మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వివాదంలో యూపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె అక్రమాలు, అవినీతి బాగోతాలపై విచారణ జరిపిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. ఆమె ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. అంతేకాకుండా భవిష్యత్‌లో సివిల్స్ పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. అధికార దుర్వినియోగంతో వెలుగులోకి వచ్చిన పూజా ఖేద్కర్ వ్యవహారం.. ఆ తర్వాత తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగం సాధించినట్లు ఆరోపణలు రాగా.. యూపీఎస్సీ విచారణ జరిపి.. అది నిజమే అని తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెను డిబార్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. మరోవైపు.. ప్రస్తుతం ఆమె పోలీస్ కస్టడీలో ఉన్నారు. పూజా ఖేద్కర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల వ్యవహారంలో విచారణ జరిపిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మళ్లీ…
Author: Editor's Desk, Tattva News
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. ‘యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరణకు సంబంధించింది.. జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంలు రెండింటిపై 18 శాతం జీఎస్టీ విధించారు.. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం అనేది జీవితం అనిశ్చితిపై పన్ను విధించడం.. ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే కుటుంబానికి కొంత రక్షణగా ఉండేందుకు చేసే…
కేరళ వయనాడ్‌లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై బుధవారం పార్లమెంట్ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. “ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. 2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ వ్యవస్థను 2016, 2023లో ఆధునీకరించాం. ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి” అని తెలిపారు. “వారం రోజుల ముందే ప్రమాదాన్ని…
ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను కూడా రంగంలోకి దింపారు. బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్‌లను తీసుకొచ్చారు. ఇవి మానవ అవశేషాలతోపాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసను కూడా పసిగట్టగలవు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్‌లో వీటికి చాలా ఏళ్లుగా శిక్షణ ఇచ్చినట్టు రక్షణశాఖ అధికారులు…
కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమీషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఏపీ క్యాడర్‌కు చెందిన ఆమె.. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబూషన్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా, మహిళా, శిశు అభివృద్ధి, రక్షణ శాఖల్లో కార్యదర్శిగా చేశారు. ఆర్థికశాస్త్రంలో ఆమె ఎంఫిల్ చేశారు. సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఎంఎస్సీ చదివారు. రెండు కీలకమైన కేంద్ర పథకాలను ఆమె రూపకల్పన చేశారు. బేటీ…
ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో దానిని మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ నేడు ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. మంగళవారం రాత్రే ఆర్డినెన్స్ జారీ కోసం గవర్నర్ అమోదం కోరుతూ మంత్రి మండలి తీర్మానాన్ని పంపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కాల వ్యవధితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై 31తో ముగియనుంది. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో మంత్రుల నుంచి ఆర్డినెన్స్ ఆమోదం తీసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కాలపరిమితి ముగియనున్న దృష్ట్యా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సు చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు మంత్రి మండలి నుంచి ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకున్నారు. సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల మేర ఓటాన్ అకౌంట్…
ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది జరిగిన ఒడిశా రైలు దుర్ఘటనలో సుమారు 290 మంది మరణించిన విషయం తెలిసిందే. దాంతో భద్రతాపరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాలాసోర్ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి. తాజాగా మంగళవారం జార్ఖండ్‌లోని బారాబంబోలో హౌరా – ముంబయి మెయిల్‌కు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 20కిపైగా గాయపడ్డారు. గడిచిన ఆరువారాల్లో మూడు ప్యాసింజర్ రైలు ప్రమాదం బారినపడ్డాయి. ఇందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మూడు ప్రధాన ప్రమాదాలను పరిశీలిస్ ఈ ఏడాది జూన్ – జూలై మధ్య జరిగాయి. ఈ ఘటనలో 17 మంది మృత్యువాతపడా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ నెల 17న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయపడ్డారు. న్యూజాల్పాయ్‌గురి సమీపంలో ఓ సరుకు…
రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బిఆర్‌ఎస్ అక్కడ కూర్చొందని, ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరమని బిజెఎల్‌పి నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని, కాని అంత బడ్జెట్ రుణమాఫీకి కేటాయించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారని, కాని ఇందులో కోత విధించినట్లు తెలుస్తోందని చెప్పారు. ఏ ప్రాతిపాదికన రైతులను ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు. వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారని, మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఏడాది రైతు బంధు పడలేదని, సీజన్ రైతు బంధు విడుదల చేయాలని కోరారు. రైతు బందుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలని స్పష్టం…
పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు రెండో మెడల్ వచ్చింది. ఈ మెడల్ కూడా షూటర్ మను బాకరే తీసుకురావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మను బాకర్, సరబ్‌జ్యోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ గెలిచింది. కొరియాతో జరిగిన ఈ మెడల్ ఈవెంట్లో ఇండియన్ టీమ్ 16-10తో విజయం సాధించింది. షూటర్ మను బాకరే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లోనూ మను బాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లోనూ ఆమె మెడల్ గెలిచింది. ఇలా ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా మను బాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కొరియాతో మంగళవారం (జులై 30) జరిగిన బ్రాంజ్ మెడల్ ఈవెంట్లో ఇండియా 13 షాట్ల తర్వాత 16-10తో విజయం సాధించింది. అంతకుముందు మను బాకర్ వ్యక్తిగత 10 మీటర్ల…
కేరళలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. వాయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. టీ ఎస్టేట్ కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. 36 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా కొండచరియాల్లోనే చిక్కుకున్నారు. వారిని బయటకు తీయడం కూడా కష్టంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మెప్పాడి సమీపంలోని కొండా ప్రాంతాలలో తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. మలప్పురంలోని నిలంబూర్ ప్రాంతానికి ప్రవహించే చలియార్ నదిలో చాలా మంది కొట్టుకుపోతారని అనిపించిందని స్థానికులు భయంతో చెప్పారు. వాయనాడ్‌లోని మెప్పాడి పంచాయతీ పరిధిలోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి పెద్ద ప్రమాదం జరిగినట్టుగా వెల్లడించారు. కోయంబత్తూరులోని సూలూరు నుంచి వాయనాడ్‌కు రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హెలికాప్టర్లు వెళ్లాయని ముఖ్యమంత్రి కార్యాలయం…