Author: Editor's Desk, Tattva News

ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు మంగళవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జవాబిచ్చారు. 2022 ఏప్రిల్ వరకు ఏపీలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు కలిపి మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించగా, వాటికయ్యే ఖర్చును రూ. 70,594 కోట్లుగా అంచనా వేసినట్టు తెలిపారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 72 స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన జవాబులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సమాధానంపై జీవీఎల్ స్పందిస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 219 శాతం అధికంగా మోదీ …

Read More

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలు ఆయనలో స్వల్పంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా సోకిందని, డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులపాటు ఇంటి నుంచే పనిచేస్తానని గెహ్లాట్‌ ప్రకటించారు. కరోనాపట్ల రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహమ్మారి మరింత విస్తరించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఒక ప్రకటన చేశారు. కాగా, అశోక్‌ గెహ్లాట్‌ నిన్న సూరత్‌లో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీని కలిశారు. ఆ సభ కోసం వచ్చిన రాహుల్‌, ప్రియాంకలకు గెహ్లాటే స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు భూపేష్‌ బఘేల్‌, సుఖ్విందర్ సింగ్‌ సుఖు…

Read More

రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ ఇటీవల మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 214 రకాల కరోనా వేరియంట్లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ వేరియంట్లపై కరోనా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం బీఎఫ్.7 ఉపరకమైన ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ వ్యాప్తిలో ఉందన్న ఆయన, వైరస్ విస్తృతి పెరిగినప్పటికీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో కేంద్ర ఆరోగ్యమంత్రి పలు అంశాలను ప్రస్తావించారు. ‘దేశంలో భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ‘కొవిన్’ నుంచి వచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడుతోంది. కరోనా తర్వాత స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.దీంతో తమ వద్ద ఉన్న డేటాపై భారత వైద్య పరిశోధన మండలి పరిశోధన ప్రారంభించింది’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు. మూడు, నాలుగు నెలల…

Read More

‘‘8 ఏళ్ల క్రితం నందినగర్ లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్ కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకయ్యే ఎన్నికల వేల కోట్ల నిధులిచ్చే స్థాయికి ఎట్లా చేరారు?” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుండి నిధులొస్తున్నాయా? దేశం విచ్ఛిన్నం చేసేందుకు టెర్రరిస్టు సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా? అని ప్రశ్నించారు. తక్షణమే సంబంధిత ఏజెన్సీ సంస్థలన్నీ సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీకి బూత్ స్వశక్తీరణ అభియాన్, ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి…

Read More

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్నకు వ్యతిరేకంగా ఎలాంటి ఖైదీ అప్పగింత (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ – పీటీ) వారెంట్లు జారీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. మల్లన్నపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదయిన కేసులను సవాల్ చేస్తూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న మీద 90 కేసులు నమోదు చేశారని ఆయన తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక్కో కేసులో పిటి వారెంట్ పేరుతో బయటకు రాకుండా మల్లన్నను వేధిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మలన్నపై ఎన్ని కేసులు బుక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు.. 90 కేసులు బుక్ చేయడం సరైంది కాదని సూచించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఒకే రకమైన ఫిర్యాదులపై అనేక కేసులను నమోదు చేయడం ఆ వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించడం అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. …

Read More

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ సంఖ్యలో రైల్వే ప్రాజెక్ట్ లను మంజూరు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిజెపి సభ్యుడు డా. కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కనీసం లేఖలకు జవాబులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రాజెక్ట్ లకు అవసరమైన భూసేకరణ వేగంగా జరగక పోవడం, తన వంతు ఇవ్వాల్సిన ఆర్ధిక వనరులను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చలేక పోవడం జరుగుతున్నదని ఆయన వివరించారు. అయితే  రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రైల్వే శాఖ మిగిలిన అన్ని శాఖలతో వేగవంతంగా సంప్రదింపులు జరుపుతోందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రాల నుంచి భూసేకరణ జరగాలని, అందుకు అటవీశాఖ నుంచి క్లియరెన్సులు రావడం, రాష్ట్రాల వాటాధనం వెంటనే జమ కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం,…

Read More

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వర్ధమాన కళాకారులు, ప్రదర్శకులకు తన ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పిస్తుందని తాను భావిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. తద్వారా ఎక్కువ మంది వ్యక్తులు కళను వృత్తిపరంగా తీసుకునేలా ప్రోత్సహిస్తుందని ఆయన ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీని అభినందించారు. ఈ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం ద్వారా భారతీయ కళలు మరియు సంస్కృతికి ప్రాచుర్యం కల్పించేందుకు అంబానీ కుటుంబం చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ముంబైలోని ఒక రకమైన సాంస్కృతిక సంస్థ అని ప్రధాని తెలిపారు. ఇది వర్ధమాన కళాకారులు మరియు ప్రదర్శనకారులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను అందించడం ద్వారా భారతీయ కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.…

Read More

ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛాత్రా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు మావోయిస్టులపై రూ.25 లక్షల చొప్పున రివార్డు ఉండగా, మిగతా ముగ్గురి తలపై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఝార్ఖండ్ పోలీసులు చెప్పారు. ఛత్రా- పాలము సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు విశ్వసనీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు పేర్కొన్నాయి. పలు దాడుల్లో నిందితుడిగా ఉన్న గౌతమ్ పాశ్వాన్ తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఛత్రా-పాలము సరిహద్దు ప్రాంతంలో మావో అగ్రనేతలు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు.. పోలీసులపైకి కాల్పులకు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల్లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం జరిపిన సమావేశంలో మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న కథనాలను సహితం కొట్టిపారేసారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. మంత్రివర్గ మార్పులపై పుకార్లు నమ్మొద్దని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారని చెబుతూ 60 మందికి టిక్కెట్లు ఇవ్వరని వారి లిస్టు కూడా తయారుచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారని సిఎం ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. మారీచులతో యుద్ధం చేస్తున్నామని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 20వ తేదీలోగా ప్రతి ఇంటికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రులు వివరించారు. పార్టీని బలోపేతం చేయడానికి…

Read More

నాని నటించిన దసరా చిత్రానికి అంగన్ వాడీ కార్యకర్తల సెగ తగిలింది. నాని నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తుంది. నాని – కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కింది. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి అంగన్ వాడీ కార్యకర్తల సెగ తగిలింది. ఈ సినిమాలో తమను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించడంతోపాటు దసరా చిత్ర బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మూవీ లో సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే అంగన్ వాడీ టీచర్ పాత్ర పోషించింది. ఇందులో ఒకానొక సమయంలో పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను వెన్నెల అనే పాత్ర అమ్ముకుంటుంది. అంతేకాకుండా, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ…

Read More