Author: Editor's Desk, Tattva News

చత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బుధవారం 11 మంది పోలీసులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా డీఆర్‌జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు. దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడి దాడి జరిగింది. నక్సలైట్లు ఐఈడీని అమర్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ కూడా జరిగినట్లు సమాచారం. దీంతో పాటు జవాన్ల పికప్ వాహనాన్ని కూడా మావోయిస్టులు పేల్చివేశారు. అందులోని 10 మంది జవాన్లతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులపై దాడికి 50 కేజీల ఐఈడీని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి రోడ్డుపై 12 అడుగుల లోతులో 25 అడుగుల మేర భారీ గుంత ఏర్పడింది. షాక్‌వేవ్‌కి…

Read More

భారత్‌కు చెందిన దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిరప్‌ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్‌లో ఉత్పత్తి అయిన, హర్యానా సంస్థ విక్రయిస్తున్న, పసిఫిక్‌ సమీప దీవులకు సరఫరా అవుతున్న దగ్గు సిరప్‌లలో విషపూరిత కలుషిత పదార్థాలు ఉన్నట్లు ఓ నివేదికలో డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది. మార్షల్‌ దీవులు, మైక్రోనేషియాలోని ఒక బ్యాచ్‌ సిరప్‌లలో అధిక శాతం డైథైలీన గ్లైకాల్‌, ఇథిలీన్‌ గ్లైకాల్‌లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇవి మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ సిరప్‌లను పంజాబ్‌కు చెందిన క్యూపి ఫార్మాకెమ్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేస్తుండగా, హర్యానాలోని త్రిలియం ఫార్మా పేరుతో విక్రయిస్తున్నారని అత్యవసర వైద్య హెచ్చరికలో డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది. ఇప్పటివరకు పైన పేర్కొన్న తయారీ దారుల గాని, విక్రయదారులు గాని ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ ఉత్పత్తులు…

Read More

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాసకోశ సమస్యలతో మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ప్రకాశ్ సింగ్ బాదల్ 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీనియర్ శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) నాయకుడు గత ఏడాది జూన్‌లో ‘గ్యాస్ట్రిటిస్’, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ అనంతర ఆరోగ్య పరీక్షల కోసం ఫిబ్రవరి 2022లో ఆయనను మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతేడాది జనవరిలో బాదల్‌కు కరోనా సోకడంతో లుథియానాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బాదల్‌ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్. ప్రకాష్ సింగ్ బాదల్ 1947లో రాజకీయాలను ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అతి…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా చేసిన ఛార్జ్ షీట్ లో మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఎమ్యెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబు, అమన్దీప్ దల్, అర్జున్ పాండేలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కుంభకోణానికి సంబంధించి సీబీఐ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రెండో ఛార్జ్ షీట్ లో మనీష్ సిసోడియా, బుచ్చిబాబుపై కీలక అభియోగాలు మోపింది. లిక్కర్ కేసుకు సంబంధించి దర్యాప్తులోని కీలక అంశాలను సీబీఐ రెండో ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. గత నవంబర్ లో సీబీఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు తర్వాత మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురిని ప్రశ్నించింది సీబీఐ. మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మధ్యంతర…

Read More

సూడాన్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ కావేరీ’ వేగవంతమైంది. మంగళవారం సూడాన్‌లోని పోర్ట్ సూడాన్ పట్టణానికి తరలించిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ తేజ్ అక్కడికి చేరుకుంది. సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరీ’లో భాగంగా తొలి విడతలో 278 మంది స్వదేశానికి బయల్దేరారు. సూడాన్‌ పోర్టులో ప్రస్తుతం 500 మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ సుమేధలో మంగళవారం 278 మంది భారతీయులు బయల్దేరారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విటర్‌లో పేర్కొన్నారు.తరలింపు ప్రక్రియలో తీసుకొచ్చే భారతీయులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఐఎన్ఎస్ తేజ్ యుద్ధ నౌకకు తోడుగా సమీప సముద్ర జలాల్లో మరో యుద్ధ నౌకను సిద్ధంగా ఉంచినట్టు నావికాదళం వర్గాలు…

