ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి భద్రతను పునరుద్దరించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఏకపక్షంగా ప్రభుత్వం తన భద్రతను కుదించినట్లు తెలిపారు. తనకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీసు శాఖ వెల్లడించింది. అయితే, సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, నివాసం చుట్టూ 30అడుగుల ఎత్తున ఇనుప గోడకంచె, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు.. మూడు షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది.. ఇదంతా ఉత్తర…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీలోని అమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నైపుణ్య పరిజ్ఞానం కలిగిన వ్యక్తులను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి)కి నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నరుకు ఉన్నదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందుకు మంత్రిమండలి సాయం కానీ, సలహా కానీ అవసరం లేదని తేల్చిచెప్పింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన బెంచ్ సోమవారం తీర్పు వెలువరించింది. 1957వ సంవత్సరపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 1993లో తొలిసారి చేసిన సవరణ ద్వారా ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులను నామినేట్ చేసే చట్టబద్ధమైన అధికారం లెఫ్టినెంట్ గవర్నరుకు సంక్రమించిందని న్యాయస్థానం తెలిపింది. మంత్రిమండలిని సంప్రదించకుండా పది మందిని ఎంసిడికి నామినేట్ చేస్తూ గత ఏడాది జనవరి 1, 4 తేదీల్లో లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా జారీ చేసిన ఆదేశాలు, నోటిఫికేషన్లను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును…
దేశవ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై పూర్తి క్లారిటీలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా.. ఇండియాకు పయనమైనట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. . బంగభబన్ నుంచి ఆమె మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బయలుదేరి వెళ్లారు. షేక్ హసీనా, షేక్ రెహానా.. చాలా సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అధ్యక్ష భవనం విడిచి వెళ్లడానికి ముందు.. షేక్ హసీనా స్పీచ్‌ను రికార్డు చేయాలనుకున్నారు. కానీ సమయం లేకపోవడంతో ఆమె తొందరగా అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 1971 యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన…
ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెద్దఎత్తున వచ్చిచేరుతున్నది. క్రమంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు.. సాగర్ గేట్లు తెరిచారు. ఒక్కొక్కటిగా మొత్తం ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగు ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా 8 గేట్లు ఎత్తారు. ప్రస్తుత సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం రెండు పంటలకు ఇకా…
ఏపీబ్రాండ్‌ని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని, వైఎస్సార్సీపీ విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించారు. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని స్పష్టం చేసిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆకస్మిక తనిఖీలకు వస్తానని, అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. 1995లో ఐఏఎస్‌లను డ్రైన్లలోకి దింపానన్న ఆయన నాటి విషయాలను సీఎం గుర్తు చేశారు. నిబంధనలతోపాటు మానవత్వ కోణంలో పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. దీంతోపాటు ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లు, అధికారులకు సూచించిన ఆయన రాష్ట్ర…
కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్రసీమ సైతం మేం ఉన్నామంటూ అండగా నిలబడుతోంది. ఇందులో భాగంగా చిరంజీవి మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు కేరళలోనివయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ కూడా నేను సైతం.. అంటూ తన మంచి మనసుని మరోసారి చాటుకున్నారు. వయనాడ్ బాధితులకు తన వంతుగా రూ.25 లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయ…
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్‍లో గ్రేట్ బ్రిటన్‍ను చిత్తుచేసింది టీమిండియా. షూటౌట్‍లో దుమ్మురేపింది. పారిస్ వేదికగా నేడు (ఆగస్టు 4) జరిగిన ఒలింపిక్స్ పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్‍లో గ్రేట్ బ్రిటన్‍పై భారత్ అద్భుత విజయం సాధించింది. ముందుగా మ్యాచ్ 1-1తో సమం అయింది. దీంతో షూటౌట్ జరిగింది. షూటౌట్‍లో భారత్ 4-2తో గ్రేట్ బ్రిటన్‍పై గెలిచింది. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అద్భుతంగా బంతులను అడ్డుకొని టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 17వ నిమిషం నుంచి 10 మందితోనే ఆడిన టీమిండియా.. వీరోచితంగా పోరాడి అద్భుత విజయం సాధించింది. 22వ నిమిషంలో భారత ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ కొట్టాడు. దీంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ లీ మోర్టోన్ (27వ నిమిషం) గోల్ బాదాడు. రెండో అర్ధభాగంలో ఏ…
త్వరలో వక్ఫ్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోర్డు అధికారాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ బిల్లు ప్రకారం ఏదైనా ఆస్తిని వక్ఫ్ బోర్డు స్వంత ఆస్తిగా పిలవడానికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వక్ఫ్ చట్టానికి దాదాపు 40 సవరణలు బిల్లులో ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో వక్ఫ్ చట్టంలో అనేక భారీ మార్పులు చేయనుంది. ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంటులో దీని కోసం బిల్లును తీసుకురావచ్చు. అందులో అనేక సవరణలు చేయవచ్చు అని జాతీయ మీడియా కథనలు ప్రచురించాయి. దీని ప్రకారం వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించవచ్చు. ఈ బిల్లు ప్రకారం ఏదైనా ఆస్తిని స్వంత ఆస్తిగా పిలవడానికి దాని ‘నియంత్రిత’ అధికారాలను తగ్గించవచ్చు, మహిళల ప్రాతినిధ్యాన్ని కూడా నిర్ధారించవచ్చు. ఈ బిల్లులో వక్ఫ్ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.…
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. వారిని విధుల నుంచి తొలగించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సీ)ని ప్రయోగించారని చెప్పారు. ఎవరైనా ఉద్యోగులు ప్రభుత్వ విధుల్లో కొనసాగడం వల్ల రాష్ట్ర భద్రతకు ముప్పు అని రాష్ట్రపతి లేదా గవర్నర్ భావించినట్లైతే సాధారణ ప్రక్రియను అనుసరించకుండానే వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అధికారాన్ని ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ ఫరూక్ అహ్మద్ షేక్, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుళ్లు ఆసిఫ్ దీన్, ఖాలిద్ హుస్సేన్ షా, ఇర్షాద్ అహ్మద్ చాకూ, కానిస్టేబుల్ రెహ్మత్ షా, ఉపాధ్యాయుడు నజం దీన్ ఉగ్రవాద సంబంధిత, తీవ్రమైన దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు గుర్తించాయని అధికారులు తెలిపారు. వీరంతా మాదక ద్రవ్యాల విక్రయంతోపాటు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా ఉగ్రవాద…
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్డీయే కూటమి పక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రాంవిలాస్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ-అథవాలే) తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని లోక్ జనశక్తి పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్‌దాస్ అథవాలే కూడా తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీలేయర్ క్రిటేరియాపై అప్పీలు చేస్తామని స్పష్టం చేశారు. ‘‘15ు ఎస్సీ కోటాలో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షించాలని కోరుతున్నాం. దీనిపై అప్పీల్‌కు వెళ్తాం’’ అని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. అస్పృశ్యత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విఫలమైందని వ్యాఖ్యానించారు. ‘‘ఎస్సీ కోటాలో క్రీమీలేయర్‌ను ఎట్టిపరిస్థితిలోనూ అనుమతించలేం. వర్గీకరణ ద్వారా ఎస్సీలు అనుభవిస్తున్న అస్పృశ్యత పరిష్కారం కాదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, ఎస్సీల్లోని ఉన్నత విద్యావంతులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు…