Author: Editor's Desk, Tattva News

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో  లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన డిఫాల్ట్‌ బెయిల్‌పై బయట ఉన్నారు. కాగా గంగిరెడ్డి బెయిల్‌ను ఇటీవల తెలంగాణా హైకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో కోర్టు ఆదేశాలతో ఈనెల 5వ తేదీ శుక్రవారం కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. లేకుంటే అరెస్టు చేయాలని కోర్టు సీబిఐని ఆదేశించింది. ఈ నేపధ్యంలో వివేకా కేసులో కీలకమైన మొదటి నిందితునిగా ఉన్న గంగిరెడ్డి నేడు సిబిఐ కోర్టుకి వ‌చ్చారు. హైకోర్టు ఆదేశాల‌తో తాను లొంగిపోతున్న‌ట్లు గంగిరెడ్డి ప్ర‌క‌టించారు. ఇక నుంచి జ్యుడీషియల్‌ రిమాండులోకి వెళ్ళనున్నారు.  బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డిని అవసరమనుకుంటే సీబిఐ ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ వివేకా కేసులో రోజురోజుకు మారుతున్న పరిణామాల దృష్ట్యా తాజాగా కస్టడీ కోరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు పధక రచన జరిగిన మీదట దాన్ని అమలు చేసే విషయంలో ప్రధానంగా వ్యవహరించిన గంగిరెడ్డిని…

Read More

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బిఆర్‌ఎస్ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కెసిఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి కెసిఆర్ భవనంలోకి ప్రవేశించారు. భవన్‌లో దుర్గామాత అమ్మవారికి కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌లో కెసిఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనులయ్యారు. పత్రాలపై సంతకాలు చేసిన తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కెసిఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ బాధ్యతలు స్వీకరించే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కెటి రామారావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డిలు ఉన్నారు. ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి ఢిల్లీలోని తెలుగు…

Read More

ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను పోలీసు ప్రత్యేక దళం ఎన్‌కౌంటర్ చేసింది. హత్యోదంతంలో నిందితుడు అయిన అనిల్ దుజానా బెయిల్‌పై ఉండగా మీరట్‌లో ఎస్‌టిఎఫ్ ఎదురుకాల్పుల్లో గురువారం మృతి చెందాడు. నోయిడా, గజియాబాద్ ఇతర ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంతంలో అనిల్ దుజానా తన గ్యాంగ్‌తో కలిసి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ తిరుగులేని నేర సామ్రాజ్యాని నడిపిస్తున్నాడు. హతుడు దుజానాపై 60కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ల పనిపడుతామని, నేరగాళ్లను ఏరివేస్తామని అసెంబ్లీలోనే సిఎం యోగి ఆదిత్యానాథ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్ అయిన దుజానా వారం రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. తనపై హత్యకేసులో ప్రధాన సాక్షిని ఈ నిందితుడు బెదిరిస్తూ వచ్చినట్లు, సాక్షం అనుకూలంగా లేకపోతే చంపివేస్తామని బెదిరించినట్లు వెల్లడైందని పోలీసు అధికార వర్గాలు తెలిపాయి. దుజానా ఆగడాలపై ఫిర్యాదు అందడంతో ఆయనను…

Read More

మణిపుర్‌లో హింసాకాండతో అట్టుడుకుతోంది. నిరసనకారులు వాహనాలను, ప్రార్థనా స్థలాలను తగులబెడుతున్నారు. ఘర్షణలను నియంత్రించేందుకు సైన్యం, అస్సాం రైఫిల్ బలగాలు రంగంలోకి దిగాయి. సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)లో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈ హింసాకాండ చోటుచేసుకుంది. మణిపుర్‌లోని ఇంఫాల్, చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్సిలో ఘర్షణలు జరుగడంతో ఎనిమిది జిల్లాల్లో కర్ఫూ విధించారు. ఇంటర్నెట్‌ను నిలిపేశారు. సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 4000 మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు. ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ‘మా రాష్ట్రం మండిపోతోంది, సాయం చేయండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేసి అభ్యర్థించారు. కాగా అమిత్ షా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌లో మాట్లాడారు. మణిపుర్‌లో పరిస్థితిని కేంద్రం సునిశితంగా గమనిస్తోంది. మణిపుర్‌లో ప్రస్తుతం గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మణిపుర్ జనాభాలో 53…

Read More

ఢిల్లీలోని జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. పీకలదాకా మద్యం తాగొచ్చ రెజ్లర్లను దుర్భషలాడారు. ఢిల్లీ పోలీసుల అసభ్య ప్రవర్తనపై మహిళా రెజ్లర్లు మండిపడుతున్నారు. జంతర్‌మంతర్‌ దగ్గర నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే రెజ్లర్లకు ఈ మంచాలను ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అయినా కూడా సోమనాథ్ భారతీ సిబ్బంది ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న పోలీసు ధర్మేంద్ర రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడారు. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగట్ తోపాటు పలువురికి గాయాలయ్యాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై నిరసన వ్యక్తం చేస్తున్న తమపై మద్యం…

