తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార పార్టీ బిఆర్ఎస్ పేరు ఎత్తుకుండానే, ఎవరి పేరు ప్రస్తావించకుండానే తీవ్రంగా విమర్సించారు. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుండి విముక్తి కలిగించాలని పిలుపిచ్చారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి హైదరాబాద్ కు వచ్చిన ఆయన పెరేడ్ గ్రౌండ్స్ లో శనివారం జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని.. అదే నా బాధ, ఆవేదన అని చెప్పారు. “మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారు” అంటూ రాష్ట్ర పాలనపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప ప్రజల ప్రయోజనాలను చూడటం లేదని అంటూ కేసీఆర్ పాలనపై నిప్పుల వర్షం…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి 24 గంటల పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకోసం సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున ఎక్స్‌ట్రా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టిన వారికి సంవత్సరం పొడవునా 24/7 దుకాణం తెరిచే ఉంచుకోవచ్చన కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో అటు దుకాణాదారులకు వ్యాపారం పెరగటంతో పాటు కస్టమర్లకు కూడా ఏ సమయంలోనైనా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ప్రభుత్వ కృషిలో భాగంగా.. అన్ని వేళలా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం అన్ని రకాలుగా దోహదపడే అంశంగా భావిస్తున్నారు. అయిత…
సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్న వందేభారత్ రైలు టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎసి చైర్‌కార్ టికెట్ ధర రూ.1680లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరను రూ.3080లుగా నిర్ణయించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఎసి చైర్‌కార్ టికెట్ ధర రూ.1625లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరను రూ.3030లుగా అధికారులు టికెట్ ధరలను ఖరారు చేశారు. నేడు ప్రారంభమయ్యే వందేభారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌లో ఆగుతుంది. సికింద్రాబాద్- టు తిరుపతి మధ్య నడిచే (20701) ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి టు -సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. మంగళవారం…
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో పేపర్‌ను కొనుగోలు చేసిన దంపతులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మంలో కార్ల వ్యాపారం నిర్వహించే సాయిలౌకిక్, సుష్మిత దంపతులు. సుష్మిత హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1, డీఏవో నోటిఫికేషన్లు విడుదల కావడంతో తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాసింది. అయితే ఆమె ఓఎంఆర్ షీట్‌లో హాల్‌టికెట్ నంబర్ రాంగ్ బబ్లింగ్ చేసింది. దీంతో పరీక్షల ఫలితాలలో ఆమె పేపర్‌ను టీఎస్‌పీఎస్సీ అనర్హత జాబితాలో ఉంచింది. తాను ఓఎంఆర్ షీట్‌లో రాంగ్ బబ్లింగ్ చేశానని, దానిని పరిగణలోకి తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ఆమె టీఎస్‌పీఎస్సీకి వచ్చి అధికారులను కలిసింది. అధికారులను కలిసే క్రమంలో కార్యదర్శి అనితా రాంచంద్రన్ పీఏగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ను కూడా కలిశారు. ఈ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బిజెపి కీలక నేతలు డాక్టర్ లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా, చీఫ్ విప్ గా, ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలందించారని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా కిరణ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. కిరణ్ తండ్రి అమర్ నాథ్ రెడ్డి మంత్రిగా పని చేశారని, కిరణ్ సీఎంగా చేశారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ అని, రంజీ స్థాయి వరకు ఆడారని తెలిపారు. కిరణ్ తన ఇన్నింగ్స్ ను కాంగ్రెస్…
టెన్త్ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఎట్టకేలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను హనుమకొండ కోర్టు మంజూరు చేసింది. ఏడు గంటల సుదీర్ఘ వాదన అనంతరం రూ.20 వేల పూచికత్తుతో బండి సంజయ్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే.. బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం నుంచి వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం మూడు సార్లు విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేయాలని న్యాయస్థానం భావించగా.. ఈరోజే తుది నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ తరపున లాయర్లు పట్టుబట్టారు. బండి సంజయ్‌ను కావాలనే ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరపున లాయర్లు వాదించారు. శుక్రవారం ఆయన అత్తగారి దశదినకర్మ ఉందని.. ఆ కార్యక్రమానికి ఆయన కచ్చితంగా హాజరుకావాల్సి ఉందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన…
