Author: Editor's Desk, Tattva News

నదుల అనుసంధాన ప్రక్రియకు తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్‌ఫోర్స్ స మావేశం నిర్వహించింది. ఎన్‌డ బ్లూడిఎ చైర్మన్ భోపాల్ సింగ్ అ ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగస్వామ్య రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కూడా పాల్గొన్నారు. దేశంలో ప్రధాన నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నదులు అనుసంధాన ప్ర క్రియపై లేవనెత్తిన పలు సందేహాలకు సమావేశంలో స్పష్టతనిచ్చారు. తొలి కింద గోదావరి కృష్ణా పెన్నా కావేరి నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గోదావరి నదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్న నీటి చుక్కా నీటిని కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం వినియోగించుకోబోమని ఎన్‌డబ్లూడిఎ నుంచి గట్టి హామీ లభించింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో…

Read More

రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ ను సీబీఐ త్వరలో విచారించే అవకాశం ఉన్నది. జాబ్‌ ఫర్‌ ల్యాండ్‌ కేసులో కేసులో ఇటీవల ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రిని విచారించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ కేసులో లాలూ సతీమణి, బిహార్‌ మాజీ సీఎం రబ్రీదేవిని సోమవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. జాబ్‌ ఫర్‌ ల్యాండ్‌ కేసులో లాలూ, రబ్రీదేవి, మిసా భారతి సహా 14 మంది నిందితులుగా చేర్చారు. మార్చి 15న లాలూ ప్రసాద్‌, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతిని కోర్టుకు హాజరుకావాలని కోరింది. మేరకు సీబీఐ నోటీసులు పంపింది. తొలుత ఈ విచారణ సీబీఐ కార్యాలయంలో జరగాల్సి ఉండగా అనంతరం…

Read More

సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాస్త్రాలను భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరించింది. కొత్త ఫ్లూ వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్‌ ఫీవర్‌ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా, దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఇదిలా ఉంటే కరోనా తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ను వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని, యాంటీబయోటిక్స్‌ వాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని ఐసిఎంఆర్‌ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవ్వరూ వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్‌ వాడకూడదని చెప్పింది. మరోవైపు ఇన్‌ఫెక్షన్‌లను నిర్ధారించుకోకుండా యాంటీబయోటిక్స్‌ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను…

Read More

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి కీలక నేత బీఎస్ యడియూరప్పకు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను గాల్లోకి లేపి తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటకలో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారంలో యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు సోమవారం ఆయన వెళ్తుండగా కర్ణాటకలోని కాలబురగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ వద్ద ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు పోగయ్యాయి. ల్యాండింగ్ సమయంలో గాలికి ప్లాస్టిక్ కవర్లు చాపర్ ను చుట్టుముట్టాయి. దీంతో పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. తర్వాత అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్థాంతరంగా వాయిదా…

Read More

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రాజెక్ట్‌-కె షూటింగ్‌లో అమితాబ్‌ గాయపడ్డాడు. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్‌ ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్, దీపికా పదుకునే జంటగా నటిస్తున్న ప్రాజెక్ట్‌-కె సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మార్చి 4న ఈ సినిమా షూటింగ్‌లో అమితాబ్‌ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెమెకలకు గాయాలయ్యాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన చిత్ర యూనిట్ హుటాహుటిన అమితాబ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో అమితాబ్‌ పక్కటెముకలకు గాయాలయినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు రోజులు పాటు అమితాబ్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల‌ని వైద్యులు సూచించడంతో ఆదివారం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవ్వ‌గానే ముంబై వెళ్లిపోయాడు.…

Read More

కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజల్లో తిరిగినా తనపై స్టేట్ మెంట్ ఇచ్చినా చెరుకు సుధాకర్‌ను చంపడంతో పాటు ఆయన కొడుకు హాస్పటల్ సైతం ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోమని చంపేయడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌లో హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని తాను ఆపలేనని హెచ్చరించారు.ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చెరుకు సుధాకర్‌ తనయుడు డాక్టర్‌ సుహాస్‌కు ఫోన్‌ చేసిన ఎంపీ కోమటిరెడ్డి..…

