ప్రపంచ కప్ దిశగా భారత్ ప్రయాణం అద్భుతంగా సాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా తమ లక్ష్యం ఒకటే అన్న రీతిలో టీమ్‌ఇండియా విజృంభిస్తున్నది. ఇప్పటికే శ్రీలంకను మట్టికరిపించిన భారత్ వన్డే నంబర్‌వన్ టీమ్ న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నది. హైదరాబాద్ వన్డేలో ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకున్న రోహిత్‌సేన, రాయ్‌పూర్‌లో కివీస్‌ను రఫ్ఫాడించింది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో(179 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఏడో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత షమీ(3/18), హార్దిక్(2/16), సుందర్(2/7) ధాటికి కివీస్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో 111/2 స్కోరు చేసింది. షమీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే మంగళవారం…
Author: Editor's Desk, Tattva News
భారత హేతువాద సంఘం వ్యవస్థాపక ఛైర్మన్ రావిపూడి వెంకటాద్రి (101) కన్నుమూశారు. ‘హేతువాది’ మాస పత్రిక సంపాదకుడైన రావిపూడి వెంకటాద్రి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చీరాలలో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో పుట్టిన రావిపూడి వెంకటాద్ మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, ప్రజలను చైతన్య పరిచేందుకు తన చివరి శ్వాస వరకు ప్రయత్నించారు. మనిషి మనుగడకు మతం అవసరం లేదని రావిపూడి వెంకటాద్రి చెప్పేవారు. మనిషికి ‘హేతువాదం’ మార్గదర్శిగా చేయూతనిస్తుందనీ, మూఢనమ్మకాల మాయలో పడి సతమతమవుతున్న వారికి వెలుగు చూపుతుందని వెంకటాద్రి బలంగా చెప్పేవారు. ప్రశ్నించే వారంతా హేతువాదులేనని, దీనికి ఒక మతం ఉండదని చెప్పేవారు. కనిపించని దేవుడి కంటే కనిపించే సాటి మనిషిని ప్రేమించాలని చెప్పే రావిపూడి . ‘హేతువాదం’పై దాదాపు 100 పుస్తకాలు రాశారు. హేతువాద ఉద్యమంలో వేల సంఖ్యలో ఉపన్యాసాలు ఇచ్చారు. హేతువాదంపై ప్రచారం కోసం 1943లో ఆయన కవిరాజాశ్రమం స్థాపించారు.…
షారుఖ్ ఖాన్ ఎవరు..? అంటూ అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ఎదురు ప్రశ్న వేయడంతో అస్సాం మీడియా ఆశ్చర్యపోయింది. షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమా ప్రదర్శించే అసోంలోని నారేంగి థియేటర్‌లో చెలరేగిన ఉద్రిక్తత గురించి అడిగిన ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేశారు. షారుఖ్‌ఖాన్ గురించి గానీ, ఆయన నటించిన సినిమా గురించి గానీ తనకు ఏమాత్రం తెలియదని సమాధానమిచ్చారు. బాలీవుడ్ నుంచి చాలా మంది ఈ సమస్య గురించి తనకు ఫోన్ చేసినా.. షారుఖ్‌ఖాన్ మాత్రం చేయలేదన్నారు. ఖాన్ ఫోన్ చేసి విషయం చెప్తే పరిశీలిస్తానని చెప్పారు. మిస్టర్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అని మీడియా ప్రతినిధులు చెప్పగా.. ఈ రాష్ట్ర ప్రజలు అస్సామీల గురించి మాత్రమే ఆందోళన చెందాలని, హిందీ చిత్రాల గురించి కాదని స్పష్టం చేశారు. దివంగత నిపోన్ గోస్వామి దర్శకత్వం వహించిన అస్సామీ సినిమా ‘డాక్టర్ బెజ్బరువా – పార్ట్ 2’ త్వరలో విడుదల…
పాకిస్తాన్‌లో హిందూ బాలికల కిడ్నాప్, బలవంతపు మత మార్పిడి యధేచ్చగా జరుగుతున్నది. ఇటీవల కొందరు దుండగులు ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. ఆమె మతం మారినట్లు సర్టిఫికెట్ తెరపైకి రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో జరిగింది. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు కావడం విశేషం. పాకిస్తాన్‌లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఓ 14 ఏండ్ల వయసున్న జమున అనే బాలికను కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. వారం రోజుల క్రితం సింధ్‌లోని తాందో అల్లాయార్ ప్రాంతంలో ఇంటికెళ్తున్న బాలికను అడ్డగించిన కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. మత మార్చిడి సర్టిఫికెట్ తెరపైకి రావడంతో ఆమెను మతం మార్పించినట్లుగా స్పష్టమవుతున్నది. ఇది సింధ్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన…
మూడు డోసుల కరోనా టీకాకు బదులు ఒకే డోసు టీకాను ఆవిష్కరించేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత ఫార్మాస్యూటికల్ 72 వ సదస్సుకు హాజరైన ఆయన నాగపూర్ లో ఈ విషయం తెలిపారు. కరోనా నిరోధానికి ప్రస్తుతం ప్రాథమిక డోసులు 2,. అదనపు డోసు టీకా ఒకటి వేస్తుండగా, ఈ స్థానంలో ఒకే డోసు టీకా కోసం పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. మనదేశంలో ఔషధ పరిశోధకులను విశేషంగా ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇవ్వాలని డాక్టర్ ఎల్ల ఈ సందర్భంగా కోరారు.‘ భారతీయ కంపెనీలకు పరిశోధనల ఆధారిత రాయితీలు ఇవ్వడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. మనదేశంలో ఆవిష్కరించి పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఉత్పత్తికి పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా పరిశోధనలపై శాస్త్రవేత్తలు,…
