భారత దేశం తన మతపరమైన విధులను నిర్వర్తించడాన్ని విశ్వసిస్తోందని, అమెరికా, రష్యా, చైనా వలే నిరంకుశ దేశంగా ఉండాలని కోరుకోవడంలేదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు . “భారత దేశం ఇతరులకు సేవ చేయడాన్ని విశ్వసిస్తుంది, ఈ సంప్రదాయం వేదాల నుండి అనుసరించబడుతోంది. మన దేశం ధర్మబద్ధమైన దేశంగా అభివృద్ధి చెందుతోంది, అభివృద్ధి చెందిన దేశంగా తన మార్గాన్ని సుగమం చేసుకున్నందున దాని మతపరమైన విధులను నిర్వహిస్తోంది” అని తెలిపారు. ‘వేద్ సంస్కృత జ్ఞాన్ గౌరవ్ సమారోహ్’లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ అభివృద్ధి చెందిన దేశాలు ఒకదానిపై మరొకటి ఆధిక్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తాయని ఆరోపించారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ సూపర్ పవర్‌గా ఉండేదని, దానిని అమెరికా అధిగమించిందని, ఇప్పుడు చైనా అమెరికాను మించిపోవాలని చూస్తోందని తెలిపారు. రష్యా, అమెరికాలు ఉక్రెయిన్‌ను ఓ పావుగా వాడుకుంటున్నాయని భగవత్ విమర్శించారు. తనతో ఎలాంటి సంబంధాలు ఉన్నా అవసరమైనప్పుడు భారత్…
Author: Editor's Desk, Tattva News
గత ఏడాది జరిగిన మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థిని ఓడించడం కోసం కాంగ్రెస్ కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణ తెలంగాణాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఆరోపణలపై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని ఈటలకు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్ ను కొట్టిపారేసిన ఈటల తన ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని, తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదని తెలిపారు. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని ఈటల స్పష్టంచేశారు. తాను దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై సరైన సమయంలో జవాబిస్తానని ఈటల వెల్లడించారు. ధర్మం కోసం, ప్రజల కోసమే ఆ విధంగా మాట్లాడానని అంటూ తానెప్పుడూ ఎదుటి…
ఖలిస్థానీ సానుభూతిపరుడిగా మారిన అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. పంజాబ్ మోగాలో పోలీసులకు అతను లొంగిపోయాడు. నిజానికి అతన్ని మార్చి 18న అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని కోసం 80 వేల మంది పోలీసులు వేట సాగించారు. 35 రోజులపాటూ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ ఎట్టకేలకు లొంగిపోయాడు. అతను అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అమృత్ పాల్ ను మోగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమృత్ పాల్ సింగ్ “వారిస్ పంజాబ్ దే” సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అమృత్ పాల్ పంజాబ్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లు సమాచారం. ఇతను పంజాబ్ లో ఖలిస్థానీ కార్యకలాపాలను సాగించాడు. అల్లర్లు సృష్టించినట్లు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ పై కేసులు పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు…
దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకతోపాటు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. శనివారం ఇండియాటుడే నిర్వహించిన ‘కర్నాటక రౌంట్ టేబుల్ 2023’ ప్రోగ్రాంలో అమిత్ షామాట్లాడారు. ‘‘కర్నాటక ఎన్నికలు దక్షిణాదిలోకి బీజేపీకి ఎంట్రీ పాయింట్ గా నిలుస్తాయి. దక్షిణ భారత ప్రజలు బీజేపీని, మోడీని కోరుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచే మేం దక్షిణాదిలోకి ఎంటర్ అవుతాం” అని అమిత్ షా తెలిపారు. కర్ణాటకలో బీజేపీ పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు సామాన్యుడికి ఎంతో ప్రయోజనం…
శనివారం నుంచి ప్రారంభమైన గంగా పుష్కరాలకు హాజరయ్యే తెలుగు యాత్రికులను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో కాశీలో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గౌరవాధ్యక్షులుగా ‘శ్రీ కాశీ తెలుగు సమితి’ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా యంత్రాంగంతో పలుమార్లు సమావేశమై ఎలాంటి ఏర్పాట్లు అవసరమో వివరించారు. భద్రతాపరంగా పోలీసు యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్ల గురించి కూడా వివరించారు. అలాగే గంగా పుష్కరాల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చే ఏపీ, తెలంగాణ యాత్రికులకు తగినన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తూ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, సికింద్రాబాద్ నగరాల నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలోనూ జీవీఎల్ చొరవ తీసుకున్నారు. గంగా పుష్కరాల సమయంలో ఈ నెల 29న కాశీలోని మానస సరోవర్ ఘాట్ వద్ద ‘కాశీ – తెలుగు సంగమం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, భారత…