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. లేఖలో కేజ్రీవాల్‌తో పాటు టీఆర్ఎస్ నేతల ప్రస్తావన చేశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు రూ. 15 కోట్లు టీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చానని చెప్పాడు. డబ్బు ముట్టినట్టు టీఆర్ఎస్ నేత చేసిన చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయని వెల్లడించారు. సౌత్ గ్రూపులో ఉన్న టీఆర్ఎస్ నేతతో కేజ్రీవాల్‌కు ఉన్న సంబంధాలు స్పష్టంగా బయటపడుతున్నాయని, ఆ టీఆర్ఎస్ నేత ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించాడు. తన సహాయకుడు ఏపీ (అరుణ్ పిళ్ళై)కి రూ. 15 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆ టీఆర్ఎస్ నేత చాట్‌లో స్పష్టంగా చెప్పారని సుఖేశ్ లేఖలో తెలిపాడు. రూ. 15 కోట్లను 15 కేజీల నెయ్యిగా చాట్‌లో పేర్కొన్నారని, పిళ్ళై…
ప్రభుత్వం నిర్మించిన కార్యక్రమాలు, సినిమాలను ప్రసారం చేసేలా అమెజాన్ ఇండియాతో కేంద్రం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రభుత్వం నిర్మించిన పలు కార్యక్రమాలను అమెజాన్ వేదికగా ఓటిటిలోనూ ప్రసారం కానున్నాయి. ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ భారత దేశ నాగరికత, సంస్కృతి, సాంప్రదాయల నుండి మిలియన్ల కొద్దీ కథలు ఉన్నాయని.. వాటిని ఓటిటి ద్వారా ప్రసారం చేసేలా ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డిసి), దూరదర్శన్‌లతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నుండి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సంబంధిత కార్యక్రమాలు ఓటిటిలో ప్రసారమవుతాయని పేర్కొన్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కోర్సు నేర్చుకుంటున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, మాస్టర్‌క్లాసులతో పాటు ఇతర అవకాశాలు కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.…
పోలవరం ముంపు సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న పోరు ఉధృతం అవుతున్నది. పోలవరం బ్యాక్ వాటర్ తో తెలంగాణకు ముప్పు సమస్య ఏర్పడుతున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కొట్టిపారవేస్తున్నది. అందుకనే, సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ విషయమై ఏపీని నిలదీసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమైంది. జులైలో పోలవరం ముంపుతో భద్రాచలంలో తీవ్ర నష్టం సంభవించినా ఇప్పటికీ ఎందుకు నివారణ చర్యలు పేపట్టడం లేదని ఏప్రిల్ 10న జరగనున్న సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకు తెలంగాణ ఆధారాలతో నివేదికలను రూపొందిస్తున్నది. పోలవరంతో తెలంగాణలో ముంపు సంభవించలేదని ఏపీ చేస్తున్న వాదనలను ఎండగట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలను రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధం చేస్తుంది. పోలంవరం బ్యాక్ వాటర్‌తో అనేక ప్రాంతాలు తీవ్ర నష్టపోయినట్లు వీడియో ఆధారాలున్నప్పటికీ, జాతీయ స్థాయిలో చర్చ జరిగినప్పటికీ తప్పించుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో…
శృంగారంపై క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ డాక్యుమెంటరీలో సెక్స్ సద్గుణాలను ప్రశంసించారు. ‘సెక్స్ అనేది దేవుడు మానవులకు ఇచ్చిన అందమైన వాటిలో ఒకటి’గా ఆయన అభివర్ణించారు. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం గతేడాది రోమ్‌లో 20 ఏండ్ల వయసులో ఉన్న పది మంది యువకులతో ముచ్చింటించిన పోప్ ఫ్రాన్సిస్ యువకులు అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయన చెప్పిన సమాధానాలను ‘ది పోప్ ఆన్సర్స్’ పేరుతో డిస్నీ ప్రొడక్షన్ డ్యాక్యుమెంటరీని విడుదల చేసింది. పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడిన పది మంది యువకులు.. కేథలిక్ చర్చి పరిధిలోని ఎల్జీబీటీ హక్కులు, అబార్షన్, అశ్లీల పరిశ్రమ, శృంగారం, దైవ విశ్వాసం వంటి అనేక అంశాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోప్ ‘దేవుడు మనిషికి ఇచ్చిన అందమైన వాటిలోలో శృంగారం ఒకటి’ అని ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఎల్జీబీటీ హక్కుల గురించి మాట్లాడుతూఎల్జీబీటీ వ్యక్తులను…