బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అమితాబ్ ఒక లెజెండ్ అని, భారత దేశంకే ఒక ఐకాన్ అని ఆమె కొనియాడారు. భారత సినీ పరిశ్రమకు, ప్రపంచ సినీ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారని ఆమె తెలిపారు. భారతరత్నకు అమితాబ్ అన్నివిధాలా అర్హుడని ఆమె చెప్పారు. కోల్ కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా కాకపోయినా.. బెంగాలీల గొంతును వినిపిస్తున్నామని, భారత రత్న అమితాబ్‌జీ అంటూ ఆమె నినాదం చేశారు. చిత్ర పరిశ్రమకు అమితాబ్ చేసిన సేవలు అనితరసాధ్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు.
Author: Editor's Desk, Tattva News
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం వంద రోజుల మైలురాయి చేరుకుంది. రాహుల్ దాదాపు 2,600 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈ యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజస్థాన్‌లోని మీనా హైకోర్టు దౌసా నుంచి వందో రోజైన, శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో యాత్రను పునఃప్రారంభించారు. భారత్ జోడో యాత్ర 100 రోజుల మార్కు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ డీపీని ‘100 రోజుల యాత్ర’గా మార్చారు. కాగా, మీనా హైకోర్టు నుంచి ప్రారంభమయ్యే 100వ రోజు యాత్ర ఉదయం 11 గంటలకు గిరిరాజ్ ధరన్ ఆలయం వద్ద రాహుల్ కొన్ని గంటలు విరామం తీసుకున్నారు. అనంతరం జైపూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 7 గంటలకు లైవ్…
ఉగ్రవాదంపై తనను ప్రశ్నించిన ఓ పాకిస్థాన్ విలేఖరికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా జవాబిచ్చారు. అడుగుతున్న ప్రశ్న కరెక్టే కానీ మీరు అడగాల్సిన మంత్రి వేరే ఉన్నారంటూ పరోక్షంగా పాకిస్థాన్ మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికపై ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద నియంత్రణకు ఎదురవుతున్న సవాళ్లపై భద్రతా మండలిలో జరిగిన ఓ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ఇంతలో పాకిస్థాన్ కు చెందిన ఓ విలేఖరి దక్షిణాసియాలో ఉగ్రవాదం ఇంకెంత కాలం కొనసాగుతుంది? న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్థాన్ లలో ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు? అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. మీరు అడగాల్సిన మంత్రి నేను కాదు. ఇదే ప్రశ్నను పాకిస్థాన్ మంత్రిని అడగాలి అని సూచించారు. ఉగ్రవాదాన్ని ఇంకెన్నాళ్లు ప్రోత్సహిస్తుందని పాకిస్థాన్…
దేశంలో జమిలి ఎన్నికలతో బహుముఖ ప్రయోజనాలున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. భారీ ఖర్చుతో కూడుకున్న ఎన్నికల ప్రక్రియలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ కి చెందిన ఎంపీ హర్‌నాథ్ సింగ్ యాదవ్ (బీజేపీ) గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణపై పలు అంశాలు ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52, 1957, 1962, 1967 వరకు ఏక కాలంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. 1968లో కొన్ని రాష్ట్రాలు 1969లో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువు కంటే ముందే రద్దు కావడంతో ఈ వరుస క్రమానికి అంతరాయం ఏర్పడిందని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ భారీ ఖర్చుతో…
అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుండి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ, వేద పండితులు వంకాయల శ్యాం కుమార్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. హిందుస్థాన్ గగస్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించారు. కాగా సంస్ధ యొక్క కార్యవర్గం సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న శక్తి పీఠాలను ప్రధానం చేశారు. శ్రీ జోగులాంబ ఆలయాన్ని ప్రతిష్టాత్మక హిందూస్థాన్ గగస్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు 2022 దక్కడంపై తెలంగాణ రాష్ట్రంలోని భక్తులందరూ హర్షం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులలో సైతం తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేస్తూ ఏ ఒక్క భక్తులు కూడా అనారోగ్య పరంగా గానీ, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలకు గానీ ఇబ్బందులు పడకుండా…
