టీఎ్‌సపీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో నిఘా వైఫల్యం కారణంగానే ప్రశ్నల పత్రాల లీకేజి చోటుచేసుకున్నట్లు ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్న సిట్ నిర్ధారణకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సిన ఆ సెక్షన్‌లో నిఘా వైఫల్యం ఉన్నట్లు వెల్లడి కావడంతో సిట్ అధికారులు ప్రస్తుతం అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని 10 దఫాలుగా సుమారు 20 గంటలు విచారించారు. ప్రశ్నపత్రాల భద్రత, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నిందితుడు ప్రవీణ్ ఎలా తెలుసుకున్నాడు.. అనే విషయాలపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత టీఎ్‌సపీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రత, పర్యవేక్షణలో చైర్మన్, సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉన్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అదే అవకాశంగా భావించిన సెక్రటరీ పీఏ ప్రవీణ్, నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి…
Author: Editor's Desk, Tattva News
సంక్షోభ నివారణకు ఆగేయాసియా (ఏషిియాన్)దేశాలు ఈ ప్రాంతంలో స్థానిక కరెన్సీ వాడకం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. డాలర్ వంటి ప్రధాన అంతర్జాతీయ కరెన్సీలపై ఆధారపడడం వల్ల గ్లోబల్ సంక్షోభంలో తాము కూడా కూరుకుపోయే ప్రమాదముందని ఈ దేశాలు గ్రహించాయి. అందుకే డాలర్ల వాడకాన్ని వీలున్నంతమేరకు వాడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాయి. గత వారం బాలిలో జరిగిన ఏషియాన్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో ఈ మేరకు తీర్మానించుకున్నట్లు ఇండొనేషియా సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ఇండొనేషియా ఈసారి అధ్యక్షత వహించింది. డాలర్ నుండి లోకల్ కరెన్సీకి పరివర్తనా ప్రక్రియను రూపొందించేందుకు ఏషియాన్ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ పెర్రీ వార్జియో తెలిపారు. ఈ ప్రాంత దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలన్నీ స్థానిక కరెన్సీలోనే జరపాలని, ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని కో-ఆపరేషన్ ఫ్రేమ్‌వర్కు పరిధిలో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.…
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీహార్‌లో బిజెపిదే విజయం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న మహాఘట్ బంధన్‌ను ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం బ్యాడ్ ప్రభుత్వం అంటే భ్రష్టాచార్ (అవినీతి) అరాజకత (ఆరాచకం) దమన్ (అణచివేత)లకు ప్రతీకగా మారిందని ధ్వజమెత్తారు. నవాడా జిల్లాలోని హిసూవాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఏడాది తిరిగి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి గెలవడం, ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయం అని, ఆ తరువాత బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్ని జరిగితీరుతాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. అప్పుడు ఈ ఘర్షణకారులందరిని తలకిందులుగా వేలాడదీయడం జరుగుతుందని అమిత్ షా హెచ్చరించారు. రాష్ట్రంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం మతపరమైన ఉద్రిక్తతకు బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు.…
సొంతంగా పాదయాత్ర చేసినా తెలంగాణాలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేక పోతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉమ్మడి పోరాటాల పేరుతో ప్రతిపక్షాలతో చేతులు కలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోనులు చేసి పేపర్ లీకేజి వ్యవహారంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని, ప్రగత్ భవన్ కు మార్చ్ నిర్వహిద్దామని ప్రతిపాదించారు. అయితే జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధ్లులుగా ఉంటున్న ఈ రెండు పార్టీల నేతలు తెలంగాణాలో చేతులు కలపడం `ఆత్మహత్య సదృశ్యం’ అని గ్రహించినట్లున్నారు. ఆమె ఫోనులకు సానుకూలంగా స్పందించలేదు. అయినా ఆమె తన ప్రయత్నాలను విరమించుకోకుండా ఇప్పుడు అన్ని ప్రతిపక్షాలకు లేఖలు వ్రాసారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జన సమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మాఆర్ పీఎస్ లతో పాటు ప్రజా…
