అమెరికా వైమానిక దళం భద్రతా వ్యవహారాల విభాగంలో భారతీయ సంతతి వ్యక్తికి అత్యున్నత స్థానం దక్కింది. ఇప్పటివరకూ ఫ్లెయిట్ టెస్ట్ ఇంజనీరుగా ఉన్న రవిచౌదరిని ఎయిర్‌ఫోర్స్‌లో డిఫెన్స్ అసిస్టెంట్ సెక్రెటరీగా ఎంపికచేస్తూ బైడెన్ అధికార యంత్రాంగం చేసిన ప్రతిపాదనకు అమెరికా సెనెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. సెనెట్‌లో రవిచౌదరికి అనుకూలంగా 65 ఓట్లు, వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. అమెరికాలో అత్యంత కీలకమైన భద్రతా వ్యవహారాల సంస్థ పెంటగాన్ పరిధిలోకి వచ్చే ఎయిర్‌ఫోర్స్‌లో అసిస్టెంట్ సెక్రెటరీ స్థానం అత్యున్నత స్థాయిలో నిలిచే పౌరహోదాగా నిలుస్తుంది. ఇప్పుడు అమెరికా పెద్దల సభలో జరిగిన ఓటింగ్‌లో డజన్ మందికి పైగా ప్రతిపక్షరిపబ్లికన్లే ఆయనకు అనుకూల ఓటేశారు. 1993 నుంచి 2015 వరకూ రవిచౌదరి వివిధరకాల స్థాయిలలో వ్యవహరించారు. తొలిదశలో సి 17 పైలెట్ బాధ్యతల్లో ఉన్నప్పుడు రవిచౌదరి అమెరికా తరఫున పలు ప్రపంచ స్థాయి వైమానిక మిషన్లల్లో పాల్గొన్నారు. అఫ్ఘనిస్థాన్, ఇరాక్‌లలో పలు సార్లు…
Author: Editor's Desk, Tattva News
బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈనెల 25న సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది. అయితే సిబిఐ ఆయనను అరెస్టు చేయబోదని భరోసా ఇచ్చింది. లాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ కోసం ఢిల్లీ లోని సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలని సిబిఐ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28తో పాటు మార్చి 4.11న సమన్లు జారీ చేసినప్పటికీ, తేజస్వి యాదవ్ సిబిఐ ఎదుట హాజరు కాలేదు. దీంతో మంగళవారం మూడోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర అధికారులపై ఆరోపణలు ఉన్న లాండ్ ఫర్ జాబ్ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై కోర్టులో సవాల్ చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తాను మైనర్ నని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని…
ఒక క్రిమినల్ కేసులో తన జోక్యాన్ని కోరుతూ కొటి రూపాయల లంచం ఇవ్వచూపడమేగాక తనను బెదిరించారని ఆరోపిస్తూ ఒక మహిళా డిజైనర్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమృత ఫడ్నవీస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనీక్ష అనే డిజైనర్‌తోపాటు ఆమె తండ్రిపై ఫిబ్రవరి 20న మలబార్ హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం అనీక్ష అనే డిజైనర్ గత 10 నెలలుగా అమృతను కలుస్తోంది. అమృతను ఆమె నివాసంలో కూడా ఆమె కలిసింది. వస్తువులు, జువెలరీ, ఫుటవేర్‌కు సంబంధించి తాను డిజైనర్‌నని, పబ్లిక్ ఈవెంట్స్‌లో వాటిని ధరించి తన వస్తువుల ప్రమోషన్‌కు తోడ్పడాలని అనీక్ష ఉప ముఖ్యమంత్రి భార్యను కోరినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తన తల్లి మరణించడంతో తన కుటుంబాన్ని తానే పోషిస్తున్నానని కూడా అనీక్ష…
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఒక వంక దూకుడుగా వెడుతున్న ఈడీ, మరోవంక అరెస్ట్ తప్పదని గ్రహించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితలకు సంబంధించి గురువారం నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా గురువారం విచారణకు హాజరుకావాల్సిన కవితను అరెస్ట్ చేయబోతున్నట్లు కధనాలు వెలువడ్డాయి. గత శనివారం విచారణకు హాజరైన ఆమెను దాదాపు పది గంటలసేపు ప్రశ్నించి, తిరిగి మరోసారి మార్చి 16వ తేదీన కూడా హాజరుకావాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం విచారణకు కవిత దూరంగా ఉన్నారు. పలు కారణాల రీత్యా రాలేనంటూ ఈడీకి తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు. విచారణకు ఆమె హాజరుకాకపోవటంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 20వ తేదీన విచారణకు హాజరు…
బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కేసులో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్న కేటీఆర్, మరి తన చెల్లెలు కవితను సుప్రీంకోర్టుకు ఎందుకు పంపారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. మీకో రూల్, మందికో రూలా అంటూ నిలదీశారు. కోర్టుకు వెళ్ళడం ప్రజల హక్కు అన్న ఆయన, దాన్ని ప్రశ్నిస్తే మీరే తప్పులో పడతారంటూ హితవు పలికారు. కవిత వెంట ఢిల్లీ వచ్చే నేతలు తాము కెమెరాలతో రికార్డ్ అవుతామన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హయత్ హోటల్‌కి వెళ్లినట్టు, దుబాయ్‌లో తిరిగినట్టు బయటపడ్డట్టు మీ కదలికలపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల రికార్డింగ్ మొదలవుతుందని అరవింద్ హెచ్చరించారు. మీ జాతకాలు, చిట్టా అంతా దర్యాప్తు సంస్థలు లాగుతాయని ఆయన బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోండి కాదు, కూడదంటే మంత్రుల చిట్టా మొత్తం బయటకు…