Read More

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరసగా రెండో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా ప్రకటించిన బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రచారం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, అలాగే దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని అమెరికన్టకు ఆయన పిలుపునిచ్చారు. తనతో పాటుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా మళ్లీ పోటీ చేయనున్నట్లు బైడెన్ వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యం కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రతి తరం వారు నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ఇది మన సమయం అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తున్నా. మాకు మద్దతుగా నిలవండి’ అని బైడెన్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. 2024…

Read More

సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో మ‌రోసారి అపచారం చోటుచేసుకుంది. ఆలయంలో స్వామి నిజ రూపదర్శనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి షేర్‌ చేయడం కలకలం రేపుతుంది. ఈ నెల 23 న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం కార్య‌క్ర‌మ వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష్యమ‌య్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది. ఎంతో పవిత్రంగా కొలిచే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు ఏడాది పాటు వేచి చూస్తూ అక్షయ తృతీయ నాడు ఒక్క రోజు మాత్రమే లభించే స్వామి నిజరూపదర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి నియమ, నిష్ఠాలుంటూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం బయటకు రావడంపై భక్తుల నుంచి…

Read More

దేశంలో కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్ర పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. అంతకుముందు ఆయన ఆ రాష్ట్రంలో మొదటి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపారు. ఇది తిరువనంతపురం నుంచి కాసరగోడ్‌ వరకు రాకపోకలు సాగిస్తుంది. అంతేగాకుండా డిజిటల్ సైన్స్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాల్లో భాగంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.‘ఈ రోజు కేరళకు మొదటి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అలాగే కోచిలో వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయ. కేరళ విద్యావంతుల రాష్ట్రం. ఇక్కడి ప్రజల కృషి, వినయం వారి గుర్తింపులో భాగం’ అని ప్రకటించారు. `దేశ రైల్వే నెట్‌వర్క్‌ వేగంగా మార్పు చెందుతోంది. అధిక వేగం కలిగిన రైళ్ల రాకపోకలకు సిద్ధం అవుతోంది. రాష్ట్రాల అభివృద్ధే దేశ ప్రగతికి మూలమని మా ప్రభుత్వం…

Read More

భూ రికార్డుల్లో నేషనల్ జెనెరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విధానం (ఎన్‌జిడిఆర్‌ఎస్)ను 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవలంభించనున్నాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ ప్రాంతాలు ఈరిజిస్ట్రేషన్ లేక నేషనల్ పోర్టల్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా డేటా షేరింగ్ విధానాన్ని ఇప్పటికే మొదలెట్టాయని తెలిపింది. 26 రాష్ట్రాలు యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యుఎల్‌పిఐఎన్) లేక భూఆధార్‌ను చేపట్టాయి. ఏడు రాష్ట్రాలలో పైలట్ టెస్టింగ్ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలైతే స్వామిత్వా పోర్టల్‌తో యుఎల్‌పిఐఎన్‌ను ఇంటిగ్రేట్ చేశారు. ఏప్రిల్ 18 నాటికి 94.62 శాతం గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌ఓఆర్‌లను) కంప్యూటీకరించారు. 75.62 శాతం పటాలను డిజిటలైజ్ చేశారు. 92.82 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కంప్యూటీకరించబడ్డాయి. 79.60 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెవెన్యూ కార్యాలయాలతో సమీకృతం చేశారు. దీనికి తోడు 85.73 శాతం మోడర్న్ రికార్డు రూమ్స్ (ఎంఆర్‌ఆర్)లను ఏర్పాటుచేశారు. కేంద్ర రంగ పథకం కింద భూవనరుల…

Read More

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంతో షర్మిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ఆమెను హాజరు పరిచారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం షర్మిలకు 14రోజుల రిమాండ్ విధించింది. వై.ఎస్‌.షర్మిల విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం సోమవారం వివాదానికి కారణమైంది. మహిళా కానిస్టేబుల్‌ చెంపపై కొట్టడంతో పాటు, ఎస్సైని నెట్టుకుంటూ ముందుక వెళ్లారు. పోలీసులు నిలువరిస్తున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్‌ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్‌ కాలిపైకి టైరు ఎక్కింది. వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులపైకి కారును పోనివ్వాలంటూ డ్రైవర్‌ను రెచ్చగొట్టారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ బంజారాహిల్స్‌ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమెను కలవడానికి ఠాణాకు వచ్చిన తల్లి విజయమ్మ కూడా…

Read More