Author: Editor's Desk, Tattva News

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్నా మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా బుధవారం ఒక్క రోజే 10 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం విశేషం. చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తూ వెళుతుంది వైరస్. కేవలం 24 గంటల్లోనే 10 వేల 158 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 45 వేలకు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎనిమిది నెలల్లో ఈ స్థాయిలో కొత్త కేసులు రావటం ఇదే తొలిసారి. ఎక్స్​బీబీ1.16 అనే వేరియంట్ కారణంగా భారత్​లో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో కొత్త కేసులు సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.…

Read More

పంజాబ్‌లోని భటిండా మిలటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన దాడిలో నలుగురు సైనిక సిబ్బంది మరణించారు. తెల్లవారుజామున 4.30గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆర్మీ తెలిపింది. వెంటనే సత్వర ప్రతిస్పందనా దళాలను మోహరించి, ఆ ప్రాంతానుంతా చుట్టుముట్టారు. ఉగ్రవాదుల దుశ్యర్య లేదా మరేదైనా అనే దిశలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇన్సాస్‌ రైఫిల్‌, గొడ్డలి పట్టుకుని, కుర్తా పైజామాల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారని పంజాబ్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంటోంది. ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా తమ ముఖాలు కనబడకుండా ముసుగులు ధరించి వునాురని తెలిపింది. గాలింపు బృందానికి ఆ ప్రాంతంలో ఇన్సాస్‌ రైఫిల్‌, తూటాలు దొరికాయనిసైన్యం తెలిపింది. ఆ ఆయుధాలను పంజాబ్‌ పోలీసులు, సైన్యానికి చెందిన సంయుక్త బృందాల ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. రైఫిల్‌లోనిమిగిలిన తూటాలు ఫోరెన్సిక్‌ విశ్లేషణ తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తాయని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌ పోలీసులతో…

Read More

ఒక వంక తిరిగి బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాడంటూ రాజకీయ ప్రత్యర్థుల నుండి ఆరోపణలు ఎదుర్కొంటుండగా, బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకదారికి చేరే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షాలు ఉమ్మడిగా అపోటీ చేస్తే బిజేపికి లోక్ సభలో 100కు మించి సీట్లు రావని కొద్దికాలం క్రితం ఆయన చెప్పడం గమనార్హం. ముందుగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో వెళ్లి ఆయనతో పాటు, రాహుల్ గాంధీతో కూడా ఈ విషయమై సమాలోచనలు జరిపారు. తనతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్ జె డి అధినేత తేజస్వి యాదవ్ ను కూడా తీసుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. దేశంలో ప్రధాని మోదీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా అన్ని పార్టీల‌ను ఏకం చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్పష్టం…

Read More

దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో సంపన్నుడిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలారు. పైగా, మొత్తం 30 మంది ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, వాటిలో సగంకు పైగా కేవలం జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నాయి. తన ఆస్తుల విలువ రూ.510 కోట్లని స్వయంగా ఆయనే తన 2019 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల విలువ కలిపి రూ.1,018.86 కోట్లు ఉంటే, అందులో 50.09 శాతం ఆస్తులు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదే ఉన్నాయి. దేశంలో మిగిలిన 29 మంది ముఖ్యమంత్రి ఆస్తుల విలువ కలిపి రూ.508 కోట్లుగా ఉన్నాయి. జగన్‌ మోహన్‌రెడ్డి ఆస్తి విలువ రూ.510.38 కోట్లుగా ఉంది. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు ఉండగా, మిగతావి స్థిరాస్తులు ఉన్నాయి. …

Read More

తన ప్రైవేట్ లైఫ్ ను వదిలేసి, మళ్లీ ప్రజా జీవితంలోకి రావడానికి ప్రస్తుతం బీజేపీ మాత్రమే తన ముందు ఉన్న ఏకైక మార్గమని మాజీ ముఖ్యమంత్రి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలనే బీజేపీలో చేరిన ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తన ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఒకటి ప్రజా జీవితంలో ఉండాలా? లేక వద్దా? అనేవే తన ముందు ఉన్న ఆప్షన్లు అని పేర్కొన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, సౌత్ జోన్ కు ఆడానని చెప్పారు. ఇప్పుడు గోల్ఫ్ ఆడుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగగా కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బిజెపి గురించే మాట్లాడుకుందామని చెప్పారు. రాష్ట్ర విభజన చేయడం…

