రానున్న ఐదు సంవత్సరాల్లో దాదాపు 23 శాతం ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నివేదిక అంచనా వేసింది. 2023 నుంచి 2027 రకు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్లు కనుమరుగవుతాయని నివేదిక అంచనా వేసింది. ఈ మేరకు భవిష్యత్ ఉద్యోగాల తీరుతెన్నులపై ప్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023 పేరిట డబ్ల్యూఈఎఫ్ ఒక వివరమైన నివేదికను ఆదివారం నాడు విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 803 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయాలను నివేదికలో పొందుపరి చింది. హరిత ఇంధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సప్లయ్ చైయిన్ లోకలైజేషన్, పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాల్లో ప్రామాణికత ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుందని నివేదిక తెలిపింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధిలో మందకొడితనం, సరఫరా కొరతలు సవాల్ విసురుతాయని పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక…
Author: Editor's Desk, Tattva News
వివాహ బంధం కుదరదని తేల్చుకున్న దంపతులు నేరుగా విడాకుల కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టులను ఆశ్రయించేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 32 పరిధిలో సుప్రీంకోర్టుకు, ఆర్టికల్ 226 పరిధిలో హైకోర్టుకు వెళ్లడానికి వీల్లేదని, వివాహ విచ్చిత్తిని తెలిపి విడాకులు నేరుగా కోరేందుకు వీల్లేదని పేర్కొంది. ముందుగా సంబంధిత ట్రిబ్యునల్ లేదా సమస్యల పరిష్కారవేదికలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇంతకు ముందటి ద్విసభ్య ధర్మాసనం తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఇక విడాకుల క్రమంలో పిల్లలపై హక్కులు, న్యాయ ప్రకారం అందాల్సిన భరణం, ఆర్థిక సాయం వంటి వాటిపై కూడా తీర్పులో వివరాలు పొందుపరిచారు. కాగా, దంపతుల మధ్య వివాహ బంధం ఇక కోలుకోలేని రీతిలో విచ్ఛిన్నం అయితే, ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరి మధ్య సయోధ్య ఎంతకూ వీలు కాబోదని తేలితే వారికి వెంటనే న్యాయస్థానాలు విడాకులు మంజూరు చేయవచ్చు. ఆరు నెలలు వేచి ఉండే ప్రక్రియ లేకుండా…
వలసదారులను అడ్డుకోవద్దని పోప్ ఫ్రాన్సిస్ హంగేరియన్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుడాపెస్ట్‌లోని కొసుత్ లాజ్‌స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ హంగేరియన్లు జీసెస్‌ను అనుసరించాలనుకుంటే నిరుపేదలు, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు. వలసదారులు ఆతిథ్య దేశాల సంస్కృతిని సుసంపన్నం చేయగలరని తెలిపారు. వలసదారులను అడ్డుకునేందుకు తలుపులు మూయడం బాధాకరమని, అది జీసెస్ బోధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అలాగే యూరోప్‌లో పెరుగుతున్న జాతీయవాదం ప్రమాదాల గురించి కూడా హెచ్చరించారు. అంతకు ముందు రోజు పోప్ సెయింట్ ఎలిజిబెత్ చర్చిలో సుమారు 600 మంది శరణార్థులను కలుసుకున్నారు. అయితే పోప్ సూచనలను హంగేరియన్ ప్రధాని విక్టర ఓర్బన్ వ్యతిరేకిస్తున్నారు. హంగేరీని వలస దేశం గా మార్చేందుకు తాను అనుమతించబోననని హెచ్చరించారు. వారు స్థానిక ప్రజల నైతిక గుర్తింపుకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. వలసదారులను అడ్డుకునేందుకు 2015లో ఓర్బాన్ సెర్బియా సరిహద్దులో స్టీల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.…
సుడాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోన్న విషయం తెలిసిందే. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వాయుసేన ద్వారా ఇప్పటి వరకు 1,400 మంది సురక్షితంగా స్వదేశానికి చేరారు. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైన సూడాన్ నుంచి ‘ఆపరేషన్ కావేరి’ ద్వారా కేంద్రం భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1,400 మందిని సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు భారత వాయు సేన తాజాగా వెల్లడించింది. రెండు సీ-130 జే విమానాల ద్వారా 260 మందిని తీసుకొచ్చినట్లు ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. వీరిలో 90 ఏండ్లు పైబడిన వారు ఉన్నట్లు పేర్కొంది. ఒకరి వయసు 102 ఏండ్లని వివరించింది.…
థాయిలాండ్ లోని పట్టాయాలో ఓ హోటల్‌కు చెందిన కన్వెన్షన్ హాలులో డబ్బుతో కార్డు గేమ్స్ ఆడుతున్న 83 మంది భారతీయ టూరిస్టులను థాయ్‌ల్యాండ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ గ్యాంబ్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాంగ్ లమంగ్ జిల్లాలోని చొన్మూరీలోని ఆసియా హోటల్‌లోపై పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. కార్డు డీలర్లుగా వ్యవహరించిన నలుగురు థాయ్ పురుషులను, ఇద్దరు థాయ్ మహిళలు, ఇద్దరు మయన్మార్ మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికోటితోపాటు పటాయా పోలీసుల అదుపులో మాధవరెడ్డి, డిసీసీబి చైర్మన్ దేవేంధర్ రెడ్డి కూడా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా యత్నించగా వెంబడించి మరీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.హోటల్‌లోకి చాలామంది భారతీయ టూరిస్టులు శనివారం వచ్చారని, వారంతా సోమవారం ఖాళీ చేయనున్నారని పోలీసులకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. హోటల్‌లోని కన్వెన్షన్ హాలును…
