Author: Editor's Desk, Tattva News

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఎస్‌బీఐ ఖాతా రివార్డ్‌ పాయింట్స్‌ ఉన్నాయని.. వాటిని క్లైమ్‌ చేసుకునేందుకు ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ ఓ ఫేక్‌ మెస్సేజ్‌ వాట్సాప్‌లతో పాటు మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రివార్డ్‌ పాయింట్ల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది.  నకిలీ సందేశాలను చూసి స్పందించొద్దని సూచించింది. వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలను సైతం ఎవరితో వెల్లడించొద్దని చెప్పింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్‌ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్‌ పాయింట్ల రిడీమ్‌ చేసుకునేందుకు లింక్‌ని ఓపెన్‌ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌ను ఓపెన్‌ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్‌ చేయొద్దని సూచించింది. అలా చేస్తే మోసగాళ్ల బారినపడే ప్రమాదం ఉంటుందని తెలిపింది. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ల…

Read More

ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె. ఆమె ప్రముఖ భారతీయ నర్తకిగా ఖ్యాతిని పొందారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలు. కర్ణాటక సంగీతం సైతం నేర్చుకొని పాటలు పాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. ఆమె కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలిచ్చారు. యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా పని చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి పలువురికి శిక్షణ ఇచ్చారు. ఆమెకు భారతీయ కళారంగానికి…

Read More

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘తెలంగాణ ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’లో సుమారుగా రూ.3,500 కోట్లు కోత విధించడం జరిగిందని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం విమర్శించింది. ఎన్నికలకు ముందు ఎస్సీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానాలు (అంబేద్కర్‌ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్డ్‌ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునః నిర్మాణం మొదలైన అంశాలు) ఎటువంటి కేటాయింపులు జరగలేదని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ రాబోయే రోజులలో చేపట్టనున్న భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 5, 6, 7 తేదీలలో` ఎస్సీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 17 తేదీ` కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌కు అనుగుణంగా నిధులు…

Read More

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్‌ కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమ‌తి ద‌క్క‌లేదు. ఆగ‌స్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఆయ‌న పారిస్‌లో గ‌డ‌పాల్సి ఉన్న‌ది. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పంజాబీ ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు సీఎం భ‌గ‌వంత్‌మాన్ పారిస్ వెళ్లాల‌నుకున్నారు. అయితే ఆయ‌న ప్ర‌యాణానికి అనుమతి ఇవ్వ‌డం లేద‌ని సీఎంవో ఆఫీసుకు స‌మాచారం ఇచ్చారు. స్వంత ఖ‌ర్చుల‌తో పారిస్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. హాకీ ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. హాకీ జ‌ట్టులో ప‌ది మంది పంజాబీ ప్లేయ‌ర్లే ఉన్నారు. కీల‌క‌మైన మ్యాచ్‌లు ఆడుతున్న స‌మ‌యంలో మ‌న జ‌ట్టుకు అండ‌గా ఉండాల‌ని అనుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కానీ ప్ర‌ధాని మోదీ మాత్రం ఒంట‌రిగా విదేశీ ప్ర‌యాణాలు చేస్తుంటార‌ని సీఎం మాన్ పేర్కొన్నారు. పారిస్‌కు వెళ్లిన భార‌త బృందంలో 19 మంది పంజాబీ ప్లేయ‌ర్లు ఉన్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. 52…

Read More

వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్లను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్​లాల్​ వయనాడ్​ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్నాయి. కాగా,కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వయనాడు బాధితుల కోసం రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. ఆయన భార్య టి.కె. కమల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.33,000 అందించారు. మరోవైపు కేరళ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు కూడా తమ నెల జీతం రూ.50,000లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నామని తెలిపారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది మృతిచెందడం యావత్‌ దేశాన్ని కలచివేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు…

