Author: Editor's Desk, Tattva News

హనుమాన్ చేయలేనిది అంటూ ఏదీ లేదని, అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తలచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ హనుమాన్ మాదిరిగానే పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పేదలకు సామాజిక సేవ, న్యాయం చేయటమే బీజేపీ విధానం అని స్పష్టం చేస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని కీర్తించారు. దేశంలోని కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ విధానం ఏంటో తెలియకుండానే బీజేపీపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని, అందుకే వారి అడ్రస్ గల్లంతు అయ్యిందని పేర్కొన్నారు. దేశం కోసం బీజేపీ పెద్ద పెద్ద కలలు కంటుందని, వాటిని సాకారం చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబట్టటం కోసం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నామని తెలిపారు. దేశంలో అవినీతిపై యుద్ధాన్ని హనుమంతుడి తరహా…

Read More

అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శృంగార తార స్టోర్మీ డేనియల్స్ కేసులో అరెస్టు అయ్యి వెంటనే విడుదల దశలోనే కాలిఫోర్నియా కోర్టులో భారీ ఉపశమనం దక్కింది. ఈ కోర్టులో డేనియల్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం దావా వీగిపోయింది. కాలిఫోర్నియాలోని 9వ యుఎస్ సర్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ డేనియల్స్ వాదనను తోసిపుచ్చింది. పైగా ఈ ఉదంతంలో ట్రంప్ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (దాదాపు రూ కోటి ) చెల్లించాలని ఆదేశించింది. ఒక్కరోజు క్రితమే ట్రంప్ మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. తనపై నేరాభియోగాల దాఖలుకు సంబంధించి ఉండే ప్రక్రియలో భాగంగా అరెస్టు అయ్యారు. తరువాత విడుదల చేశారు. ఇదే క్రమంలో పోర్న్‌స్టార్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం దావా విచారణలో ఆమెకు భారీ షాక్ తగిలింది. ఈ పరువు నష్టం దావాను కోర్టు కొట్టివేసింది. ట్రంప్ న్యాయపరమైన వ్యయానికి భారీ చెల్లింపులకు ఆదేశాలు వెలువరించింది. మాన్‌హట్టన్…

Read More

పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఏ 1 నిందితుడిగా పేర్కొని పోలీసుల అదుపులోకి తీసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు. పోలీసులు బుధవారం సాయంత్రం హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచిన పోలీసులు తమ రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో ఏప్రిల్ 19 వరకు రిమాండ్ విధించింది. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను జైలుకు తరలింఛాయారు. కాగా ఈ కేసులో ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం, అలాగే ఆయనను ఏ1గా చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. అర్ధరాత్రి ఒంటిగంట బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనితా రాపోల్…

Read More

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అదెప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తారు. సచివాలయ ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తొలుత తన సీట్లో కూర్చుంటారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో, సచివాలయ సిబ్బంది తమ చాంబర్లలో కూర్చుంటారు. ప్రారంభ కార్యక్రమానికి మొత్తం 2,500 మందిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు తదితరులు ఉంటారు. సందర్శకులను మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆగ్నేయ ద్వారం ద్వారా అనుమతిస్తారు. మెయిన్ గేటును మాత్రం ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, ముఖ్యమైన ఆహ్వానితులు, దేశవిదేశీ అతిథులు, ప్రముఖుల కోసం వినియోగిస్తారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా…

Read More

రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. రాజకీయ నాయకలకు ప్రత్యేక రాయితీలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాదాపు 30 నిమిషాల సేపు పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వి తాను పిటిషన్‌ను ఉపసంహరించుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో సిజెఐ డివై చంద్రచూడ్ నతృత్వంలోని ధర్మాసనం దీన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు..పిటిషనర్లు కాంగ్రెస్, డిఎంకె, ఆర్‌జెడి, బిఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎన్‌సిపి, శివసేన(యుబిటి), జెఎంఎం, జెడి(యు), సిపిఎం, సిపిఐ, సమాజ్‌వాది పార్టీ, జెకె నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున న్యాయవాది సింఘ్వి వాదిస్తూ గత రాష్ట్ర, యుటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీన్నిటికీ కలిపి 45.19 శాతం ఓట్లు లభించాయని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42.5 శాతం ఓట్లు లభించాయని తెలిపారు. 11 రాష్ట్రాలు, యుటిలలో అధికారంలో…