వివాహిత మహిళలే కాదు పురుషులు కూడా గృహ హింసకు గురవుతున్నారని, అటువంటి వారికి రక్షణగా ఓ జాతీయ కమిషన్ ఏర్పాటుచేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. భార్యల చిత్రహింసల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి రక్షణగా మహిళా కమిషన్ మాదిరిగా జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం.. దేశంలో 1,64,033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందులో 81,063 మంది వివాహిత పురుషులు, 28,680 మంది మహిళలు ఉన్నారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా 33.2 శాతం మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 4.8 శాతం మంది వివాహ సంబంధ కారణాలతో చనిపోతున్నారని వివరించారు. 2021లో నమోదయిన ఆత్మహత్యల్లో 1,18,979 (72శాతం) మంది పురుషులని, 45,026 మంది (27శాతం) మహిళలని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి…
గవర్నరుపై అసత్య ప్రచారం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ విషయంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ అంశాన్ని ప్రివిలైజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్పీకరు వెల్లడించారు. తానేమి తప్పు చేయకపోయినా, ఏమీ మాట్లాడలేదని, మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదని, తనను ఎలా సస్పెండ్ చేస్తారని స్పీకరును నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో వివరణ ఇవ్వాలంటూ నిమ్మలకు మద్దతుగా 12 మంది టిడిపి సభ్యులు స్పీకరు పోడియాన్ని ముట్టడించారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్పీకరు పోడియం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా మిగిలిన టిడిపి సభ్యులనూ ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకరు ప్రకటించారు. ఇదే అంశంపై సభలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అంబటి రాంబాబు, పయ్యావుల కేశవ్ మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం సాగింది. స్పీకర్…
అసోంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ తొలి కేసు బుధవారం నమోదైంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ దీన్ని ధ్రువీకరించింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్పి) నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఐసీఎంఆర్ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అసోంలో సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో ఇప్పటి వరకు 452 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కర్ణాటకలో ఒకరు, హర్యానాలో ఒకరు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సైతం వైరస్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తున్నది. అలాగే గుజరాత్‌కు చెందిన ఓ మహిళ సైతం మంగళవారం ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు భారీగా పెరుగుతుండడంతో…
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి తాత్కాలిక ఊరట లభించింది. ఆయన నివాసం ఎదుట గురువారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు చేపడుతున్న చర్యలను నిలిపివేయాలని లాహోర్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మేరకు లాహోర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తారిఖ్ సలీమ్ షేక్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్యలను సవాలు చేస్తూ పిటిఐ పార్టీ నేత ఫవాద్ చౌదరి లాహోర్ కోర్టును ఆశ్రయించారు. బహుమతులను అమ్ముకున్న కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద ఉన్న ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే పిటిఐ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అరెస్ట్ చేయకుండా పోలీసులకు అడ్డుగా నిలుస్తున్నారు. తాజాగా బుధవారం ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. మంగళవారం నుంచి 24 గంటలుగా ఇమ్రాన్ ఖాన్…
అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంఫై మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నసమయంలో రెండో రోజు బుధవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. శ్రీధర్ రెడ్డి నిరసనను, ప్రభుత్వం, తాను కూడా గుర్తించామని స్పీకర్ తెలిపారు. కానీ, ఇలా చేయడం తగదు, కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుందని స్పీకర్ తమ్మినేని చెప్పినా కోటంరెడ్డి అలానే నిల్చుండి పోయారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి స్పందిస్తూ సమస్యలు లేని సోసైటీ ఉండదని.. సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలని కోరారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని తెలిపారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ…