జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను రూపొందిస్తున్నది. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడలించింది. అలాగే పలు పన్ను రాయితీలు ప్రకటించింది. అయినా జనాభా పెరుగకపోవడంతో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. ‘బ్రైడ్ ప్రైస్’ను రద్దు చేసింది. త్వరగా వివాహాలు చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది పిల్లలనుకనే అవకాశం ఉందని భావిస్తున్నది. అయితే, పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. వివాహ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతాయి. అంతే కాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది. దాంతో చాలా మందికి పెళ్లిళ్లు జరుగడం లేదు. ఈ క్రమంలో ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు చైనా ప్రభుత్వం వివాహం చేసుకోకుండానే పిల్లలను కనేందుకు ఆమోదం తెలిపింది. జనాభా పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనాలో జననాల రేటు భారీగా తగ్గుతుంది.…
Author: Editor's Desk, Tattva News
తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఇటీవల సినీ నటి, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్బూ ఇటీవల చేసిన వాఖ్యలు సంచలనం కలిగించాయి. అయితే, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పినందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదని ఆమె స్పష్టం చేశారు. ”నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి నిజాయతీగా అందరికీ తెలిసేలా చేశాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అలాగే ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. నాపై ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలి.” అని ఆమె తెలిపారు. “అలాగే మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకూడదు. నాకు జరిగిన దారుణాన్ని అందరితో చెప్పడానికి సమయం తీసుకొని ఉండొచ్చు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపులను వెల్లడించి.. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా” అని ఆమె వివరించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఝార్ఖండ్‌లో జరిగిన ఓ…
మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్శ క్తి స్వరూపిణి స్, బహుకృత రూపిణి స్, బహుముఖ ప్రజ్ఞాశాలి స్, మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుందని ప్రశ్నించారు. తల్లిగా.. తోబుట్టువుగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివని, మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని తెలిపారు. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని అంటూ అదే సత్యమని పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్లతాయని ధృడంగా విశ్వసిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం,…
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం కవిత రేపు ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత బినామీ వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లైని నిన్న ఈడీ అరెస్టు చేసింది. ఈడీ విచారణలో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనని ఒప్పుకున్నాడు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆమె పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. రామచంద్ర పిళ్లైను 5 రోజుల కస్టడీ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. జారీ చేసిన బర్త్ , డెత్ సర్టిఫికెట్లలో ఎక్కువగా పాతబస్తీలోనే బయటపడటం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనం అని విమర్శించారు. దీనికంతటికి మొదటి ముద్దాయిగా నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్ పోర్టులు పొంది, హైదరాబాద్ లో అడుగుపెట్టి పాతబస్తీని అడ్డగా మార్చి దేశంలో అల్లర్లు స్రుష్టించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పాతబస్తీ ఐఎస్ఐ కేంద్రంగా మారిందని, స్లీపర్ సెల్స్ ను పెంచి పోషిస్తున్నారని పేర్కొంటూ దేశంలో ఎక్కడ బాంబు…
ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంథి పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కెస్తున్నారని, మైకులు ఆఫ్ చేస్తున్నారని అంటూ బిజెపి లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ మండిపడుతున్నది. ఇతర దేశాల్లో రాహుల్ ఈ విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. రాహుల్ వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించడమేనంటూ బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో అసలు పార్లమెంట్ సమావేశాలకు క్రమంగా హాజరుకాని రాహుల్ గాంధీ పార్లమెంట్ చర్చలపై మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్‌లో రాహుల్ హాజరును పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. భారత్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా కంచన్ గుప్తా కొట్టిపారేశారు. పార్లమెంట్‌లో తమ మైక్‌లు పని చేస్తాయి.. కానీ వాటిని…
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక చైనా సహాయంతో మరోసారి ఐఎంఎఫ్ నుండి రుణం తీసుకోనుంది. మార్చి మూడో వారం లేదా నాలుగోవారంలో ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల రుణం అందనుందని శ్రీలంక ప్రధాని విక్రమ్‌సింఘే మంగళవారం వెల్లడించారు. పార్లమెంటులో అధ్యక్షుడు విక్రమ్‌సింఘే మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి మాకు చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను చూసి దానిపై సంతకం చేసి ఐఎంఎఫ్‌కి పంపాము. భారత్, పారిస్‌క్లబ్ నుండి ఫైనాన్సింగ్ హామీల ఫలితంగా ఈ దశ రుణం ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాము. బహుశా ఈ నెల మూడవ వారం లేదా నాల్గొవ వారంలో రుణం ఆమోదం అవుతుందని ఆశిస్తున్నాము.’ అని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా రుణ సహాయానికి ఎలాంటి మద్దతునిచ్చిందనేదానిది స్పష్టమైన సమాచారం లేదు. కాగా, ఒకవైపు విక్రమ్‌సింఘే ప్రభుత్వం ఐఎంఎఫ్ నుండి రుణాలు తీసుకుంటున్నా.. దేశంలో ఆర్థిక వృద్ధి రేటు అనుకున్నస్థాయిలో జరగడం…
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మంగళవారం నాడు అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణంలో కవిత ప్రతినిధిగా పేర్కొంటున్న పిళ్ళై అరెస్ట్ తో తర్వాత కవిత వంతనే ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్‌లో అవకతవకలపై అరుణ్ రామచంద్ర పిళ్లైను ఇటీవల రెండు రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర పిళ్లై అరెస్ట్‌తో లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొదటి నుంచి ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు తరచుగా వినిపిస్తూనే ఉంది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్…
కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ కొత్త ఫ్లూ దేశ ప్రజలను వణికిస్తున్నది. ఇన్‌ఫ్లుయెంజా ఎహెచ్3ఎన్2 కొత్త ఫ్లూ ప్రభావంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పల్లెలు మొదలు పట్టణాల వరకు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే వైరస్ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా అని ఈ వైరస్ సాధారణంగా ఏటా ఈ సమయంలో మార్పులకు లోనవుతుందని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా చెప్పారు. అయితే..పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ కరోనా లాగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని హెచ్చరించారు. కాబట్టి..…
కెఎంసి పిజి మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న రోజునే మరణించిందని, అయితే ప్రభుత్వం చికిత్స పేరుతో డ్రామాలాడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఆయన సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరశన దీక్ష చేశారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, డా. కె లక్ష్మణ్, బిజెపి నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ, పోలీసులు ముందే స్పందించి ఉంటే వైద్య విద్యార్థిని ప్రీతి చనిపోయి ఉండేది కాదని చెప్పారు. వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి ఇప్పటికీ కారణాలు తెలియటం లేదన్న బండి పీజీ మెడికో ఆత్మహత్య చేసుకునేంత పిరికి విద్యార్థిని కాదని స్పష్టం చేశారు. చనిపోయిన ప్రీతికి నాలుగు రోజుల పాటు చికిత్స చేసి నాటకం ఆడారని ఆరోపణలు చేశారు. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.…