్రం విడుదల కాగా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. తమిళనాడులోని థియేటర్ల నుంచి ఈ సినిమాను ఇప్పటికే తొలగించారు. ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన తొలి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. అయితే మమత నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా తెలిపారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని ఆయన చెప్పారు. అదే సమయంలో తమిళనాడులో సినిమాను బ్యాన్ చేయాంటూ ఎన్‌టీకే పార్టీ అధినేత…

Read More

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సర్వం మహిళా దళాల రిపబ్లిక్ డే పరేడ్‌తో సాగుతుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచే తగు రీతిలో సంబంధిత ఏర్పాట్లు జరుతున్నాయని వివరించారు. భారతీయ సైనిక బలగంలో, ఇతర కీలక రంగాలలో ఇనుమడించిన నారీశక్తిని ప్రపంచానికి ప్రతీకగా తెలియచేసేందుకు మొత్తం మహిళా దళాల రిపబ్లిక్ డే పరేడ్‌కు సంకల్పించారు. ఈ విషయాన్ని అధికార కర్తవ్యపథ్‌లో ఈ సాంప్రదాయక కవాతు జరుగుతుంది. 2024 రిపబ్లిక్ పరేడ్ గురించి మార్చిలోనే రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ మంత్రిత్వ శాఖలు, త్రివిధ సైనిక బలగాలకు సమాచారం పంపించింది. పలు ప్రభుత్వ విభాగాలు కూడా సంబంధిత పరేడ్‌కు ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేపట్టాలని ఇందులో తెలిపారు. ఈ సందర్భంగానే కేవలం మహిళా దళాలతో కూడిన కవాతు గురించి పరిశీలించాలని కూడా సూచించారు. తరువాతి క్రమంలో దీనిపై అంగీకారం కుదిరింది. కవాతులో అన్ని…

Read More

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారత ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. “కర్ణాటక సార్వభౌమత్వం” అంటూ సోనియా మాట్లాడటం పట్ల ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈనెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సార్వభౌమత్వం అని ఓ సభలో సోనియా గాంధీ అనడం రాజకీయ దుమారాన్ని రేపింది. దేశం నుంచి కర్ణాటకను విభజించాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆదివారం ఆరోపించారు. సోమవారం ఇదే అంశంపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. సార్వభౌమత్వం వాఖ్య చేసిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్‍పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. “కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ అనుమతించదు” అని సభలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను మే 6న కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. దీంట్లో సార్వభౌమత్వం అనే మాట దుమారాన్ని రేపుతోంది.…

Read More