Author: Editor's Desk, Tattva News

తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారుల వలలో శాసనమండలి సభ్యుడు షేక్‌ షాబ్జీ చిక్కుకున్నాడు. తరుచూ ఆయన తిరుమల శ్రీవారి దర్శనానకి వస్తుండడంతో అతడిపై విజిలెన్స్ వింగ్ అధికారులకు అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో వారు ఎమ్మెల్సీని తనిఖీ చేయగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకువెళ్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసి ఆరుగురి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ షాబ్జీని అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. శ్రీవారి దర్శనాల్లో ఎమ్మెల్సీ షాబ్జీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని టీటీడీ విజిలెన్స్‌ వీజీవో గిరిధర్రావు స్పష్టం చేశారు. షాబ్జీ సిఫార్సు చేసిన భక్తుల ఆధార్ కార్డులు నకిలీవిగా తెలిసిందన్నారు. 14 మందికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కోరారని…

Read More

తన హయాంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇవ్వజూపారని చేసిన ఆరోపణలపై ప్రశ్నించేందుకు సిబిఐ జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్‌ను పిలిచింది. ‘ఓ కేసులో కొన్ని విషయాలపై స్పష్టీకరణ కోసం సిబిఐ నన్ను హాజరు కమ్మని కోరింది. నా వీలును బట్టి ఏప్రిల్ 27 లేక 28 తేదీల్లో హాజరుకమ్మని కోరింది’ అని సత్యపాల్ మలిక్ తెలిపారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న కాలంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ కు సంబంధించిన స్కామ్ ఇది. దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో జాయిన్ అయ్యారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని అప్పుడు గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్…

Read More

బుద్ధుడి బోధనలను అనుసరిస్తే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న అంతర్జాతీయ బౌద్ధ సదస్సును ప్రారంభిస్తూ శతాబ్దాలుగా భారతదేశం బుద్ధుడి బోధనలను పాటిస్తోందని ప్రధాని చెప్పారు. భారత్ అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అడుగులేస్తోందని చెబుతూ భారత్ తన సంక్షేమం కోసమే కాకుండా యావత్ ప్రపంచం సంక్షేమం కోసం సంకల్పించిందని తెలిపారు. గెలుపోటములు, పోరాటాలు, యుద్ధాల సాక్షాత్కారాలను త్యజిస్తేనే మనం ఆనందంగా జీవించగలమని ప్రధాని పేర్కొన్నారు. వీటిని అధిగమించే మార్గాన్ని బుద్ధ భగవానుడు బోధించారని తెలిపారు. స్వీకరించగలం. శత్రుత్వాన్ని శత్రుత్వంతో నాశనం చేయలేం కానీ పేమ్రతో చేయొచ్చని స్పష్టం చేశారు. అసలైన ఆనందం శాంతిలో, కలిసి ప్రశాంతంగా జీవించడంలో ఉందని సూచించారు. భారత్ ప్రపంచానికి బుద్ధుణ్ని ఇచ్చింది.. యుద్ధాన్ని కాదని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ప్రపంచం యుద్ధం, అశాంతితో ఇబ్బందిపడుతోందన్న మోదీ శతాబ్దాల…

Read More

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ భారత్ లో పర్యటించనున్నారు. గోవా వేదికగా మరో రెండు వారాల్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇదే అంశంపై భారత ప్రభుత్వం మూడు నెలల క్రితమే దాయాది దేశానికి ఆహ్వానం పంపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్‌. జైశంకర్‌.. పాక్‌ విదేశాంగ మంత్రికి అధికారికంగా ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఉగ్రవాదం, కశ్మీర్‌ వంటి అంశాలపై భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఇది కీలక పరిణామం అని చెప్పొచ్చు. 2011 తర్వాత పాకిస్తాన్ మంత్రి ఒకరు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత కేవలం నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారంకు 2014లో అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పర్యటించగా, ఈ తరువాత పాకిస్తాన్ నుంచి…

Read More

గత పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిన విశాఖ ఉక్కు పరిశ్రమలో బిడ్‌ దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఈ పరిశ్రమ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) బిడ్‌కు ఆహ్వనం పలికిన విషయం తెలిసిందే. మొత్తం 29 సంస్థల తరఫున బిడ్లు రాగా, ఇందులో విదేశీ సంస్థలకు చెందినవి ఏడు బిడ్లు ఉన్నట్లు అనధికార వర్గాలు వెల్లించాయి. కాగా, తెలగు ప్రజలు, అఖిల పక్షం ఊహించినట్లుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గానీ బిడ్‌లో పాల్గొనలేదు. బీడ్ లో పాల్గొని విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకట్ట వేస్తామంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు ఈ విషయంలో తోకముడిచి నట్లయింది. సింగరేణి కాలరీస్ నుండి అధికారుల బృందాన్ని ప్రత్యేకంగా విశాఖకు పంపి, బీడ్ విషయమై అధ్యయనం కూడా చేయించారు. సింగరేణి కాలరీస్ కోరడంతోనే బీడ్…

