వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) అధిపతి పరమజిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్ పాకిస్థాన్‌లో దారుణహత్యకు గురయ్యాడు. లాహోర్‌లోని జోహార్ టౌన్‌లో శనివారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ముష్కరులు పరమజిత్ సింగ్ ను కాల్చి చంపారు. జోహార్ టౌన్‌లోని సన్‌ఫ్లవర్ సొసైటీలోని తన నివాసం సమీపంలో ఉదయం 6 గంటలకు మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పంజ్వార్, అతని గన్‌మెన్‌ను కాల్చి చంపేశారు. కాల్పుల్లో గాయపడిన మరో భద్రతా సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. భారత పంజాబ్‌లోకి డ్రోన్‌లను ఉపయోగించి డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌లో పాల్గొన్న పరమ్‌జిత్.. పంజాబ్‌లోని తరణ్ తరణ్ సమీపంలోని పంజ్వార్ గ్రామంలో జన్మించాడు. అతను 1986లో తన బంధువు లభ్ సింగ్ ఆధ్వర్యంలో కేసీఎఫ్‌లో చేరాడు. అంతకు ముందు, అతను సోహల్‌లోని సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో పని చేశాడు. 1990వ దశకంలో లబ్ సింగ్‌ను భారత భద్రతా…
Author: Editor's Desk, Tattva News
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, కర్ణాటకలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. గతంలో మరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనంత విస్తృతంగా కర్ణాటక నలువైపులా సుడిగాలి పర్యటనలు జరిపి, ప్రచార సభలలో పాల్గొంటున్నారు. 20కు పైగా ర్యాలీలు, పలు నగరాలలో రోడ్ షో లలో పాల్గొన్నారు. ఇప్పుడు బెంగళూరులో ప్రధాని రోడ్ షో శనివారం అట్టహాసంగా మొదలైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ భారీ రోడ్ షో 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగనుంది. జేపీ నగర్ లో ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షో జేపీ నగరంలోని బ్రిగేడ్ మిలీనియం నుంచి బెంగళూరు సెంట్రల్‌లోని మల్లేశ్వరంలోని మారమ్మ సర్కిల్ వరకు జరగనుంది. రోడ్డుకు…
తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో ఇప్పటికే ఓవర్ డ్రాఫ్టుల మీద నడుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈసారి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఊరట లభించింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 30,275 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అనుమతులు లభించాయి. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్దిక శాఖతో పాటు రిజర్వు బ్యాంకు అధికారులకు వర్తమానం పంపారు. ఈఏడాది ఎన్నికల ఏడాది కావడంతో పాలనా పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సమయంగా మారింది. సంక్షేమ పథకాల అమలుతోపాటు పలు హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈసమయంలో కొత్త ఆర్దిక సంవత్సరంలో ఆర్దికంగా తోడ్పాటు గురించి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్రం ఈప్రతిపాదనలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఈనిర్ణయం పెద్ద ఊరటను ఇవ్వనుంది. ఈ నెలలో ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాల…
తరచూ ప్రమాదాలకు గురవుతున్న అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ద్రువ్(ఏఎల్ఎచ్ ధృవ్)ల వినియోగాన్ని నిలిపివేయాలని సైన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తెలంగాణకు చెందిన టెక్నీషియన్ అనిల్ మృతిచెందగా, మరో ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ విమానాలను ఆర్మీ గ్రౌండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ల ఉన్న లోపాల వల్లే వాటిని నిలిపివేసినట్లు ద్వారా వెల్లడైంది. ఇటీవలే ద్రువ్ చాపర్లను నేవీతో పాటు కోస్టు గార్డులు కూడా నిలిపివేశారు. మార్చి నెలలో రెండు దుర్ఘటనలు జరిగిన నేపథ్యంలో ఆ హెలికాప్టర్లను గ్రౌండ్ చేశారు. అయితే పలు మార్లు చెకింగ్ నిర్వహించిన తర్వాత ఆర్మీ తన వద్ద ఉన్న ద్రువ్ హెలికాప్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్లకు ఆ సంస్థే క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గడిచిన రెండు…