Read More

విద్య, క్రీడలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని, జీవితంలో రెండూ ముఖ్యమైనవి కాబట్టి విద్యార్థులు రెంటిపై దృష్టి పెట్టాలని రెండు సార్లు బ్యాడ్మింటన్ లో ఒలింపిక్ పథకాలు సాధించిన పద్మభూషణ్ పి.వి. సింధు సూచించారు. విట్ యూనివర్సిటీలో రెండు రోజుల విటోపియా 2023 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొంటూ క్రీడలు ప్రజలను శారీరకంగా దృఢంగా చేస్తాయని, శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవని తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ఎంబీఏ పూర్తి చేశానని ఆమె తెలిపారు. విట్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొంచుకోవటానికి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. విటోపియా 2023 అనేది విద్యార్థులకు వారి క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే గొప్ప వేదికని చెప్పారు. ఇతర విశ్వవిద్యాలయాలు, కళాశాలల…

Read More

ఆయిల్‌ దిగుమతుల్లో భారత్‌ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్‌, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి నెలలో రోజుకు 1.6 మిలియన్‌ బ్యారెళ్లకు పెరిగి దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది. ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వోర్టెక్సా ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సరఫరా చేయడం ద్వారా వరసగా ఐదో నెల అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. ఫిబ్రవరి 2022 రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా కేవలం 1 శాతం కన్నా తక్కువ మార్కెట్‌ వాటాను మాత్రమే కలిగి ఉండేది.  చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్‌ ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధ ఫలితంగా పాశ్చాత్య దేశాలు…

Read More

‘‘తెలంగాణ భూపోరాటంలో నిజాం చెంచాలకు ముచ్చెమటలు పట్టించిన బంజారా పోరాట యోధుడు జాఠోత్ ఠానూ నాయక్. నమ్మిన సిద్ధాంతంకోసం, బంజారాల హక్కుల కోసం జాటోతూ ఠాను నాయక్ కుటుంబం నిజాం పోలీసులతో ప్రభుత్వంతో పోరాడి నేలకొరిగింది. ఠానూ నాయక్ స్పూర్తితో గిరిజనులంతా ఏకమై పోడు భూములకు పట్టాలు, గిరిజన రిజర్వేషన్ల అమలు కోసం కేసీఆర్ సర్కార్ పై పోరాడండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా గిర్ని తండాకు వచ్చిన సంజయ్ పార్టీ నేతలతో కలిసి బంజారా యోధుడు జాఠోత్ ఠానూ నాయక్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆరోజు రాళ్లు రప్పలతో గుట్టలున్న 77 ఎకరాలను తొలిచి సారవంతమైన భూములుగా మార్చి ధాన్యరాశులు పండిస్తున్న ఠానూ నాయక్ తండా పై నిజాం చెంచాల కండ్లు పడ్డాయని తెలిపారు. పన్ను కట్టాలి లేకుంటే ఆ భూముల్ని లాక్కుంటాం…

Read More

దగ్గు, జలుబు, వికారం వంటి చిన్నపాటి అస్వస్థతలకు అజిత్రోమైసిన్‌, అమోక్సిక్లా వంటి యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా వాడరాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐఎంఎ హెచ్చరికలు జారీ చేసింది. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నిరంతర దగ్గు, కొన్ని సందర్భాల్లో జ్వరం, ఒళ్లు నొప్పుతో కూడిన దగ్గు కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవన్నీ సీజనల్‌గా వచ్చేనని, కాకపోతే వీటిలో కొన్ని కేసులకు ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకం ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ కారణమవుతోందని ఐఎంఎ పేర్కొంది. ప్రస్తుతం వస్తున్న దగ్గులకు హెచ్‌2 ఎన్‌2 కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) నిపుణులు కూడా వెల్లడించారు. గత రెండు, మూడు నెలలుగా ఇది విస్తతంగా వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఇది ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోందని చెప్పారు.  ‘ఈ ఇన్ఫెక్షన్‌ ప్రభావం సాధారణంగా అయిదు నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. మూడు…

Read More