ఈ ఏడాది భారతీయులకు పది లక్షలకు పైగా వీసాలను జారీ చేయాలని అమెరికా అధికార యంత్రాంగం సంకల్పించింది. ఈ దిశలో పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. భారతీయ విద్యార్థులకు వీసా మంజూరీలో ప్రాధాన్యత ఇవ్వాలని బైడెన్ అధికార యంత్రాంగం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది ఆరంభం అయ్యే విద్యాసంవత్సరానికి ముందుగానే భారతీయ విద్యార్థులకు వీసాల మంజూరిని వేగవంతం చేసే వీలుంది. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారల పర్యవేక్షకులు దేశ విదేశాంగ శాఖ సహయ మంత్రి డోనాల్డ్ లూ వార్తా సంస్థలకు ఈ వీసాల జారీ విషయం తెలిపారు. వర్క్‌వీసాలైన హెచ్ 1 బి, ఎల్ వీసాలపై కూడా కసరత్తు జరుగుతోందని వివరించారు. ఈ వీసాల ఆధారంగా అమెరికాలో ఐటి ఉద్యోగాలలో స్థిరపడేందుకు ఎక్కువగా భారతీయ యువ ప్రతిభావంతులైన విద్యార్థులకు వీలుంటోంది. ఈ దశలో వీసాల మంజూరీలో భారతీయ విద్యార్థులకు ప్రాధాన్యత అంశం ప్రస్తావనకు వచ్చింది. అమెరికాలోని పలు ఐటి…
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్నారు. తిరువనంతపురం, కొచ్చిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఆయనపై ఆత్మాహుతి బాంబు దాడి జరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు గత వారం ఒక బెదిరింపు లేఖ అందింది. కొచ్చికి చెందిన వ్యక్తి పేరుతో మలయాళంలో రాసి ఉన్న ఆ లెటర్‌ను పోలీసులకు ఆయన అందజేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. కాగా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్‌లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో ఆదివారం బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీడియాకు లీక్ కావడంపై మండిపడ్డారు. కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల భద్రతా బాధ్యతలు చూసే పోలీస్ అధికారుల పేర్లు, వారి విధుల గురించిన పూర్తి వివరాలు…
వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నీచర్, కంప్యూటర్లకు విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఏర్పాటుచేసే ప్రక్రియ కొనసాగుతోంది. వారం రోజుల్లో ఆయా శాఖలను నూతన భవనంలోకి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 ఎకరాల స్థలంలో 10,51,676 చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరగ్గా, ప్రధాన భవనం ఏరియా 7,88,904 చదరపు అడుగుల్లో నిర్మాణం జరిగింది. ఇక భవనం ఎత్తు 265 అడుగులు కాగా, మొత్తం 6 అంతస్థుల్లో దీని నిర్మాణం జరిగింది. డోమ్‌లు 7 నుంచి 11 అంతస్థుల్లో ఏర్పాటు చేయగా, వీటి బిల్టప్ ఏరియా 1,54,256 చదరపు అడుగుల్లో జరిగింది. రూ.600 కోట్లకుపైగా వ్యయంతో అద్భుతంగా సచివాలయ భవనాన్ని నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం, దీనికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టింది. ఈ నెల 30వ తేదీన దీనిని ప్రారంభించేందుకు ఇప్పటికే సిఎం…
భారత మొబైల్ మార్కెట్‌లో మందగమనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో 20 శాతం పతనం చోటు చేసుకుందని కెనలిస్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో 6 శాతం తగ్గుదలను చవి చూసిందని వెల్లడించింది. కెనలిస్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం భారత మొబైల్ మార్కెట్‌కు 2023 సవాలుగా ప్రారంభమైంది. మార్కెట్ ఇప్పటికీ డిమాండ్ లేమితో పోరాడుతోంది. అమ్మకాలు తగ్గి స్టాక్ మిగిలిపోతోంది. కాగా, క్రితం క్యూ1లో సామ్‌సంగ్ 63 లక్షల యూనిట్ల అమ్మకాలతో 21 శాతం మార్కెట్ వాటా కలిగి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. వివో, షావోమిలను వెనక్కి నెట్టిన ఒప్పో 55 లక్షల యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలోకి వచ్చింది. వివో 54 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో, షావోమి 5లక్షల యూనిట్లతో నాలుగో స్థానంలోకి, రియల్‌మి 29 లక్షల యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో ఉంది.”భారత మొబైల్ మార్కెట్…
ఇలా ఉండగా, కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపులను తెలంగాణకు పెంచడంతో పాటు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వాటా కేటాయింపుల సందర్భంగా సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి, 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు, తప్పిదాలకు తెలంగాణ ప్రజలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపులతోపాటు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంజయ్ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు.…