Author: Editor's Desk, Tattva News

దేశంలోనే తొలిసారిగా అన్నట్టుగా జలాంతర్భాగంలో మెట్రో రైలును నడిపేందుకు కోల్‌కతా మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ (కేఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తున్నది. హుగ్లీ నదిలో సొరంగ మార్గం ద్వారా నదికి పశ్చిమ ఒడ్డున హౌరా స్టేషన్‌ కాంప్లెక్స్‌ను జలాంతర్భాగంలో నడిచే మెట్రో రైలు తూర్పు ఒడ్డున ఆర్మేనియన్‌ ఘాట్‌తో కలుపుతుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ చేపట్టడానికి కేఎంఆర్‌సీ రంగం సిద్ధం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ట్రయల్‌ రన్‌ నిర్వహించే తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించాయి. తూర్పు-పశ్చిమ మెట్రో లైన్‌ కారిడార్‌ (గ్రీన్‌ లైన్‌) ప్రస్తుతం 9.3 కి.మీల మేర సాల్ట్‌ లేక్‌ సెక్టార్‌ ఐదు నుంచి సెల్దా స్టేషన్‌ వరకు విస్తరించి ఉంది. హౌరా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లనేడ్‌ వరకు నది అంతర్భాగంలో నిర్మించిన మెట్రో రైలు మార్గం ఈ ఏడాదిలోగా ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్టు కేఎంఆర్‌సీ వర్గాలు తెలిపాయి. ఇది ప్రయాణికులను ఎస్‌ప్లనేడ్‌ వద్ద ఉత్తర-దక్షిణ కారిడార్‌కు…

Read More

లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో 2030 నాటికి కేన్సర్‌, హృద్రోగాలు, రోగ నిరోధక శక్తిని హరించే వ్యాధులతో పాటు అరుదైన వ్యాధులకు వ్యాక్సిన్లు తీసుకోస్తామని పేరొందిన మోడర్నా ఫార్మా కంపెనీ తెలిపింది. సదరు వ్యాక్సిన్లు ప్రయోగ దిశలో మంచి ఫలితాలను ఇచ్చాయని మోడర్నా ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల వ్యాధులకు తమ కంపెనీ వ్యాక్సిన్లు రూపొందిస్తుందని మోడర్నా ఫార్మా కంపెనీ చీఫ్‌ మోడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పాల్‌ బుర్టోన్‌ తెలిపారు. పేరొందిన కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన సదరు ఫార్మా కంపెనీ ప్రస్తుతం వేర్వేరు రకాల కేన్సర్‌ కణితులు లక్ష్యంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నది. తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు అత్యంత ప్రభావితమైనవని డాక్టర్‌ పాల్‌ బూర్టోన్‌ తెలిపారు. అవి లక్షలాది మందిని కేన్సర్‌ బారి నుంచి కాపాడుతాయని ఆయన చెప్పారు. ఒక్క ఇంజెక్షన్‌ ద్వారా కోవిడ్‌, ఫ్లూ లాంటి అనేకరకాల శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్లను…

Read More

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మళ్లీ కరోనా నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గడిచిన వారంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి మహమ్మారి నివారణ, వైద్య వసతుల సన్నద్ధతపై ఆరా తీశారు. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సన్నద్ధతను పరిశీలించడానికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని కోరారు. తాజాగా పెరుగుతున్న కేసుల నివారణను సమర్ధంగా అరికట్టేందకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా సహా ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. అలాగే వీటిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కరోనా నాలుగో దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాండవీయ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో వచ్చిన బీఎఫ్.7…

Read More

‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ప్రధాని మోడీ కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించారు. సుమారు 20 కిలోమీటర్లు జీప్‌లో పర్యటించారు. అనంతరం తెప్పకాడు ఎలిఫెంట్‌ క్యాంప్‌ను సందర్శించి ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా ఇచ్చారు. తలపై హంటర్స్ క్యాప్ ధరించి వేటగాడి రూపంలో సఫారీ కోసం వినియోగించే కెమెరాతో కర్ణాటకలోని బండీపూర్ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించారు. బండీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తమిళనాడు ముడుమళైకి వెళ్లారు. థెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌ను సందర్శించారు. ఇటీవలే ఆస్కార్ అవార్డును అందుకున్న ది ఎలిఫెంట్ విష్పర్స్ డాక్యుమెంటరీ కపుల్స్ బొమ్మన్ బెళ్లిని కలుసుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన రఘు అనే ఏనుగుతో కలిసి ఫొటోలు దిగారు. సాధారణంగా బొమ్మన్ బెళ్లిని పలువురు ప్రముఖులు ఇప్పటికే కలుసుకున్నారు. వారిలో ఎవరూ కూడా థెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్లేదు. ప్రధాని మోదీ వారికి భిన్నంగా వ్యవహరించారు. తానే స్వయంగా వారు ఉన్న ఎలిఫెంట్…

Read More

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పైలెట్‌ దుస్తులు ధరించి యుద్ధ విమానంలో కొద్ది సేపు విహరించారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోరు యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించారు. అస్సాంలోనితేజ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో ఈ దృశ్యం కనిపించింది. రాష్ట్రపతి త్రివిధ దళాలకుసుప్రీం కమాండర్‌ అను సంగతి విదితమే. కాగా సుఖోరు విమానంలో ప్రయాణించిన భారత రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ సుఖోరులో ప్రయాణించారు. ఆమె 2009లో పూణే ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి సుఖోరు ఫైటర్‌ జెట్‌లో ప్రయాణించారు. కాగా ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము సుఖోరు ఎంకె 301లో ప్రయాణించారు. ఇది రష్యా అభివఅద్ధి చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఆఫ్‌ ఇండియా లైసెన్స్‌తో నిర్మితమయ్యింది. ద్రౌపది ముర్ము మూడు రోజుల అస్సాం పర్యటనలో భాగంగా చివరి రోజైన శనివారం సుఖోరులో ప్రయాణించారు. గౌహతి నుంచి తేజ్‌పూర్‌లోనిఎయిర్‌ఫోర్స్‌…

Read More

తిరుమలలో లో భక్తుల రద్దీ కూడా కొనసాగుతోంది. శనివారం ఔట్‌ రింగ్‌రోడ్డు, శిలాతోరణం, క్యూ లైన్‌లు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో తిరుమలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం టికెట్‌లేని భక్తులకు దాదాపు 30 గంటలు సమయం పడుతుంది. కాగా మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద భవనం, అన్నప్రసాదం కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానాలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలు ప్రత్యేక దృష్టిసారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. అలాగే మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే శనివారం మధ్యాహ్నానికి దాదాపు 79 వేలమందికి పైగా అన్నప్రసాదం అందించగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ క్యూ లైన్‌లలో 80 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో పాలు, ఉప్మా, పొంగల్‌) లు పంపిణీ చేశారు.…

Read More

ప్రముఖ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌కు చెందిన కారును కర్నాటకలో నిలిపివేసి తనిఖీలు చేయగా అందులో విలువైన వెండి వస్తువులను కనుగొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దశలో ఇప్పుడు కోడ్ అమలులో ఉంది. ఎన్నికల సంఘం అధికారులు సంబంధిత సిబ్బంది సాయంతో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా దావణగేరే శివార్లలోని హెబ్బలు టోల్‌గేట్ వద్ద చెక్‌పోస్టు వద్ద కారులో తనిఖీ చేయగా 66 కిలోల వెండి గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ 39 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవర్ సుల్తాన్‌ఖాన్‌తో పాటు కారులో ఉన్న హరిసింగ్ ఇతరులపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయి ఉంది. హరిసింగ్‌ను విచారించగా ఈ వెండి వస్తువులు బోనీకపూర్ కుటుంబానికి చెందినవే అని తెలిపారు. అయితే వీటికి…

Read More

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమినీ జాపరోవా ఆదివారం నుండి భారత్ లో నాలుగు రోజులపాటు పర్యటిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధి భారత్ కు రావడం ఇదే ప్రథమం. భారత్ కు రష్యా చిరకాల మిత్ర దేశం. భారత్ ఇబ్బందుల్లో ఉన్న చాలా సమయాల్లో రష్యా ఆదుకుంది. ఇప్పటికీ ఇంధనం, రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ రష్యా పైననే ఆధారపడుతోంది. మరోవైపు, అమెరికా సహా పశ్చిమ దేశాలతో సకారాత్మక మైత్రి భారత్ కు అత్యవసరం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమినీ జాపరోవా భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత పర్యటనలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రధానంగా భారత విదేశాంగ శాఖలోని సీనియర్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారని సమాచారం. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులపై వారు చర్చించే అవకాశముంది. అలాగే, రష్యా తో యుద్ధం నేపథ్యంలో ఆర్థికంగా ఉక్రెయిన్…

Read More

ఎప్పటిలాగానే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ హాజరుకపోవడం ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ శనివారం షెడ్యూల్ బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కోసం తాను చాలా ఎదురుచూశానన్న సంజయ్… కేసీఆర్ కు సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని చెప్పారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ ఎందుకు రారని నిలదీశారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదని మండిపడుతూ కుటుంబ, నియంత, అవినీతి పాలన అంతం కావాలని సంజయ్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు.

Read More

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారిన పడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6298 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,47,51,259 కి చేరింది. ఇందులో5,30,954 మంది మరణించారు. ప్రస్తుం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.74 శాతం మంది కోలుకున్నారు. 1.19 శాతం మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడం విశేషం. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను ( ఎమర్జెన్సీ హాట్ స్పాట్స్) గుర్తించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు…

Read More