ఈ నెల 18న ఉప్పల్‌లో భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ బీఆర్‌కే భవన్ (తెలంగాణా సచివాలయం)లో ఉన్నతాధికారులను కలిశారు. మ్యాచ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భారత్‌లో న్యూజిలాండ్ జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్ 21న రాయ్ పూర్‌లో , మూడో వన్డే 24న ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. టీ 20 సిరీస్ 27న రాంచీ, 29న లక్నో, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మ్యాచ్ జరగనుంది. చివరి వన్డేమ్యాచ్ 2019, మార్చి 2న భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది.…
Author: Editor's Desk, Tattva News
వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకులను అంతర్జాతీయ క్రికెట్ మం డలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఆరోస్థానానికి చేరుకున్నాడు. మరో వైపు రోహిత్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కాగా తొలి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ .. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన విరాట్… 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో 45వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయకెరీర్‌లో 73వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే తమ ర్యాంకుల్లో ముందుకెళ్లారు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్…
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు , కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంలో కీలకంగా వ్యవహరించిన హిడ్మా పోలీసుల కాల్పుల్లో మరణించాడు. తెలంగాణ గ్రేహౌండ్స్. సిఆర్పిఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మా మృతి చెందినట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా మృతితో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు భావిస్తున్నారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని.. ఈ జాయింట్ ఆపరేషన్‌లో మాడ్వి హిడ్మా హతమైనట్లు పేర్కొంటున్నారు. ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో అతడు ఉద్యమం పట్ల ఆకర్షితుడై మావోయిస్టుల్లో చేరాడు. చత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. ఇతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు ఉన్నాయి. ఉద్యమంలోకి…
దేశం మొత్తం మీద నివాసానికి సౌకర్యవంతంగా ఉండే పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు టాప్-10లో నిలిచాయి. గుంటూరు ఆరో స్థానం, విజయవాడ ఎనమిదో స్థానం, విశాఖపట్నం తొమ్మిదో స్థానంలో నిలిచాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఇటీవలే సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేద్వారా సేకరించారు. గుంటూరు నుంచి 3,32,620 మంది సర్వేలో పాల్గొన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయస్థాయిలో 6వ ర్యాంకు ఈ నగరానికి లభించింది. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది, విశాఖపట్నం నుంచి 2.88 లక్షల మంది సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. గుంటూరు నుంచి 51.37 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనడం కూడా ఈ నగరానికి కలిసివచ్చి ఆరో ర్యాంకు సాధించింది. విజయవాడ నుంచి 32.12 శాతం, విశాఖపట్నం నుంచి 16.72 శాతం చొప్పున ప్రజలు…
రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పవన్ అరోరాపై కమిషనర్ పూజామీనా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ అరోరా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని, తనను వేధింపులకు చేసినట్లు ఆరోపించింది. తీవ్రమైన ఆరోపణలతో రాజస్థాన్‌లో కలకలం సృష్టించాయి. ఐఏఎస్ అధికారి పవన్ అరోరాకు ఓ మంత్రి రక్షణ కల్పిస్తున్నారని కూడా ఆమె చెప్పారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఐఏఎస్ అరోరా ఖండించారు. పూజా మీనా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆమె ఝాలావర్ జిల్లా మున్సిపల్ కౌన్సిల్ మిషనర్‌గా పని చేస్తున్నారు. ఆమె అక్కడి నుంచి బదిలీ కాగా పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ అరోరా పట్టణ స్థానిక సంస్థల విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా ఉన్నారు. వాస్తవానికి, జనవరి 9న పూజా మీనాను ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ నుంచి నాగౌర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆతర్వాత ఆర్డర్స్‌ను సవరిస్తూ డైరెక్టరేట్‌కు రిపోర్ట్ చేయాలని…
హత్యాయత్నం కేసులో ఒక ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. స్థానిక కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడు కానుండటంతో హైకోర్టును ఆశ్రయించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఈ సంఘటన జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహ్మద్ ఫైజల్ 2014 నుంచి ఎంపీగా ఉన్నారు. 2009లో షెడ్ నిర్మిస్తున్న బంధువైన మహ్మద్ సలీహ్‌పై కొంత మంది వ్యక్తులతో కలిసి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సలీహ్ కొన్ని నెలలపాటు కేరళలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కాగా, బంధువు మహ్మద్ సలీహ్‌పై దాడికి సంబంధించి ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌తోపాటు 23 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బెయిల్ పొందారు. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన కవరత్తి కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఎంపీ ఫైజల్‌తో పాటు మరో నలుగురిని దోషులుగా పేర్కొంది. వారికి…
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఎంపిక చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం, ఆమె బాధ్యతలు చేబట్టడం అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతి కుమారి.. గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. సీఎంవోలో స్పెషల్ ఛేజింగ్ సెల్ బాధ్యతలను కూడా నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా కూడా శాంతి కుమారి సేవలందించారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్…
లాస్ ఏంజిల్స్‌లో మార్చిలో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి ఈ వేడుకలో గతం కన్నా ఎక్కువ సంఖ్యలో భారతీయ సినిమాలు నామినేషన్స్ ని దక్కించుకుని పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇండియా నుంచి దాదాపు 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కు అర్హత సాధించడం విశేషం. ముందుగా గుజరాతీ మూవీ ఛల్లో షో, ఆ తరువాత రాజమౌళి మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాత్రమే ఇండియా తరుపున విదేశీ సినిమాల విభాగంలో ఎంట్రీకి ఎంపికయ్యాయి. అయితే తాజాగా ఆ లిస్ట్ 10కి పెరగడం.. అందులో పలు క్రేజీ సినిమాలు వుండటంతో మన వాళ్లు ఆస్కార్ పై భారీగానే ఆశలు పెట్టుకుంటున్నారు. ఆస్కార్ నామినేషన్స్‌కు ఛల్లో షో, ఆర్‌ఆర్‌ఆర్, వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’, రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ‘కాంతార’, కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’, అలియా భట్…
కృష్ణా నది జలాల్లో వాటాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును వెంటనే గెజిట్లో ప్రచురించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్ణాటక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం కృష్ణాజలాల వివాదంపై దాఖలైన పిటిషన్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఈ తరుణంలో తమది రెగ్యులర్ బెంచ్ కాదని, స్పెషల్ బెంచ్ అని విచారణ జరిపేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక తరఫు న్యాయవాది విచారణ జరపాలని పట్టుబట్టడంతో, మిగతా కేసుల విచారణ పూర్తయ్యాక చేపడతామని చెప్పింది. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవగా.. 2010 డిసెంబర్లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల్లో మిగుల జలాలను 65% లభ్యత ఆధారంగా లెక్కగట్టి వాటాలు నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 448 టీఎంసీల మిగులు జలాల్లో మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 173, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించిందని చెప్పారు. ఈ అవార్డు ప్రకటించి పదేళ్లు దాటినా…
టిడిపికి చెందిన మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలలో హైదరాబాద్ లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్‌లోని మెలాంజ్ టవర్స్‌లో గల నారాయణ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులతోనే నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసింది. చంద్రబాబును ఎ -1గా, నారాయణను ఏ -2గా సీఐడీ చేర్చగా…