కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీలో పలు ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. శివమొగ్గకు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ, మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప (74) అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదని ప్రకటించారు. మరోవంక, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ ను పోటీకి దూరంగా ఉండమని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈశ్వరప్ప తాను అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదన్న విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాకు లేఖ ద్వారా తెలియజేశారు. తనకు ఏ నియోజకవర్గం కేటాయించొద్దని కూడా ఆయన తన లేఖలో నడ్డాను కోరారు. ‘పార్టీ నాకు గత 40 ఏళ్లుగా బాధ్యతలు అప్పగించింది. నేను బూత్ ఇన్‌ఛార్జీ నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్ వరకు పనిచేశాను. నేను ఉపముఖ్యమంత్రిని కూడా అయ్యాను’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. శివమొగ్గ నుంచి పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈశ్వరప్ప లేఖ రాశారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధృవీకరించారు.…
Author: Editor's Desk, Tattva News
ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో దేశ వ్యాప్తంగా బెట్టింగ్ లు జోరందుకున్నాయి. తక్కువ సమయంలో ఈజీగా మనీ సాధించాలనే దురాశతో మ్యాచ్ కు ముందే బెట్టింగ్ కు పాల్పడుతు కోట్లు కొల్లగొడుతున్నారు. బాల్ బాల్ కు, ఓవర్ ఓవర్ కు ప్లేయర్లపైన ఇలా కోట్లల్లో దందా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లపై ఆన్ లైన్లో బెట్టింగ్ జరుపుతున్న ముఠాను సైబారాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఏప్రిల్ 10న ఆర్సీబీ, లక్నో సూపర్ జాయింట్ మ్యాచ్ సందర్భంగా బాచుపల్లిలోని ఓ ఇంట్లో 10 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఓ ఇంటిపై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 10 మంది బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.60.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారి బ్యాంకు ఖాతాల్లో…
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్‌ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారనే అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. రూ.కోట్ల హవాలా రూపంలో చేతులు మారినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈడీకి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సిట్ ఈ కేసులో సాక్షిగా చేర్చిన శంకర్ లక్ష్మిపై ఈడి ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్‌గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ కావడంపై ఈడీ ప్రశ్నించనుంది. ఈ మేరకు ఈడీ శంకర్ లక్ష్మీతో పాటు టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో…
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నయ్ కదా.. ఆ హామీ ఏమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద దేవి థియేటర్‌లో “బలగం” సినిమాను జిల్లాల అధ్యక్షులతో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బలగం సినిమా తీసి మానవ సంబంధాలు, కుటుంబ బంధాల గురించి అద్భుతంగా చెప్పిన డైరెక్టర్ వేణుకు నా హ్యాట్సాఫ్ అని అభినందించారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవిఐ) బిడ్డింగ్ లో పాల్గొంటానడం చూస్తే నవ్వొస్తుందని పేర్కొన్నారు.సక్రమంగా జీతాలే ఇయ్యలేని ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వం దగ్గర నిధులుంట నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరించాలని, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపించాలని, కమలాపూర్ రేయాన్…
గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది. అదానీ గ్రూప్‌లోని బినామీ కంపెనీల నుంచి వచ్చిన రూ.20 వేల కోట్లకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ అదానీ గ్రూప్ కంపెనీల విక్రయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 2019 నుంచి గ్రూప్‌లోని కంపెనీలు దాదాపు 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) విలువ చేసే వాటాలను విక్రయించాయని పేర్కొంది. దీనిలో 2.55 బిలియన్ డాలర్లు (రూ.20,900 కోట్లు) వ్యాపార విస్తరణ కోసం మళ్లీ పెట్టుబడి పెట్టినట్టు సంస్థ వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు అతలాకుతలం అయ్యాయి. అప్పటి నుంచి రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ నివేదిక పేరుతో అదానీ గ్రూప్…
‘‘ఆన్ లైన్ లో అమూల్ పాలు, పెరుగు అమ్ముతాం. బెంగళూరులో మేం వ్యాపారం ప్రారంభిస్తున్నాం” అని గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) చేసిన ట్వీట్ కర్నాటక ఎన్నికలలో రాజకీయ దుమారానికి దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం వివాదాస్పదంగా మారింది. అమూల్ ప్రకటన ప్రతిపక్షాలు కీలక ఎన్నికల ప్రచార ఆయుధంగా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాయి. కర్నాటక రైతులందరూ కలిసి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)ను ఏర్పాటు చేసుకుని నందిని బ్రాండ్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అమూల్ వస్తే కేఎంఎఫ్ పరిస్థితేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమూల్, కేఎంఎఫ్ విలీనంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ విమర్శిస్తున్నది. అమూల్ ప్రకటనను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్, జేడీ(ఎస్)తో పాటు కన్నడ అనుకూల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు సంఘాల నాయకులు రోడ్డెక్కడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సోమవారం కర్నాటక కాంగ్రెస్…
ఎన్సీపీ, సీపీఐ, టీఎంసీలు జాతీయ హోదా కోల్పోయాయని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకిజాతీయ హోదా ప్రకటించింది. మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన కేసీఆర్‌కు ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే ఏర్పాటైంది. 1964లో సీపీఐ, సీపీఐ(ఎం) విడిపోయాయి. ఆ తర్వాత సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళలో అధికారంలోకి రాగలింది. అయితే సీపీఐకి మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉంది. సీపీఐ క్రమంగా ప్రాభవం కోల్పోయి చివరకు జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. సీపీఐకి డి.రాజా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. తృణమూల్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉంది. మమతా బెనర్జీ టీఎంసీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సభ్యులున్నా జాతీయ స్థాయిని కాపాడుకునే స్థాయిలో…
అరుణాచల్ ప్రదేశ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం జరిపిన పర్యటన పట్ల చైనా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందిన భూభాగమని, అక్కడ అమిత్ షా పర్యటించడం తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుందని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు శాంతి ప్రక్రియకు ఏ మాత్రం మేలు చేయవని వ్యాఖ్యానించింది. గత నెలలోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చింది. ఆ రాష్ట్రాన్ని చైనా జాంగ్నాన్ అని పిలుస్తోంది. జాంగ్నాన్ లో భారత నేతలు, అధికారులు పర్యటించడం సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఏమాత్రం సహకరించవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ లో సోమ, మంగళ వారాలలో అమిత్ షా పర్యటన కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో అమిత్ షా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు.…
టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రం లీకేజి కేసులో మొదటి నిందితుడిగా గతవారం అరెస్ట్ అయిన సందర్భంగా పోయిన్నట్లు చెబుతున్న తన మొబైల్ ఫోన్ లో కీలక సమాచారం ఉన్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక బాంబు పేల్చారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు అందులో సమాచారం ఉందని వెల్లడించారు. తమతో పలుమార్లు సంప్రదింపులు జరిపారని, సీఎం కేసీఆర్‌కు ఈ విషయం తెలిసి మూర్చపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పలుమార్లు మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ నేతలు పేర్కొనడం గమనార్హం. బండి సంజయ్ కూడా పలుమార్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యలను రిపీట్ చేయడం గమనార్హం. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ టీం సభ్యులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా బీజేపీలో…
మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో సిగపట్లు శృతిమించుతున్నాయి. సొంతపార్టీపైనే మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ విమర్శల దాడికి దిగారు. గతంలో వసుంధర రాజే పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందని సచిన్ పైలెట్ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం ఒక రోజు నిరాహార దీక్షకు చేపట్టనున్నట్లు ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉందని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని సచిన్ పైలెట్ స్పష్టం చేశారు. ఎక్సైజ్‌మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు, లలిత్ మోడీ అఫిడవిట్ కేసుపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వీటిపై విచారణను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. వసుందరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వసుంధర రాజే పాలన వైఫల్యాలు, అవినీతిపై గెహ్లాట్ ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తోన్న…