భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోసహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రతీరోజూ నవీకరించబడే వాతావరణ బులెటిన్‌లో ఐఎండి తెలిపింది. ఈశాన్య భారతదేశం, ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, మధ్య భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. గత ఎనిమిది రోజులుగా పశ్చిమబెంగాల్, అయిదు రోజులుగా బీహార్‌లలో వేడిగాలులు వీస్తున్నాయి. ఇదిలా వుండగా రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో గణనీయమైన మార్పులేమీ ఉండవు. అయితే మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం బుధవారం వేడి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని ఐఎండి తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య భారతదేశం, పశ్చిమబెంగాల్‌లోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండి తెలిపింది. ఒక ప్రాంతంలో…
Author: Editor's Desk, Tattva News
సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు 2023కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇక నుంచి యు, యుఎ, ఎ లకు బదులు వేరే సర్టిఫికేట్స్ రానున్నాయని తెలుస్తోంది. అంతేకాక ఇక నుంచి ఇంటర్నెట్‌లో పైరేటెడ్ ఫిల్మ్ కంటెంట్ ప్రసారం కుదరదని, దీన్ని అరికట్టడానికి గట్టి నిబంధనలను కలిగి ఉంటుందని సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై విలేకరులకు వివరించిన ఠాకూర్, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘యు’, ‘ఎ’, ‘యుఎ’లకు బదులు సినిమాలను వయసు ఆధారంగా వర్గీకరించే నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయని ఆయన చెప్పారు. “యు” అనేది అందరి కోసమని, “ఎ” అనేది వయోజన ప్రేక్షకులకు పరిమితం. ఇక “యుఎ” అనేది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో చూడోచ్చు. ఇక ఈ కొత్త సవరణలతో.. సినిమాలకు…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్‌తోపాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండయ్యారు. అతిక్ అహ్మద్, అతడి సోదరుడి హత్యపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ పోలీస్ అధికారులను ప్రశ్నించనున్నది. క్రైమ్ సీన్‌ను మళ్లీ సృష్టించేందుకు సిట్ మంగళవారం ప్రయత్నించింది. శనివారం అర్ధరాత్రి వేళ అతిత్ అహ్మద్, అతడి సోదరుడ్ని ఆసుపత్రికి తరలించినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా ఉన్నారు? వారి హత్య తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులకు ఎంత సమయం పట్టింది అన్నది సిట్ అధికారులు ఆరా తీశారు. కాగా, ఈ నెల 15న యూపీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , ఆయన సోదరుడిపై ముగ్గురు వ్యక్తులు…
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన రెడ్డి తనకు బళ్లారి వెళ్లడానికి అవకాశం కల్పించాలని, దాని కోసం బెయిల్ నిబంధనలను సడలించాలని జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించిది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్‌ల ధర్మాసనం గాలి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించడం కుదరదని స్పష్టం చేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టులో పిటిషన్ వేయడానికి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది అనుమతి కోరగా, దానికి కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరోవైపు గతేడాది డిసెంబర్ లో బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ తరపున పోటీ…
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జనాభాలో చిరకాలంగా చైనా తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి జనాభాలో భారత్ తొలి స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మధ్యలో చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యారాజ్యసమితి బుధవారం తన నివేదికలో తెలిపింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’ 2023ను తాజాగా ఐక్యరాజ్యసమితి జనాభా అధికారులు ఈ గణాంకాలను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం భారత జనాభా 1,428.5 మిలియన్లు లేదా 1.4286 బిలియన్లతో తొలి స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది. చైనా జనాభా 1.4257 బిలియన్లతో రెండో స్థానంలో ఉంటుందని, అమెరికా 340 మిలియన్ల జనాభాతో మూడో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 నాటికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి ఈ…
ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. దాంతో విశ్వ పటంలో హైదరాబాద్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2012 నుంచి 2022 పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య భారీగా పెరిగినట్లుగా తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023ను హెన్లీ అండ్ పార్టనర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో మొత్తం 97 నగరాలు పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. జాబితాలో మొదటి స్థానం అమెరికాలోని న్యూయార్క్ సిటీ నిలవగా. రెండో స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. న్యూయార్క్ నగరంలో 34000 మంది మిలియనీర్లు ఉండగా, టోక్యోలో 290300 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. మూడో స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా (2.85 లక్షలు), నాలుగో స్థానంలో లండన్ (2.58 లక్షలు), ఐదో స్థానంలో సింగపూర్ (240100), నిలిచింది. తర్వాతి స్థానాల్లో…లాస్ ఏంజెలిస్ (205400) (అమెరికా), హాంకాంగ్…
నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ఢిల్లీకి తరలించాని అధికారులు నిర్ణయించారు. దీంతో బుధవారం ఉదయం ఢిల్లీకి తీసుకురానున్నారు. కాగా, గత నెలరోజుల్లో అధ్యక్షుడు పౌడెల్ అనారోగ్యానికి గురవడం ఇది రెండో సారి. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన త్రిభువన్ టీచింగ్ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని కఠ్మండూ పోస్ట్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. అదేనెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.…
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.3000 కోట్తో 230 ఎకరాలలో పోర్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పోర్టు నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించి సిద్ధంగా ఉంచారు. రాష్ట్రంలో విశాఖపట్నం పోర్ట్ తర్వాత మూలపేట పోర్ట్‌కు ఆస్థాయి ప్రాధాన్యత దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే శ్రీకాకుళం ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. రానున్న రోజుల్లో శ్రీకాకుళం పోర్టు సిటీగా మారబోతుంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధుల్ని ప్రభుత్వం సమకూరుస్తోంది. పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు ఆ ప్రాంతం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా చత్తీస్‌గడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిస్సా రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతులకు ఈ పోర్ట్…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో రేపట్నుంచి మళ్లీ కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా దేశంలో ప్రతీ రోజూ వేలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు టెస్ట్-ట్రాక్-ట్రీట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచాలనీ, ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ సంబంధిత మందులను పంపిణీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రానికి 15 లక్షల బూస్టర్…
సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుకెళ్లి, బెయిల్ పై విడుదలై వచ్చిన తీన్మార్ మల్లన్న తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్టు చెబుతూ మంత్రి మల్లా రెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్మాడని, అయితే తాము వీకర్ సెక్షన్స్ తో ఉన్నామని ఆయన చెప్పారు. జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. మల్లన్న విడుదల సందర్భంగా ఆయన అభిమానులు బాణసంచాతో సంబరాలు నిర్వహించారు. జైలు నుంచి మల్లన్న విడుదలైన తర్వాత ర్యాలీ తీశారు. తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మల్లన్నతో పాటు క్యూ న్యూస్ స్టాఫ్ట్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా…