టీపీసీసీ రేవంత్ రెడ్డి తన సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వివాదాలకు కేంద్రం అవుతున్నారు. ఆయన వాఖ్యాలను ఆయన పార్టీ వారీ సమర్ధింపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రగతి భవన్‌ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్.. శుక్రవారం కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఐదో రోజు కొత్త లింగాల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఈ 12 మంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో ఉరి తీయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ 12 మంది ఎమ్మెల్యేలను డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. జీవితంలోనే ఎమ్మెల్యే…
Author: Editor's Desk, Tattva News
అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడిస్ అదానికి చెందిన నాలుగు కంపెనీలకు రేటింగ్‌ను స్టెబుల్ (స్థిరత్వం) నుంచి నెగిటివ్ (ప్రతికూల)కు మార్చినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూపు, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్‌వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్ సంస్థలకు ఇచ్చిన రేటింగ్ ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చింది. అదానీ గ్రూప్ సంస్థల్లో కార్పొరేట్ సుపరిపాలన లోపించిందని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పతనమవుతున్నది. ఇంతకుముందు క్రెడిట్ సూయిజ్, సిటీ బ్యాంక్ సంస్థలు కూడా అదాని గ్రూప్ సంస్థలు జారీ చేసిన బాండ్లకు విలువ లేదని.. వాటిని తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు అదాని కంపెనీల షేర్లను మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్‌సిఐ) వెయిటేజీని పున:సమీక్షించింది. నాలుగు…
ప్రధాని నరేంద్ర మోదీ మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లో జరిగిన కార్యక్రమంలో ముంబై నుంచి షిర్డీ, ముంబై నుంచి షోలాపూర్‌కు వెళ్లే రైళ్లను మోడీ పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ముంబై – సోలాపూర్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 455 కి.మీ దూరాన్ని 6 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది, ముంబై సీఎస్టీ నుంచి సాయంత్రం 4:05 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:40 నిమిషాలకు షోలాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున 6:05 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది. ముంబై – షిర్డీ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 343 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది.తెల్లవారు జామున 6:20 నిమిషాలకు బయలుదేరి ఉదయం 11:40 నిమిషాలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ నుంచి సాయంత్రం 5:25…
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పులో కాలేశారు. 2023-24 బడ్జెట్ స్థానంలో ఆయన గురువారం అసెంబ్లీలో పాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టి పావుగంటకు పైగా చదవడంతో సభలో రభస జరిగింది. దీన్ని మానవ తప్పిదంగా గెహ్లాట్ ప్రకటించి క్షమాపణ చెప్పినప్పటికీ సభలో ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరకు మరోరోజు బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రకటించి ముఖ్యమంత్రి సభను వాయిదా వేశారు. బడ్జెట్ పత్రాలు లీకయ్యాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు బడ్జెట్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలియజేయడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. గురువారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గెహ్లాట్ 15 నిమిషాలపాటు దాన్ని చదివారు. తాను చదువుతున్నది పాత బడ్జెట్ అని గ్రహించిన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని నిలిపివేశారు. ప్రసంగంలో భాగంగా సీఎం గెహ్లాట్ రెండు ప్రకటనలు చేయగానే.. విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆ రెండు స్కీమ్‌లు గత ఏడాది బడ్జెట్‌లో ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. వెల్‌లోకి…
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పెను ప్రమాదం తప్పింది. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి రోడ్ ఫై నిలిచిపోయింది. రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. ప్రమాదం సమయంలో కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో రాజాసింగ్‌కు పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా గురువారం ధూల్‌పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా మొరాయిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చుతూ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైరు ఊడిపోయింది. ముందు జాగ్రత్తగా వాహనం నిదానంగా నడపడం వల్లే ప్రమాదం తప్పిందని, ఒకవేళ తాము సాధారణ వేగంతో ప్రయాణించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సిగ్గు అనేది ఉంటే, ఇప్పుడైనా తన పాత బుల్లెట్…
గరీబ్ హఠావో అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ నినాదం మాత్రమేనని, నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు భవిష్యత్తు కోసం చేసిందేమీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధదండగని, దేశ ప్రగతిని నాశనం చేసిందని, ప్రజల డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా గురువారం రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగీస్తూ దేశ ప్రజలు కాంగ్రెస్‌ను నిరాకరిస్తున్నారని స్పష్టం చేశారు. అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని ఆందోళన చేపడుతున్న ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పటికీ ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. చిన్న చిన్న దేశాలు సహితం అభివృద్ధి చెందితే, భారత్‌ను కాంగ్రెస్ నాశనం చేసిందని ప్రధాని విమర్శించారు. యుపిఎ పనితీరును నిశితంగా పరిశీలించానని చెబుతూ ఆ ప్రభుత్వం ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా యత్నించలేదని పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు తమ…
శక్తివంతమైన భూకంపంతో టర్కీ, సిరియాలల్లో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. భవనాలన్నీ కుప్పకూలి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పటి నుంచి దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. వేలాది మంది ప్రజలు తాత్కాలిక శిబిరాలు, స్టేడియాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఎముకలు కొరికే చలి, మంచుతో మరింత అల్లాడిపోతున్నారు. తినడానికి ఆహారం, తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలకు మించి 21 వేలు దాటింది. టర్కీలో 17,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 4,000 మంది మృతి చెందారు సహాయక చర్యల్లో 1,10,000 మందికి పైగా పాల్గొంటున్నారు. దాదాపు 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లు రంగంలోకి దిగాయి. భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు పలు దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. టర్కీలోని హతాయ్ ప్రావిన్సులో భారత సైన్యం తాత్కాలిక ఆసుపత్రిని నెలకొల్పి అత్యవసర వైద్య…
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాల జాబితాలో ఉన్న దాదాపు 40 కులాలకు జాతీయ ఓబీసీ జాబితాలో చోటు కల్పించకపోవడంతో జాతీయస్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ఛైర్మన్ హంసరాజ్ గంగారాం ఆహిర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నేత జే. సంగప్ప, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డా. లక్ష్మణ్.. జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్న వర్గాలకు కూడా ఫలాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న 40 కులాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు, ఫలాలు అందించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, ఇదే మాదిరిగా వీరశైవ…
భారతదేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఆతిథ్య రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉపాధి కల్పన, స్థానిక సముదాయాల ఆర్థిక సాధికారత విషయంలో పర్యాటక రంగం పోషించే పాత్రను గుర్తెరిగి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇందుకోసం కరోనాంతర పరిస్థితుల్లో పర్యాటక రంగానికి పునర్వైభవం కల్పించే దిశగా దక్షిణాసియా దేశాలన్నీ సంయుక్తంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గురువారం గ్రేటర్ నోయిడాలో ‘సౌత్ ఏషియా ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్‌ఛేంజ్ మార్ట్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. భారత పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, స్థానిక సముదాయాల ఆర్థిక స్థిరత్వం, ఉపాధికల్పన కేంద్రంగా రూపుదిద్దుకున్న నూతన పర్యాటక విధానం ముసాయిదా, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంపూర్ణ…
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ తన కుమార్తె కిమ్‌జుయేతో కనిపించారు. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన సైనికాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె కూడా ఉన్నారు. దానితో భవిష్యత్ నేత ఆమె అవుతారని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఆమె వయసు 10 సంవత్సరాలు. త్వరలో భారీ సైనిక కవాతు జరగనుందని, అందులో ఉత్తర కొరియా తమ అణ్వాయుధ సామర్థాన్ని ప్రపంచానికి చూపనుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్, సైన్యం లోని ప్రముఖులతో భేటీ కావడం విశేషం. కుమార్తెతో కలిసి కిమ్ కనిపించడం ఇది నాలుగోసారి. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం కిమ్‌జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ ఆఫీసర్స్ లాడ్జింగ్ క్వార్టర్స్‌ను మంగళవారం సందర్శించారు. అనంతరం జరిగిన విందులో రక్షణ…