ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది కాస్తా సోమవారంకు అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు మోచా అని భారత వాతావరణశాఖ నామకరణం చేసింది. ఇది పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఒడిశాకు తుపాన్ ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం తీరప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది.…
Author: Editor's Desk, Tattva News
ఇప్పటికే రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంకు పది రెట్ల పెద్దదైన భారీ మద్యం కుంభకోణం ఛత్తీస్‌గఢ్‌లో బయటపడింది. ఈ స్కామ్ వెనుక రాయ్‌పూర్ మేయర్ ఏజాబ్ దేభర్ సోదరుడు అన్వర్ దేభర్ కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో అక్రమ నగదు చలామణి చట్టం (పిఎంఎల్‌ఎ) కింద శనివారం అర్ధరాత్రి రాయ్‌పూర్ లోని ఓ హోటల్‌లో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ స్కామ్ ద్వారా నిందితులకు రూ. 2 వేల కోట్లు లభించాయని ఆరోపించింది. ఆ రాష్ట్రంలో అమ్ముడయ్యే ప్రతి మద్యం సీసా నుంచి అన్వర్ అక్రమంగా డబ్బు వసూలు చేశారని పేర్కొంది. ఏడు సార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ పేర్కొంది. తరచూ సిమ్ కార్డులు మారుస్తున్నాడని చెప్పింది. ఈ నేపథ్యంలో హోటల్ వెనుక డోర్ నుంచి అన్వర్ తప్పించుకోడానికి ప్రయత్నించగా అధికారులు అరెస్టు చేశారు. చత్తీస్‌గఢ్ లోని…
దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఘట్టం సోమవారంతో ముగుస్తుంది. పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. అధికారంలో ఉన్న బిజెపికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోన్న ఈ రాష్ట్రంలో ప్రాబల్యపు జెడిఎస్ గణనీయ రీతిలో తన ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా ప్రముఖ నేతల ప్రచారం, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోలతో ప్రచారం వేడెక్కింది. ప్రధాని మోదీ ఆదివారం బెంగళూరులో భారీ రోడ్‌షో నిర్వహించారు. శనివారం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ హుబ్లీ లో ప్రచార సభలో పాల్గోన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలను అధిగమించేందుకు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి యత్నిస్తోంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ కీలక అసెంబ్లీ ఎన్నికలలో తమ గెలుపుతో కాంగ్రెస్‌కు పూర్వపు జవసత్వాలను రంగరింపచేసుకోవాలని ఈ పార్టీ వర్గాలు సాగుతున్నాయి.ఈ పార్టీలో ప్రముఖ నేతలు స్థానిక కుల మత రాజకీయాలకు అనుగుణంగా…
తమిళనాడులోని మల్టీప్లెక్స్ లలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం తో పాటు పలు ముఖ్యనగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షో లను యాజమాన్యాలు రద్దుచేశాయి. థియేటర్ల వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కొన్నిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అందుకే చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) నిరసన చేపట్టింది. చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్‌లో ‘నామ్ తమిళర్ కట్చి’ పార్టీ నేత, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు…
ఓఆర్‌ఆర్ తక్కువ ధరకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఓఆర్‌ఆర్ నిర్వహణను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఓఆర్‌ఆర్ ఏటా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని చెబుతూ. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరం హైదరాబాద్ అని, అయినా ఓఆర్‌ఆర్‌కు వస్తున్న ఆదాయాన్ని తక్కువ చేసి ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. 30 ఏళ్లలో హెచ్‌ఎండిఎకు 75 వేల కోట్ల రూపాయలు టోల్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం కోసం చేసిన అప్పులు అన్ని తీరిపోయాయని, అప్పులు తీరిపోతే టోల్ ప్రీ చేసే పాలసీ ఉందని ఆయన పేర్కొన్నారు. కాని దీనికి విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి…
గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో ఆదివారం కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. అల్లర్లతో ప్రభావితమైన చురాచంద్‌పూర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఏడుగంటల నుండి పది గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆహారం, మందులతో పాటు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆర్మీ డ్రోన్స్, హెలికాఫ్టర్‌లతో ఏరియల్ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం పదిగంటలకు కర్ఫ్యూ సడలింపు ముగిసిన వెంటనే ఆర్మీ మరియు అస్సాం రైఫిల్స్ కాలమ్స్ చురాచంద్‌పూర్‌లో మార్చ్ చేపట్టాయి. మణిపూర్‌లో సుమారు 10,000 మందికి పైగా సైనికులు, పారామిలటరీ మరియు కేంద్ర పోలీసు బలగాలను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్క చురాచంద్‌పూర్‌లోనే 120-125 ఆర్మీ కాలమ్స్‌ను మోహరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం కూడా 3 గంటల నుండి 5 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. శాంతి…
కర్ణాటక ఎన్నికల ప్రచారం గడువు సోమవారం ముగుస్తుండగా, బెంగుళూరులో వరుసగా రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ మరో భారీ రోడ్‌షో నిర్వహించారు. శనివారం నగరంలో సుమారు 26 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో 10 కి.మీ మేర రోడ్ షో కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) పరీక్ష దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రోడ్‌షోను కుదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ తిప్పసాంద్ర రోడ్ లోని కెంపేగౌడ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభమైంది. కెంపేగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సెంట్రల్ బెంగళూర్ 5 నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రధాని రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు…
పల్నాడు జిల్లాలోని నల్లమల రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులులు దాడి చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని శివారు పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా పులి గురించే చర్చిస్తున్నారు. నల్లమల సమీప ప్రాంతాల్లో బెబ్బులి సంచారం అలజడి సృష్టిస్తోంది. పల్నాడులోని లోయపల్లి, గజాపురంతోపాటు వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో వ్యాఘ్రాలు ఆహారం, నీటి కోసం పొలాలు, వాగుల వెంబడి బయట సంచరిస్తున్నాయి. పల్నాడులోని విజయపురిసౌత్ ప్రాంతంలో తరచూ పులుల సంచారం ఉంటోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటి సంచారం పల్నాడు జిల్లా వైపునకు వస్తున్నట్లు అంచనా…
వేయి సంవత్సరాల చరిత్ర , సంప్రదాయంతో నిండిన గంభీరమైన క్రైస్తవ క్రతువులతో మూడో చార్లెస్ యునైడ్ కింగడమ్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. 21వ శతాబ్దపు బ్రిటన్‌ను ప్రతిబింబించేలా రాచరికాన్ని స్వీకరించాడు. సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్ పాలన కాలంలో ఒక్కసారి మాత్రం ఉపయోగించిన బంగారు, పవిత్ర చిహ్నం గ్రీన్విచ్ మీన్ టైమ్ ఉదయం 11.00 గంటలకు ఆయన తలపై తాపారు. ‘రాజును దైవం రక్షించుగాక’ అన్న నినాదాలు ప్రజలు చేశారు. వెస్ట్ మినిష్టర్ అబ్బే వద్ద బూరలు ఊదారు, తుపాకీ వందనం చేశారు. 1953 తర్వాత బ్రిటిష్ రాజుగా, 1838 తర్వాత ఐదో రాజుగా చార్లెస్ పట్టాభిషిక్తుడయ్యాడు. చర్చీలలో గంటలు మోగాయి. 7000 పదాతి దళం, అశ్విక దళం కవాతు నిర్వహించారు. 1937 తర్వాత రాజు పట్టాభిషేకం కావడం ఇదే మొదటిది. టెలివిజన్‌లో ప్రసారం కావడం రెండోది. కలర్‌లో ఆన్‌లైన్‌లో ప్రసారం కావడం మొదటిది. చార్లెస్ పట్టాభిషేకానికి ఇది మతపరమైన ధృవీకరణ. 74 చార్లెస్…
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి ) హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సైక్లోన్ ‘మోచా’ అని పేరు పెట్టారు. తుఫాను సంభావ్య గమనం, తీవ్రత అనిశ్చితంగానే ఉన్నాయి. ఇది నివాసితులు, అధికారులలో ఆందోళన కలిగిస్తోంది. ఐఎండి ట్విట్టర్ ఖాతా ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మే 8 నాటికి అల్ప పీడన ప్రాంతం ఏర్పడుతుందని అంచనా వేయబడింది. మే 9 నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తుఫాను ఏర్పడే సంభావ్యతకు అల్పపీడనం ఏర్పడే ముఖ్య సూచన. చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు అలర్ట్ జారీ చేయడంతో తమిళనాడు అప్రమత్తమైంది. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండి రెండు తెలుగు రాష్ట్రాలను, ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రవాణా, పంటలు,…