బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కవితలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కవిత తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలను వినిపించారు. నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసేులను పరిశీలించాలని కోరారు. మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారంటూ కపిల్ సిబాల్ వాదించారు. అయితే పీఎంఎల్‌ఏ యాక్ట్ కింద ఎవరినైనా కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలవచ్చని ఈడీ తరుపున న్యాయవాది స్పష్టం చేశారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అజయ్ రసోగి, జస్టిస్ ద్వివేదిలతో కూడిన ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ…
Author: Editor's Desk, Tattva News
ఏపీ శాసనసభ స్పీకర్ లా అడ్మిషన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్ తమ్మినేనికి ఉస్మానియా యూనివర్శిటీలో లా అడ్మిషన్ ఎలా వచ్చిందని టీడీపీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండో ఏడాదితో కోర్సు ఆపేసినట్లు పేర్కొన్న తమ్మినేని డిగ్రీ ఎప్పుడు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డిగ్రీ పాస్ కాకుండా లా కోర్సులో ఎలా చేరారని, డిగ్రీ పూర్తి చేయకుండానే సర్టిఫికెట్ ఫోర్జరీ చేసి ఉంటారని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్‌లకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. డిగ్రీ విద్యను మధ్యలో ఆపేసిన ఏపీఅసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారని టీడీపీ ప్రశ్నిస్తోంది. డిగ్రీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసిన తమ్మినేని సీతారాం, ఏ విద్యార్హతతో లా కోర్సులో ప్రవేశం…
మైనారిటీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదని తెలిపారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా బస్వకళ్యాణ్ తాలూకా గోరట గ్రామంలో `గోరోటా షహద్ స్మారక్’ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా 103 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ,.కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిందని విమర్శించారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్‌లకు ఇచ్చిందని చెబుతూ ఈ విషయమై కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ ఎన్నడూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే కార్యక్రమాలను నిర్వహించలేదని అమిత్ షా ధ్వజమెత్తారు. అదే విధంగా హైదరాబాద్ విముక్తి దినోత్సవాలను…
పరారీలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృతపాల్ ను సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్ హెచ్చరించింది. పోలీసుల ఎదుట లొంగిపోయి, విచారణకు సహకరించాలని అమృత్‌పాల్‌ను హెచ్చరించింది. ఈ మేరకు అకాల్ తఖ్త్ జత్యేదార్ జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే ఆయన పోలీసుల సామర్థ్యంపై కూడా ప్రశ్నలు కురిపించారు. అంతపెద్ద దళం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమృత్‌పాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అమృత్‌పాల్ బయటపడితే పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడినని హర్‌ప్రీత్ తెలిపారు. పంజాబ్‌లో అంతమంది పోలీసులున్నా అమృత్‌పాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని ప్రపంచ వ్యాప్తంగా సిక్కుల మదిలో ఓ ప్రశ్న మెదులుతోందని ఆయన చెప్పారు. ఈ ఘటన పోలీసుల పనితీరుపై కూడా సందేహాలను రేకెత్తిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు హర్‌ప్రీత్ తెలిపారు. ఒక వేళ అతనిని ఇప్పటికే అరెస్టు…
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ రెండవ టైటిల్‌ను గెలుచుకుంది. 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ తై టామ్ పై 5-0తేడాతో గెలిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 50 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0తో విజయం సాధించి వరుసగా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గత ఏడాది కూడా గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్.. వరుసగా రెండో సారి భారత్‌కి పసిడి అందించింది. ‘ అలానే ఈ టోర్నీలో ఒకటి కంటే ఎక్కువ సార్లు మెడల్ సాధించి, మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రపంచ టైటిళ్లను సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. వాస్తవానికి గత ఏడాది 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పోటీపడింది. కానీ.. ఈ ఏడాది 50…