మే10న జరగనున్న కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను బెంగుళూరులో సోమవారం విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో 16 ముఖ్యమైన హామీలను బీజేపీ పొందుపరిచింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని ప్రకటించింది. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని బీజేపీ తెలిపింది. పోషణే స్కీమ్ ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి రోజూ అర లీటర్ నందినీ పాలను రోజూ ఇస్తారు. అలాగే శ్రీ అన్న – శ్రీ ధాన్య కింద నెలవారీ రేషన్ కిట్ లో 5 కేజీల బియ్యం ఇస్తారు. మైసూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద పునీత్ రాజ్‌కుమార్ ఫిల్మ్ సిటీని…
కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు రాజవంశ కాంగ్రెస్, జేడీ(ఎస్) ముఖ్యకారణమని, ఈ రెండు పార్టీలు కర్ణాటకను ఓ ఎటిఎంగా చూశాయని, అస్థిర ప్రభుత్వాలు దోపిడీకి అవకాశం కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని కోలారు. చెన్నపట్టణ, హాసన్ జిల్లాలోని బేలూరులో, మైసూరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో ప్రధాని పాల్గొన్నారు. రామనగర జిల్లా చన్నపట్నలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ జిల్లా జెడి(ఎస్)కు కంచుకోట వంటిది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే జేడీ(ఎస్) అధినేత హెచ్.డి. కుమారస్వామి బీజేపీ అభ్యర్థి సిపి యోగేశ్వరపై గెలుపొందారు. ఆయన తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్, జెడీ(ఎస్)లపై దాడి చేస్తూ మోదీ సుదీర్ఘకాలం పాటు కర్ణాటక అస్థిర ప్రభుత్వ డ్రామాను చూసిందని, ఎప్పుడూ ఆ పార్టీలు దోపిడీ కోసమే పోరాటం సాగిస్తాయి తప్ప అభివృద్ధి కోసం కాదని ఎద్దేవా చేశారు. 224 స్థానాలున్న అసెంబ్లీలో 15 నుంచి…
వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు వారి ముంగిట అందించేందుకు ప్లాంట్ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ పంటలకు సోకే తెగుళ్లు, తక్షణమే వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి పాటించాల్సిన మెలకువలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు త్వరలో సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణకు జిల్లా స్థాయి రిసోర్స్ కేంద్రాన్ని (డిఆర్‌సి) ఏర్పాటు చేశారు. డిఆర్‌సి కి ఇన్చార్జిగా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్లను నియమించారు. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత మండలంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌బీకే) ఎంపిక చేశారు. ఈ ఆర్‌బికె కేంద్రంలో పనిచేయుచున్న వ్యవసాయ సహాయకుడికి మూడు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాలోని వ్యవసాయ శిక్షణ కేంద్రంలో గాని, వ్యవసాయ పరిశోధన కేంద్రంలో…
పంజాబ్ లోని లూథియానా నగరం గియాస్‌పురా ఏరియాలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గ్యాస్ లీకవడంతో 11మంది మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిపాలయ్యారు. వెంటనే ఆ మొత్తం ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు. సహాయక చర్యల నిమిత్తం అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు వున్నారని జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయం తెలిపింది. మరో నలుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా ప్రాంతంలో వున్నాయి. బాధితులకు అవసరమైన సాయాన్ని అందచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈసంఘటనపై దర్యాప్తు జరిగిన తర్వాతనే అసలు కారణం తెలుస్తుందని లూథియానా వెస్ట్ ఎస్‌డిఎం స్వాతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 7.15గంటల సమయంలో ఆకస్మిక…
సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వందో మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఆదివారం ప్రసంగిస్తూ ప్రజల నుంచి తనకు వేల సంఖ్యలో లేఖలు, సందేశాలు వచ్చాయని, వాటిని చదువుతున్నప్పుడు భావోద్వేగాలకు లోనయ్యానని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల తాను అసామన్య సేవలు అందించిన పలువురు గురించి తెలుసుకున్నట్లుగా ప్రధాని తెలిపారు. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. మన్‌కీ బాత్ మొదటిసారి 2014, అక్టోబర్ 3న ప్రారంభమైందని, ‘మన్‌కీ బాత్’ కోట్లాది మంది ప్రజల ‘మన్ కీ బాత్’ కి ప్రతిబింబమని చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించనందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ వంటి అనేక ప్రజా ఉద్యమాలను ఊపందుకునేలా చేసిందని గుర్తు చేశారు.…