Read More

దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాలు, అక్కడ ఉన్న కేంద్ర సంస్థలు మెరుగైన సమన్వయంతో పనిచేయడం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత సమన్వయాన్ని పెంపొందించేందుకు మార్గాలు అన్వేషించాలని గవర్నర్లకు సూచించారు. ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన గవర్నర్ల రెండు రోజుల సదస్సుకు ఆమె అధ్యక్షత వహిస్తూ ఐక్యతాభావం మరింత పెరిగేలా చూడాలని ఆమె తెలిపారు. కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలు దేశం ఆలోచనా ధోరణిలో మార్పునకు సంకేతాలని రాష్ట్రపతి చెప్పారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా రూపొందించిన జాతీయ విద్యా విధానం సమర్థంగా అమలయ్యేలా రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల కులపతుల హోదాలో తమవంతు కృషిచేయాలని గవర్నర్లను ఆమె కోరారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమ్మిళిత అభివృద్ధి కోసం ఆలోచనలు పంచుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ‘అమ్మ పేరుతో ఒక మొక్క’, ‘మై భారత్‌’, ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌’ కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రజల్లోకి…

Read More

ఇటీవల సరిహద్దుల్లో ఉగ్రదాడులు పెరుగుతున్న క్రమంలో కేంద్రప్రభుత్వం శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ నితిన్‌ అగర్వాల్‌, అతని డిప్యూటీ స్పెషల్‌ డీజీ (వెస్ట్‌) వైబీ ఖురానియాలను విధుల నుంచి తొలగించింది. వారిని సొంత రాష్ర్టాల కేడర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  వేర్వేరుగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని ప్రకటించింది. అగర్వాల్‌ 1989 కేరళ కేడర్‌ అధికారి కాగా, ఖురానియా ఒడిశాకు చెందిన 1990 బ్యాచ్‌ అధికారి. వారి తొలగింపునకు కారణాలు తెలియరాలేదు. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌లోకి వస్తున్న చొరబాటుదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, వీరిని అరికట్టడంతో బీఎస్‌ఎఫ్‌ విఫలమైందని ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు తెలిసింది. ఇలా ఉండగా, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)లలో 84,106 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం…

Read More

నీట్‌ లీకేజీ పెద్ద ఎత్తున జరగనందునే ఆ పరీక్షను రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీచేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు జూలై 23న తాము ఇచ్చిన తీర్పునకు సంబంధించి కారణాలను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వివరించింది. ‘‘హజారీబాఘ్‌, పట్నాలో మినహా నీట్‌ పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృతస్థాయిలో లీకేజీ జరగలేదు’’ అని తేల్చిచెప్పింది. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి (ఎన్‌టీఏ) సూచించింది. అలాగే.. ఎన్‌టీఏ పనితీరును సమీక్షించేందుకు, పరీక్షల సంస్కరణలకు సంబంధించిన సిఫారసుల నిమిత్తం ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్యానెల్‌ పరిశీలించాల్సిన అంశాల పరిధిని పెంచుతూ కొన్ని సూచనలు చేసింది. పరీక్షాకేంద్రాల కేటాయింపు ప్రక్రియపై సమీక్ష, అభ్యర్థుల గుర్తింపుపత్రాల తనిఖీ, పరీక్షాకేంద్రాల్లో సీసీటీవీల పర్యవేక్షణ తదితర 8 అంశాలకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిపి.. పరీక్షల వ్యవస్థలో లోపాలను సరిదిద్దే చర్యలను సూచిస్తూ సెప్టెంబరు 30 నాటికి…

Read More

రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీయే అధారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సి ఆర్ డి ఎ) 36 వ అథారిటీ సమావేశం జరిగింది. అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండగా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ ఛైర్మన్ గా ఉన్నారు.ఆర్థిక శాఖ మంత్రి తో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్వీనర్ గా మొత్తం 11 మంది సభ్యులున్నారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 11 అంశాలను అజెండాలో చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం నాటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అడగ్గానే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాల భూమిని ఇచ్చారని మంత్రి చెప్పారు.అయితే గత ఐదేళ్లలో రైతులకు చెప్పినవి ఏమీ వైసిపి ప్రభుత్వం చేయలేదని…దీంతో రైతులు…

Read More

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం పార్టీ నేతల అభిప్రాయం మేరకు బొత్సను ఎంపిక చేశామని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డ ఆయనపై వైసీపీ అధిష్టానం ఫిర్యాదుతో మండలి చైర్మన్‌ ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఆయన జనసేన అభ్యర్థిగా ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఓటర్లలో వైసీపీకి మూడింట రెండు వంతుల ఆధిక్యత ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న టిడిపి కూటమి ఫిరాయింపులను…

Read More