Read More

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సహా బీజేపీ నేతల అరెస్టులు, నిర్బంధాలపై స్పందిస్తూ తెలంగాణలో ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నేతలను అరెస్టు చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గురించి ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ చేసిన కామెంట్లను అరవింద్ గుర్తుచేశారు. ప్రతిపక్షాల కూటమికి తనను చైర్మన్‌ను చేస్తే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానంటూ కేసీఆర్ రాయబారం సాగించినట్టు రాజ్‌దీప్ వెల్లడించారని తెలిపారు. గతంలో రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను గొప్ప జర్నలిస్టుగా కేసీఆర్ పొగిడిన విషయాన్ని కూడా అరవింద్ గుర్తుచేశారు. ఇంత డబ్బు కేసీఆర్ దగ్గర ఎలా ఉందంటూ దేశం మొత్తం నివ్వెరపోతోందని, ఆ విషయంపై నుంచి దృష్టి మళ్లించడం…

Read More

గురువారం హనుమాన్‌ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి పారా మిలిటరీ బలగాలను తెప్పించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సూచించింది. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా, హుగ్లీ నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బెంగాల్‌ ఉన్నత న్యాయస్థానం ఈ సూచన చేసింది. హనుమాన్‌ జయంతి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం పారా మిలిటరీ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని, అదేవిధంగా ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగినందున 144 సెక్షన్‌ అమలులో ఉన్న ప్రాంతాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు నిర్వహించకూడదని కలకత్తా హైకోర్టు సూచించింది. ఆ తర్వాత కాసేపటికే కేంద్ర హోంశాఖ కూడా శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్‌, బీహార్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ముందు జాగ్రత్తగా ఈ…

Read More

హ‌నుమ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్‌లో టెన్త్ హిందీ ప్ర‌శ్న‌ప‌త్రాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ ను బుధ‌వారం తెల్ల‌వారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్ర‌శాంత్, ఏ3గా మ‌హేశ్‌, ఏ4గా మైన‌ర్ బాలుడు, ఏ5గా మోతం శివ‌గ‌ణేశ్‌, ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్ల‌ను చేర్చారు. సంజ‌య్‌పై క‌మ‌లాపూర్ పోలీసులు తెలంగాణ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్ట్‌, 1997 లోని సెక్ష‌న్ 5 కింద కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 120 బీ, సెక్ష‌న్ 420 కింద కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో బండి సంజ‌య్‌ను పోలీసులు హ‌నుమకొండ కోర్టు కాంప్లెక్స్ ప‌క్క‌నే జ‌డ్జి అనిత రాపోలు ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. అయితే బండి…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ పోలీసులు నాటకీయంగా అరెస్టు చేశారు. 151 పి ఆర్ సి క్రింద 10 పదవ తరగతి పేపర్ లీకేజీ విషయంలో మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు వాహనంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో కరీంనగర్ లోని బండి సంజయ్ అత్తగారింట్లోకి కరీంనగర్ ఏసిపి తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. బండి సంజయ్ అత్తగారు ఇటీవల మరణించారు. బుధవారం నాడు తొమ్మిది రోజుల కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి బండి సంజయ్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ కు వచ్చారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ ను…

Read More

తక్షణమే టీఎస్పీఎస్పీ, టెన్త్ పేపర్ లీకేజీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్  డిమాండ్ చేశారు. బాధ్యులైన మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని కోరారు. టీఎస్పీఎస్పీ, టెన్త్  పేపర్ల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులు కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.  గత కొద్ది రోజులుగా తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నడా? అసలు పాలన ఉందా? అనే అనుమానం కలుగుతోందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అయ్యింది. సోమవారం టెన్త్ క్లాస్ తెలుగు పశ్నాపత్రం లీకైంది. మంగళవారం హిందీ పేపర్ లీకైంది.   అసలేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని, పరీక్షలంటే లెక్కలేని తనం కన్పిస్తోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. గతేడాది ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో…

Read More