మధ్యప్రదేశ్‌లోని మరో పట్టణం పేరు మారుస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదివారంనాడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీహోరె జిల్లాలోని నజ్రుల్లాగంజ్ పేరును భైరుండగా మార్చినట్టు తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి 2022 అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2022న డిసెంబర్ 7న ప్రత్యుత్తరమిచ్చిందని, అందుకు అనుగుణంగా నజ్రూల్లాగంజ్ పేరును భైరుండగా మార్చడం జరిగిందని, ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చిందని ఆ నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. శివరాజ్ సింగ్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో భోపాల్‌లోని ఇస్లాం నగర్ గ్రామం పేరును జగ్దీష్‌పూర్‌గా మార్చింది. ఈ పేరు మార్పునకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. భోపాల్‌కు 12 కిలోమీటర్ల దూరంలో జగ్దీష్‌పూర్‌లో ప్రసిద్ధి చెందిన కోటలు ఉన్నాయి. 308 ఏళ్ల క్రితం ఇస్లాం నగర్ పేరు జగ్దీష్‌పూర్‌గా ఉండేదని బీజేపీ చెబుతోంది.…
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడపాలని భావిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి రోజున ప్రధాని మోదీ సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ ను వర్చ్చువల్ గా ప్రారంభించారు. అదే రోజున కేంద్ర రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందేభారత్ రైళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. అందులో ఇప్పుడు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నారాయణాద్రి రూటులో గుంటూరు మీదుగా ఈ రైలును నడపాలని నిర్ణయించారు. రైల్వే బోర్డు నుంచి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్…
ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడంతో అధికార, ప్రతిపక్షాల శ్రేణులు తరచూ ఘర్షణలకు దిగడం రివాజుగా మారుతున్నది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముగిసిన ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత ఎవ్వరికీ వారుగా ఆధిపత్యం కోసం వీధులలో బలప్రదర్శనకు దిగడం ప్రారంభమైంది. ఇరు పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సవాళ్లు విసిరుకున్నారు. శనివారం సత్తెమ్మ టెంపుల్ వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు పిలుపునిచ్చారు. దీంతో ఇరు పార్టీల కేడర్ గా భారీగా ఆలయం వద్దకు చేరే పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నేతలు రాకుండా అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే శ్రీధర్…
తెలుగు సినీ పరిశ్రమలో విషాదల పరంపర కొనసాగుతూనే ఉంది. సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నై తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. విజయనగరం జిల్లా, లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ మాదాసు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా స్థిరపడిపోయారు. సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ నిర్మాతగా, నటుడిగా మారిన ఆయన ఎన్నో గుర్తిండిపోయే పాత్రలలో నటించారు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారత్ బంద్ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు.…
కేంద్ర ప్రభుత్వం 2023 – 24 బడ్జెట్ లో ప్రకటించిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పతాకంకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను మార్చి 31 న కేంద్రం జారీ చేయడం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరో ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించింది. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పేరుతో ఈ సేవింగ్స్ పథకాన్ని ప్రారంభించింది. మహిళలు కానీ, వారు గార్డియన్ గా బాలికలు కానీ ఈ చిన్న మొత్తాల పొదుపు పథకం కింద సేవింగ్స్ ఖాతాను ప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ ల్లో, లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ శాఖల్లో ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఒక మహిళ తను స్వయంగా కానీ, 18 ఏళ్లు నిండని బాలికల తరఫున గార్డియన్ గా కానీ ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం రెండేళ్ల కాల పరిమితితో ఉంటుంది. ఇందులో 7.5% ఫిక్సడ్ వడ్డీ…
మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. మార్చిలో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు అంతకు ముందు సంవత్సరం కన్నా 13% పెరిగి రూ. 1,60,122 కోట్లకు చేరుకుంది. జూలై 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధిక వసూళ్లు నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.5 లక్షల కోట్లను దాటడం ఇది నాలుగోసారి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.29,546 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.37,314 కోట్లు అని వివరించింది. ఐజీఎస్టీ కింద రూ.82,907 కోట్లు వసూలైంది. ఐజీఎస్టీ వసూళ్ల పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఐజీఎస్టీ వసూలు కాలేదు. ఇక, మార్చి నెలలో సెస్ ల రూపంలో రూ.10,355 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలలోనే అత్యధికంగా ఐజీఎస్టీ…