Read More

ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బిఆర్‌ఎస్‌ నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. బిఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న సభ సందర్భంగా కార్యకర్తలు బాణా సంచా పేలుస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. బాణాసంచా నిప్పు రవ్వలు సమీపంలోని గుడిసెపై నిప్పంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అందులో ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకుని పేలిపోయాయి. పేలుడు ధాటికి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనానికి తీవ్రంగా గాయపడ్డారు. సభ వేదిక వద్దకు ఎంపీ, ఎమ్మెల్యే వచ్చిన సమయంలో కార్యకర్తలు టపాసులు పేల్చారు. నిప్పురవ్వలతో గుడిసెకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు చెలరేగాయి. గుడిసెకు అంటుకున్న మంటల్ని ఆర్పేందుకు జర్నలిస్టులతో పాటు సిఐ, పోలీసులు ప్రయత్నించారు. మంటల్ని ఆర్పుతుండగానే ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతో పాటు మరికొందరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తు విధుల్లో ఉన్న…

Read More

రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడం చేతకాని మంత్రి కేటీ ఆర్ ప్రధాని నరేంద్ మోదీపై విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయ శాంతి ధ్వజమెత్తారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడడంతో తెలంగాణ సమాజం చీదిరించుకుంటున్నదని, దీంతో కేటీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని ఆమె దుయ్యబట్టారు. కేంద్రంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆమె మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఆ హామీ గురించి ప్రశ్నిస్తే బైలడిల్ల గనుల గురించి కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. ‘‘మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా మినహా ఏ ప్రభుత్వ రంగ…

Read More

ఐక్యరాజ్యసమితి పాశ్చాత్య శక్తుల దాడులను ఖండించిన నేపథ్యంలో సెంట్రల్ మయన్మార్ లో మంగళవారం తిరుగుబాటుదారులపై మిలటరీ జవాన్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో 100 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. 2021వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆగ్నేయాసియా దేశం మయన్మార్ లో గందరగోళం నెలకొంది. ప్రాణాంతక వైమానిక దాడులు చేశారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. సగయింగ్ ప్రాంతంలోని టౌన్‌షిప్‌పై మంగళవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారు. మయన్మార్ సాయుధ దళాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. వైమానిక దాడుల పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వాషింగ్టన్ తెలిపింది.భయంకరమైన హింసను నిలిపివేయాలని బర్మా ప్రజల సమగ్ర ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలని యునైటెడ్ స్టేట్స్ బర్మా పాలకులకు పిలుపునిచ్చింది. మృతదేహాలను…

Read More

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ 189 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది. ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి ఆర్.అశోక పద్మనాభ నగర్, కనకపుర స్థానాల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో తలపడనున్నారు. మొదటి జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులు, 32 మంది వెనుబడిన వర్గాల అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాల అభ్యర్థులు ఉన్నారు. 9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ,8…

Read More

అతి తక్కువ ప్రీమియంతో దేశ ప్రజలకు అందజేస్తున్న సామాజిక భద్రత పథకాల్లో ప్రజల్ని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 3 నెలల పాటు భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి డా. వివేక్ జోషి అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు 3 నెలల పాటు నిర్వహించే ప్రచార కార్యక్రమం దేశంలోని అన్ని జిల్లాల్లో జరుగుతుందని సమావేశం అనంతరం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న (పిఎంజెజెబివై), ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పిఎంఎస్‌బివై) వంటి సూక్ష్మ బీమా పథకాలను గ్రామ పంచాయితీ స్థాయిలో ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం పథకాల్లో నమోదు ఉండాలని పేర్కొంది. గురువారం ప్రభుత్వ…

Read More