Author: Editor's Desk, Tattva News

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ప్రకంపనలు రేపుతోంది. దీనిపై భారత్‌లోనే కాకుండా పలు దేశాల్లోచర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోనైతే తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సిరీస్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ‘ఇది అపఖ్యాతి పాల్జేసే దురుద్దేశంతో పక్షపాతంతో కూడిన ప్రచారంలో భాగమే’ అంటూ విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనం వెనుక వలసవాద మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఈ డాక్యుమెంటరీ.. దాన్ని రూపొందించిన ఏజెన్సీ విధానానికి ప్రతిబింబం. అపఖ్యాతి పాల్జేసే ఉద్దేశంతోనే ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారని మేం భావిస్తున్నాం. ఇందులో పక్షపాత ధోరణి, వలసవాద మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వాటిని మేం గౌరవించలేం. దీని వెనుక ఉద్దేశం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది’ అని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. “ఇండియా: ది మోదీ క్వశ్చన్” పేరుతో బీబీసీ రెండు సిరీస్‌లలో ఈ…

Read More

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కి అరుదైన గౌర‌వం సౌదీలో ల‌భించింది. ఫుట్ బాల్ లెజెండ్స్ మెస్సి రోనాల్డో నెయిమర్ వంటి స్టార్స్ అందరూ కలిసి ఆడుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ లోప్రారంభించే అవకాశం లభించింది. రియాద్ లో జరగనున్న మ్యాచ్ కి గెస్ట్ గా వెళ్లి ఆటగాళ్ళు అందరికి కరచాలనం చేసి గేమ్ ని స్టార్ట్ చేశారు. దీనికి సంబందించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోని కేవలం 4 గంటల్లో 22 లక్షలకి పైగా నెటిజన్లు వీక్షించడం విశేషం.దీనిని బట్టి అమితాబచ్చన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాళ్ళతో కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అమితాబచ్చన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే అమితాబచ్చన్ వారందరికీ కలిసి దిగిన ఫోటోని కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇక…

Read More

గుంటూరులో ఈ నెల ఒకటో తేదీన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సభలో జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనారెడ్డి గురువారం విచారణ ప్రారంభించారు. ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కానుకల పంపిణీ సందర్భంగా చంద్రబాబునాయుడును ఆహ్వానించి ఆయనతో పంపిణీకి శ్రీకారం చుట్టారు. సభ ముగిసిన తరువాత ప్రజలకు కానుకల కిట్లు పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు, 19 మంది గాయపడినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనారెడ్డి సందర్శించారు. స్థానికులను విచారించారు. ఘటన ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కానుకల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని, సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత పంపిణీ ప్రారంభమైందని…

Read More

అమెరికాలోని మేరీలాండ్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు మహిళా అరుణా మిల్లర్‌ ప్రమాణస్వీకారం చేశారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌- అమెరికన్‌గా అరుణా మిల్లర్‌ అమెరికాలో చరిత్ర సృష్టించారు. నవంబర్‌లో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లెప్టిnనెంట్‌ గవర్నర్‌గా ఆమె విజయం సాధించారు. అరుణ మేరీలాండ్‌ రాష్ట్రానికి 10వ లెప్టిnనెంట్‌ గవర్నర్‌. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా పెదపారుపూడి. వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లింది. అరుణ తన కెరీర్‌ను ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజినీర్‌గా ప్రారంభించారు. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఐబీఎం సంస్థలో పని చేసేవారు. 1972లో వీరి కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. 1972లోనే వీరి కుటుంబం అమెరికా వెళ్లి స్థిరపడింది. 2010 నుంచి 2018 వరకు మేరీలాండ్‌ హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌లో రెండు పర్యాయాలు సభ్యురాలిగా అరుణ ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగి…

Read More

వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న సమయంలో ఈ మంత్రిత్వ శాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి, అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్టు ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ గుర్తించి అరెస్టు చేసింది. గూఢచర్యం ఆరోపణలతో ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సుమిత్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతడు గత కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని, అందుకు బదులుగా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమాచారాన్ని చేరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి…

Read More

మహిళల భద్రతను పరిశీలించేందుకు వెళ్లిన ఢిల్లీ మహిళా కమిషన్‌ (డిడబ్ల్యుసి) అధ్యక్షురాలు స్వాతి మాలివాల్‌కు భయంకర అనుభవం ఎదురైంది. ఓ కారు డ్రైవర్‌ ఆమెని 15 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేయడంతో పాటు కారు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతను పరిశీలిస్తుండగా మద్యం తాగిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించినట్లు స్వాతి మలివాల్‌ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ వద్ద డీసీడబ్ల్యూ చీఫ్ తన టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఢిల్లీలోని మహిళల భద్రతను పరిశీలించడానికి గురువారం తెల్లవారుజామున 3.05 గంటలకు ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చారు. ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆమె నిలబడి ఉండగా, ఆమె టీమ్‌‌‌‌‌‌‌‌ కాస్త దూరంలో ఉంది. ఇంతలో ఓ కారు ఆమె దగ్గరికి వచ్చింది. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తాను.. లోపలికి రమ్మని అందులో ఓ వ్యక్తి పిలిచాడు. దీనికి…

Read More

ఎంఎల్‌ఏల కొనుగోలు కేసు పరిశోధనను సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచింది. 2022 డిసెంబర్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏల ఎర కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నుంచి సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వును హైకోర్టు ఇచ్చింది. కేసును సిబిఐకి బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే వినిపించిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తి ఎన్. తుకారాంజీతో కూడిని ధర్మాసనం విన్నది. సిబిఐ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే వాదించారు. ఈ నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పజెప్పడం అహేతుకం అని కూడా వాదించారు. కేసును సిబిఐకి అప్పగించడంలో ఎలాంటి న్యాయం ఉంది? కాసింత న్యాయ సిద్ధాంతాలైనా పాటించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ పత్రాన్ని బహిర్గతం చేయడాన్ని దర్యాప్తు సంస్థ…

Read More

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో జ‌ర‌గాల్సిన మ‌హిళ‌ల జాతీయ రెజ్లింగ్ కోచింగ్ క్యాంపును ర‌ద్దు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఆ ఈవెంట్ జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి జ‌ర‌గాల్సి ఉంది. సుమారు 41 మంది రెజ్ల‌ర్లు, 13 మంది కోచ్‌లు, స‌పోర్ట్ స్టాఫ్ ఆ క్యాంపులో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ ఈవెంట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది. భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్‌భూష‌ణ్‌పై మ‌హిళా రెజ్ల‌ర్లు లైంగిక ఆరోప‌ణ‌లు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫొగ‌ట్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న కూడా చేప‌ట్టారు. బ్రిజ్ భూష‌ణ్‌తో పాటు అనేక మంది కోచ్‌లు లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని వినేశ్ ఆరోపించారు. ఈ ఆందోళనలో వినేశ్‌ పోగాట్‌, సాక్షిమాలిక్‌, సంగీతా ఫొగాట్‌, సోనమ్‌ మాలిక్‌, సరితా మోర్‌, అన్షు, భజరంగ్‌…

Read More

పంజాబ్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆయన పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఢిల్లీలోని కోటరీయే పంజాబ్‌లో వ్యవహారాలను చక్కబెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించే తీరు, నిర్ణయాలు తీసుకునే పద్ధతి, ముఖ్యంగా పంజాబ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని, ఇలా చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం ఆదేశాలను పంజాబ్‌లోని పార్టీ విభాగం పాటించేలా చేయడానికి నిర్దేశించిన కోటరీ సమర్థవంతమైనది కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే తలోదారిలో నడుస్తున్న పార్టీనేతల మధ్య విభేదాలను తగ్గించడానికి బదులు ఈ కోటరీ పెద్దలు వర్గ విభేదాలను మరింతగా పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పార్టీలోని అత్యంత చెడ్డవారిని బలోపేతం చేయడాన్ని ఓ…

Read More

అమెరికా ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ఉద్యోగుల కోసం బ్లాగ్‌పోస్ట్‌లో విడుదల చేసిన కమ్యూనికేషన్‌లో న్నట్టు కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఈ రోజు మేము మార్పులు చేపట్టాల్సి వస్తోంది. ఈ ఫలితంగానే మొత్తం ఉద్యోగుల్లో కొంత తగ్గింపు తప్పనిసరి అయింది’ అని తెలిపారు. `2022-23 క్యూ3 ముగింపు నాటికి 10 వేల ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం లోపు ఉంటుంది’ అని నాదెళ్ల తన పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు కష్టమైందే, కానీ అవసరమని ఆయన చెప్పారు. ఇప్పటికే ట్విట్టర్, మెటాతో పాటు అనేక ఇతర టెక్ కంపెనీలు లేఆఫ్‌లను మొదలుపెట్టాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మైక్రోసాఫ్ట్ ఈ వారంలో 5 శాతం ఉద్యోగులను (సుమారు 10,000 మంది) తొలగించే అవకాశముంది. ప్రధానంగా…

Read More