ప్రపంచం మొత్తం మీద సరాసరి కన్నా భారత కోస్తా సముద్ర మట్టాలు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయని, ప్రపంచ వాతావరణ సంస్థ వాతావరణ 2021 నివేదిక వెల్లడించింది. పశ్చిమ కోస్తాతో పోల్చుకుంటే తూర్పు కోస్తా తీర ప్రాంత భూములు ఎక్కువగా సముద్ర అలల ప్రభావంతో కోతకు గురవుతాయని హెచ్చరించింది. ఏడాదికి తూర్పు కోస్తాలో 3 మీటర్ల కన్నా ఎక్కువ కోతకు గురి కాగా, పశ్చిమ కోస్తాలో 2.5 మీటర్ల వంతున భూమి కోతకు గురవుతుందని పేర్కొంది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా అనేక వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఇవే సహజంగా తీర భూములు కోతకు గురయ్యేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా రేవులు, ఆనకట్టల నిర్మాణం, కోతను నివారించడానికి పటిష్టమైన నిర్మాణాలు వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. భూశాస్త్ర మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ కోస్తా పరిశోధన కేంద్రం (…
గుజరాత్ సూరత్ కి చెందిన నగల వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిమని రూపొందించాడు. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ ప్రతిమ బరువు 156 గ్రాములు. దీనిని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్ లో పెట్టారు. ప్రధాని మోదీ బంగారు విగ్రహంపై 156 గ్రాములు అని రాసి ఉంది. ఇలా రాసి ఉండటం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. దీనికి గుర్తుగా 156 గ్రాముల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందిచారట. తక్కువ బంగారంతో అందమైన విగ్రహాన్ని తయారు చేయడం నిజంగా కళాత్మకత అనే చెప్పాలి. ఈ విగ్రహాన్ని తయారు చేసింది రాధికా చైన్స్ జ్యూవెల్లరీ యజమాని బసంత్ బోహ్రా. ఆయన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగల వ్యాపారి. ఈ విగ్రహం 4.5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 156 గ్రాముల బరువు ఉంది. బంగారు-వెండి ఆభరణాల తయారీ కంపెనీ…
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సింహాద్రినాధుడు తెప్పోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా పుష్య బహుళ అమావాస్యనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిపించేందుకు ఆలయ ఇన్‌ఛార్జి ఇవో వి.త్రినాధరావు ఆద్వర్యంలో ఆలయ వర్గాలు విశేషంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలుతో అందంగా అలంకరించి వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పల్లకిలో ఆశీనులను చేసి మెట్ల మార్గం ద్వారా బోయిలు కొండ దిగువకు తీసుకువస్తారు. అక్కడ ఆలయ తొలిపావంచ వద్ద గ్రామ పెద్దలు, ఆలయ అధికారులు దర్మకర్తల మండలి సభ్యులు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గ్రామంలోకి సాదర స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి స్వామి నేరుగా వరాహపుష్కరణికి చేరుకొని అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై…
అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ ఐటి సంస్థ గూగుల్ కూడా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ శుక్రవారం ఇమెయిల్ ద్వారా సిబ్బందికి సందేశాలను పంపారు. ఈ నిర్ణయానికి పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని, కొందరు ప్రతిభావంతులైన ఉద్యోగులకు క్షమాపణ చెబుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. ‘నేను కొంత కఠినమైన వార్తలను మీతో పంచుకుంటున్నాను. సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నాం.అమెరికాలో ప్రభావితమయ్యే ఉద్యోగులకు మేము వేరుగా ఇమెయిల్‌ను పంపాం. ఇతర దేశాల్లో అక్కడి చట్టాల వల్ల ఈ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటుంది’ అని పిచాయ్ ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ఆల్ఫాబెట్ 12000 మందిని తొలగించనుందని, ఇది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం శాతం ఉంటుందని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్…
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర (మండమెలిగే పండుగ) నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన మండమెలిగే 2వ తేదీన సారలమ్మ గద్దె శుద్ధి, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. శుద్ధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగతా పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగనున్నాయి. మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో కాక సారయ్యలు, అమ్మవార్ల పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మినీ…