Read More

సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చీర్లవంచ గ్రామంలో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మిడ్ మానేరు బాధితులను కలిసి సంఘీభావం తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అయినా వారి సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు బాధితులకు సాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి 8 ఏండ్లు అయ్యిందని, బాధితులకు ఇంటికి రూ. 5లక్షలిస్తానని మాట ఇచ్చి తప్పిండని ధ్వజమెత్తారు. గతంలో తాను ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్రూం రాని వాళ్ల లిస్ట్ పంపండి. కేంద్రంతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని, ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపితే కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయిస్తానని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఆ ప్రతిపాదనలే ఇవ్వలేదని విమర్శించారు.ఈ ప్రభుత్వం కొనసాగేది 5 నెలలే అంటూ మీరు గెలిపించిన ఎమ్మెల్యే జర్మనీకి వెళ్లిపాయే, కొదురుపాక కేసీఆర్ అత్తగారి ప్రాంతమని, మోసం చేయడని నమ్మి…

Read More

తమ అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లద్వారా దాడి చేసి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ బుధవారం యత్నించిందని రష్యా అధికారులు ఆరోపించారు. ఈ దాడి యత్నాన్ని ‘ఉగ్రవాద చర్య’గా పేర్కొన్న క్రెమ్లిన్ దాడి చేసే లోగా రష్యా మిలిటరీ, భద్రతా దళాలు ఆ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రష్యా అధికారిక వార్తాసంస్థలు కూడా ప్రచురించిన ఆ ప్రకటన పేర్కొంది. దాడి జరిగిన సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరని, నోవో ఒగర్యోవో నివాసంనుంచి పని చేస్తున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ రష్యా అధికార వార్తా సంస్థ ఆర్‌ఐఎ నొవోస్తికి చెప్పారు. పుతిన్ క్షేమంగా ఉన్నారని, ఆయన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పూ లేదని కూడా ఆ ప్రకటన తెలిపింది. దాడి ఘటనకు సంబంధించి క్రెమ్లిన్ ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు సరికదా, దాని ప్రకటనలో కూడా పెద్దగా వివరాలు లేవు.…

Read More

ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా మాస్ట‌ర్ కార్డ్ మాజీ సీఈవో, భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా నియామ‌కం కానున్నారు. ఈ మేర‌కు ప్రపంచ బ్యాంకు ధృవీక‌రించింది. అజ‌య్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న ఐదేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజ‌య్ బంగా నామినేట్ అయ్యారు. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని బోర్డు స‌భ్యులంద‌రూ ఆమోదించిన అనంత‌రం ప్రపంచ బ్యాంక్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. అజ‌య్ బంగా వ‌రల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేండ్ల పాటు కొన‌సాగుతార‌ని వెల్ల‌డించింది. గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆయన పేరును ప్రతిపాదించారు. కాగా 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవ‌లందిస్తున్నారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌, చీఫ్‌…

Read More

కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇటీవల సీబీఐ వేసిన కౌంటర్ కాపీలో కీలక విషయాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని పేర్కొంది. దురుదేశపూర్వకంగా అవినాష్ విచారణకు సహకరించడం లేదని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటివేసి వాస్తవాలు చెప్పడం లేదని కౌంటర్ కాపీలో సీబీఐ ఆరోపించింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించే విధంగా అవినాష్ సమాధానాలు ఇచ్చాడని, అందుకే కస్టడీలోకి తీసుకుని విచారించాలని పేర్కొంది. దర్యాప్తును తప్పించుకునేందుకే పిటిషన్లు వేస్తున్నాడని, విచారణను పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నాడని సీబీఐ వేసిన కౌంటర్ కాపీలో ఈ విషయాలు ఉన్నాయి. ఆరుఅంశాలపై అవినాష్ ను ప్రశ్నించాలని సీబీఐ కోరింది. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేదని, హత్య కోసం జరిపిన 4 కోట్ల రూపాయల లావాదేవీల గురించి ప్రశ్నించాలని తెలిపింది. సునీల్ యాదవ్ అవినాష్ ల సంబంధాలపై…

Read More

ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారనుందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి. బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, తారకరామ తీర్థసాగర్‌, చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, అదానీ డేటా సెంటర్‌, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సిఎం జగన్‌ పునాది రాళ్లు వేశారు. అనంతరం విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తూ రానున్న కాలంలో ఉత్తరాంధ్రుల కోసం తీసుకురానున్న అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల గురించి వివరించారు. చింతపల్లిలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, అదానీ డేటా సెంటర్‌, భోగాపురం ఎయిరోపోర్టుకు శంకుస్థాపన చేశామని, ఇందుకు ఎంతో చిత్తశుద్ధితో పనిచేశామని చెప్పారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్‌ ఎయిరోపోర్టు టేక్‌…

Read More