ఖమ్మం మాజీ ఎంపీ, బిఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు ఒక వంక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దఎత్తున కసరత్తు చేస్తుండగా, ఆయన మాత్రం ఎటువైపు మొగ్గు చూపించకుండా సొంతంగా ఒక పార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల `తెలంగాణ రైతు సమాఖ్య’ (టిఆర్ఎస్) పేరుతో ఎన్నికల కమీషన్ వద్ద నమోదైన పార్టీ వెనుక ఆయనే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బిఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు కూడా ఆయనతో కలసి వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. అనూహ్యంగా 2014 ఎన్నికలలో ఖమ్మం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీచేసి, రాజకీయ రంగప్రవేశం చేసి ఎన్నికలలో గెలుపొందడం ద్వారా అందరి దృష్టి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తనతో పాటు కొందరు ఎమ్యెల్యేలతో కలిసి బిఆర్ఎస్ లో చేరినా 2019లో సీట్ ఇవ్వకుండా చేయడమే కాకుండా, ఆ తర్వాత సహితం…
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులలో ఐదుగురు జవాన్లు శుక్రవారం మృతి చెందగా, శనివారం ఉదయం ఒక ఉగ్రవాది చనిపోయాడు. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని జిల్లా ఎస్పీ అమోద్ అశోక్ తెలిపారు. అతను లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరపగా ఓ ఉగ్రవాది హతమయ్యాయడు. బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్‌కౌంటర్ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాగా, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్…
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్దతుదారులు, ఓటర్లు చాలా సంవత్సరాలుగా తనవెంట ఉన్నారని, వారి మనోభావాలను విరుద్ధంగా వ్యవహరించలేనని చెప్పారు. తనపై ఉన్న ప్రేమ, నమ్మకానికి తాను కదిలిపోయానని, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో తాను పార్టీలో సంస్థాగత మార్పులు, కొత్త బాధ్యతలు అప్పగించడం, కొత్త నాయకత్వాన్ని సృష్టించడంపై దృష్టి సారిస్తానని పవార్ తెలిపారు. పార్టీ అభివృద్ధి, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు, నేతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని పవార్ పేర్కొన్నారు. శరద్ పవార్ ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన…
మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని మణిపూర్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేయిజారడంతో గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్లు, అందరు కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లు, ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లకు మణిపూర్ గవర్నర్ అధికారాన్ని కల్పించారు. రాష్ట్రంలో హింస కారణంగా అల్లర్లలో చిక్కుకుపోయిన వారి కోసం రాష్ట్ర హోం శాఖ రిలీఫ్ క్యాంపును ఏర్పాటు చేసింది. అల్లరి మూకలు అనేక ఇళ్లను, దుకాణాలను లూటీ చేయడంతోపాటు దగ్ధం…
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. చిత్తూరు జిల్లాకు చెందిన బి.సురేంద్ర, మరో ముగ్గురు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఫీల్డ్‌మెన్‌గా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే జూనియర్ల సర్వీసును క్రమబద్ధీకరించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. కోర్టు విచారణ జరిపి 2022 ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని, వడ్డీతో సహా అప్పటినుంచి జీతాన్ని లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో సురేంద్ర, మిగిలిన ముగ్గురు మళ్లీ 2022 అక్టోబరులో హైకోర్టును ఆశ్రయించారు. ఈసారి ఏకంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని పిటిషనర్ల లాయర్ వాదనలు వినిపించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు 2022 నవంబరులో వేసిన అప్పీలు పెండింగ్‌లో ఉందని తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎం చెంగలరెడ్డి కౌంటరు…
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన వ్యవహారంలో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోస్గీ భగవంత్ కుమార్, కోస్గీ రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తన తమ్ముడు కోస్గీ రవికుమార్ కోసం భగవంత కుమార్ పేపేర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. ఢాక్యా నాయక్ బ్యాంకు అకౌంట్లను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గీ భగవంత్ కుమార్ విషయం బయటపడింది. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కోస్గీ భగవంత్ కుమార్ పని చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లక్షలకు ఢాక్యా నాయక్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్…