Read More

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు సజీవదహనం అయి మృతి చెందారు. మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ ప్రాంతంలోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు కాపుకాసి జాతీయ రహదారిపై వెళ్లుతున్న సైనిక ట్రక్కుపై గ్రనేడ్స్‌తో దాడి జరిపారు. ఇవి వచ్చి ట్రక్కును ఢీకోనడంతో మంటలు చేలరేగాయి. లోపలున్న సైనికులు మంటల్లో ఆహుతి అయినట్లు వెల్లడైంది. వీరు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం జవాన్లని సైనిక వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భీంబెర్ గలీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి దిగారు. గ్రనెడ్ వంటి శక్తివంతమైన ఆయుధంతోనే దాడి జరిగినట్లు భావిస్తున్నట్లు సైనిక వర్గాలు ఆ తరువాత తెలిపాయి. ఈ ప్రాంతంలో భారీ వర్షం పడుతూ ఉండటం, రోడ్లపై ముందున్నది సరిగ్గా కన్పించని పరిస్థితి ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోయినట్లు భావిస్తున్నారు. ట్రక్కులోపల సైనికులు కొందరు బయటకు దూకినట్లు వెల్లడైంది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో…

Read More

పోలీస్‌లకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె శ్రీగురురామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఏఐ 169 విమానంలో లండన్ వెళ్లడానికి బయలుదేరుతుండగా గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఆమెను అడ్డుకున్నారు. లుక్‌అవుట్ నోటీసుల నేపథ్యంలో ఆమె బ్రిటన్ వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఆమెను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పోలీస్‌ల కళ్లు గప్పి అనేక వేషాలు వేసి, వాహనాలు మార్చి తిరుగుతున్నాడు. పోలీసులకు లొంగిపోతాడని ప్రచారం జరిగినా అలా జరగలేదు. తాను దేశం విడిచి పారిపోలేదని, త్వరలోనే అందరి ముందుకు వస్తానని ఆయన చెప్పినట్టు ఒక వీడియో ఇటీవల బయటకు వచ్చింది. అమృత్‌పాల్ సన్నిహితుడు…

Read More

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కె పళనిస్వామి నియామకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం( ఇసి) ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ధ్రువీకరించింది. ఎన్నికల కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడిఎంకె అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబు మురుగవేల్ గురువారం ట్వీట్ చేశారు. అన్నాడిఎంకె నియమ నిబంధనలకు చేసిన మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, ఆఫీస్ బేరర్ల నియామకానికి ఆమోదం తెలిపినట్లు ఇసి పేర్కొంది.గత ఏడాది తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని, పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని సవాలు చేస్తూ పార్టీ బహిష్కృత నేత పన్నీర్‌సెల్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు బెంచ్ గురువారం విచారిస్తున్న సమయంలో ఇసి నిర్ణయం వెలువడడం గమనార్హం. జయలలిత మృతి తర్వాత అన్నాడిఎంకెపై పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రులయిన పన్నీర్‌సెల్వం, పళనిస్వామిల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 జులై 11న పార్టీ జనరల్ కౌన్సిల్…

Read More

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేయాలన్ని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అనర్హత వేటు నుంచి రాహుల్ గాంధీ తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకునే వరకు సమయం ఇవ్వాలని రాహుల్ గాంధీ అభ్యర్థించారు. ట్రయల్ కోర్టు రాహుల్ కఠినంగా ప్రవర్తించారని, ఎంపీ హోదాతో ఎక్కువగా ప్రభావితమయ్యారని పేర్కొంది. రాహుల్ పిటిషన్‌పై గత గురువారం వాదనలు పూర్తిచేసిన సూరత్‌ సెషన్స్‌ కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. రాహుల్‌ తరఫు న్యాయవాది ఆర్‌ఎస్‌ చీమా వాదనలను వినిపించారు. ట్రయల్‌ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగలేదని, గరిష్ఠ శిక్ష వేయాల్సినంత కేసు కాదని తెలిపారు. ‘సందర్భానుసారంగా సాగిన రాహుల్ ప్రసంగంలో పరువు నష్టం కలిగించేంత తీవ్రమైన వ్యాఖ్యలు లేవు.. భూతద్దంలో పెట్టి చూస్తే తప్పా..…

Read More

హైదరాబాద్ లో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటితో పాటు జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ లో ఐటీ అధికారుల బుధవారం సోదాలు జరిపారు. 12 గంటల పాటు మైత్రి మూవీస్ లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారు. మొత్తం నాలుగు వాహనాల్లో మైత్రి ఆఫీస్ నుంచి ఐటీ బృందాలు వెళ్లిపోయాయి. మైత్రి సంస్థలో పని చేసే ఉద్యోగుల నుంచి కీలక సమాచారం సేకరించారు. ప్రొడక్షన్ యూనిట్, ఆఫీస్ స్టాఫ్ ను విచారించారు. మైత్రి మూవీస్ లో ఉద్యోగుల సాలరీ చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అకౌంట్ మేనేజర్లు, ప్రొడక్షన్ మేనేజర్లను గురువారం మరోసారి విచారించనున్నారు. సోదాల సందర్భంగా కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు ఐటీశాఖ అధికారులు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఐటీ రిటర్న్‌లలో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. సినిమాల నిర్మాణ యూనిట్ల కొనుగోలు, వాటికి సంబంధించిన పన్నులపై ఐటీ…

Read More