డబ్ల్యూపిల్ తొలి సీజన్ టైటిల్‌ను ముంబయి ఇండియన్స్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై విజయంలో బ్రంట్ 55బంతుల్లో 7ఫోర్లుతో 60పరుగులు చేసి కీలకపాత్ర పోషించగా కెప్టెన్ కౌర్ 37పరుగులు చేసి తనవంతు సహకారాన్ని అందించింది. కాగా, టాస్ గెలిచి ప్రారంభించిన ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీవర్మ వెనుదిరిగి నిరాశపరిచింది. వాంగ్ బౌలింగ్‌లో రెండో ఓవర్ మూడో బంతికి అమీలా కెర్‌కు క్యాచ్ ఇచ్చి అనంతరం క్యాప్సీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకుంది. ఈక్రమంలో కెప్టెన్ మెగ్‌లానింగ్ ఇన్నింగ్స్‌ను రోడ్రిగ్స్‌తో కలిసి గాడిలో పెట్టేందుకు యత్నించింది. అయితే రోడ్రిగ్స్ 9పరుగులు చేసి వాంగ్ బౌలింగ్‌లో అమన్‌జ్యోత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చింది. ఈక్రమంలో 73పరుగుల స్కోరువద్ద అమీలా కెర్ బౌలింగ్‌లో భాటియాకు క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. తర్వాతి ఓవర్లో యస్తికా భాటియా రనౌట్ అయింది. తనియా, అరుంధతి…
విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ టీమ్‌ని ఓడించి తెలుగు వారియర్స్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. తెలుగు వారియర్స్ కు ఇది నాలుగో టైటిల్ . ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన భోజ్‌పురి దబాంగ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 చేసింది. తర్వాత అఖిల్ 32 బంతుల్లో 67 పరుగులు చేయడంతో తెలుగు వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భోజ్‌పురి దబాంగ్స్ 6 వికెట్లు నష్టానికి 89 పరుగులే చేయగలిగింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు 58 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ లక్ష్యాన్ని కేవలం వికెట్ నష్టపోయి తెలుగు వారియర్స్ చేధించింది. ఈ టైటిల్‌ని గెలవడం తెలుగు వారియర్స్‌కి ఇది నాలుగో సారి కావడం విశేషం. ఎక్కువ టైటిల్స్…
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. వన్‌వెబ్‌కు చెందిన 5.8 టన్నులున్న 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. 20 నిమిషాలు ప్రయాణించిన అనంతరం 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిర్ధేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్ స్టేషన్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న కౌంట్ డౌన్ పూర్తయిన వెంటనే నిప్పులు చిమ్ముకుంటూ పైకి ఎగిసింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగానికి బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెండో దశలో 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 ద్వారా పంపారు. ఒక్కొక్క ఉపగ్రహం బరువు 150 కిలోలు. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ కి అప్‌గ్రేడెడ్ వెర్షన్…
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్ జారీ చేసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీచేశాయి. ఈ అడ్వైజరీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ సంతకాలతో వెలువడింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని అడ్వైజరీలో పేర్కొన్నారు. కరోనాపై అప్రమత్తమైన కేంద్రం సోమవారం రాష్ట్రాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది దేశంలో పెరుగుతున్న కరోనా, సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించడానికి ప్రభుత్వం ఏప్రిల్ 10, 11 తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను ప్లాన్ చేస్తోందని అడ్వైజరీలో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలలో మందులు, ఆసుపత్రి పడకలు, వైద్య పరికరాలు, వైద్య ఆక్సిజన్ లభ్యతను అంచనా వేసే లక్ష్యంతో ఈ…
సికింద్రాబాద్ టు -తిరుపతి వందేభారత్ రైలును వచ్చేనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి చేతుల మీదుగా ప్రారంభంకానున్నట్టుగా దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కేంద్రం నుంచి సమాచారం అందిందని దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం నాలుగు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రస్తుతం నారాయణాద్రి రైలు మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. నారాయణాద్రి రైలు సికింద్రాబాద్-, బీబీనగర్-, నల్గొండ,- మిర్యాలగూడ-, నడికుడి-, పిడుగురాళ్ల-, సత్తెనపల్లి-, గుంటూరు,- తెనాలి,- బాపట్ల-, చీరాల- ఒంగోలు,- సింగరాయకొండ-, కావలి-, నెల్లూరు,- గూడూరు,- వెంకటగిరి,- శ్రీకాళహస్తి-, రేణిగుంట,- తిరుపతి వరకు వెళ్తుంది. అయితే ఇదే రూట్‌లో వందేభారత్ రైలును నడుపనున్నట్టుగా తెలిసింది. శావల్యపురం-ఒంగోలు రూట్ పూర్తయ్యాక ఈ మార్గం నుంచి…