బ్రిటన్‌కు పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.11,000 కోట్ల మేర మోసగించిన కేసులో భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది. లండన్‌లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ మేరకు గురువారం తీర్పు ఇచ్చింది. ‘సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ అప్పీల్‌దారుడు నీరవ్ మోదీ దాఖలు చేసిన దరఖాస్తు తిరస్కరిస్తున్నాం’ అని జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే కోర్టు ఖర్చుల కింద 1,52,247 పౌండ్లు (సుమారు రూ.1.5 కోట్లు) చెల్లించాలని నీరవ్ మోదీని ఆదేశించింది. కాగా, బ్రిటన్‌లో అరెస్టైన 51 ఏళ్ల నీరవ్ మోదీ 2019 మార్చి నుంచి లండన్ జైల్లో ఉంటున్నాడు. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే…
సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని నడ్డా జోస్యం చెప్పారు. ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా కేసీఆర్ అతిగా ఆలోచిస్తుండని ఎద్దేవా చేశారు. త్వరలోనే కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. కుటుంబవాదాన్ని వ్యతిరేకంచే వాళ్లంతా తెలంగాణలో బీజేపీతో కలిసిరావాలని నడ్డా పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్? అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని…
బాలీవుడ్ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్మప్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. కాంతార, పుష్ప చిత్రాలపై అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఘాటుగా ట్వీట్ చేశారు. కాంతార, పుష్ప లాంటి చిత్రాలు సినీ పరిశుమను నాశనం చేస్తున్నాయంటూ అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు వివేక్ స్పష్టం చేశారు. బాలీవుడ్‌కు చెందిన ఏకైక న్యాయమూర్తి అభిప్రాయాలతో తాను పూర్తిగా విభేదిస్తున్నానంటూ ఆయన ఎద్దేవా చేశారు. దీనికి గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కౌంటర్ ఇస్తూ పరిశోధన చేసి సినిమాలు తీయడం నేర్చుకోవాలంటూ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి హితవు చెప్పారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ తాను 4 ఏళ్ల పాటు రిసెర్చ్ చేసి కశ్మీర్ ఫైల్స్ తీశానని, తన చిత్రంలోని పాత్రలు, 700 మంది కశ్మీరీ పండిట్ల వీడియో అన్నీ అబద్ధాలేనా?…
జంతువుల సంరక్షణ, పర్యావరణ వనరుల పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనం కోసం అత్యధిక శాతం మంది శాకాహారాన్ని ఎంచుకునేవారు. సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరిస్తూ శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు ఉన్నారు. ఇటీవల కాలంలో కర్బన ఉద్గారాల నియంత్రణతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసమంటూ ప్రత్యేకంగా కొందరు శాకాహారం వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా శాకాహారుల సంఖ్య తగ్గుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఐరోపా లేదా బ్రిటన్ దేశాలలో వీరి సంఖ్య తగ్గుతోంది. స్టాటిస్టా గ్లోబల్ కన్జ్యూమర్ సర్వే ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా శాకాహారం క్షీణిస్తోందని నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు భారత్‌లోనూ సాంప్రదాయక శాకాహారులు కూడా ఆహారం కోసం రెండు విధానాలను పాటిస్తున్నారు. మాంసాహారాన్ని కూడా తీసుకుంటున్నారు. 2018/2019 పట్టణ భారతీయులలో మూడొంతుల మంది తాము శాకాహారులమని పేర్కొనగా, 2021/2022 నాటికి ఈ సంఖ్య దాదాపు నాలుగింట ఒకవంతుకు తగ్గింది. గత మూడేళ్లలో శాకాహారం జనాదరణ పొందినప్పటికీ…
రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు రాయితీలు సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ల రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభలో బుధవారంనాడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానం ఇచ్చారు. గతంలో సీనియర్ సిటిజన్లకు రైళ్లలో 40 నుంచి 50 శాతం టిక్కెట్ రాయితీ ఉండేది. కరోనా సమయం నుంచి ఈ రాయితీలను కేంద్ర నిలిపివేసింది. గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం రూ.59 వేల కోట్లు రాయితీ ఇచ్చామని చెబుతూ, ఇది పలు రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ అని పేర్కొన్నారు. పైగా, పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయని మంత్రి తన సమాధానంలో తెలిపారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు రూ.60,000 కోట్లు ఉందని, వేతన బిల్లులు రూ.97,000 కోట్లు, ఇంధనం కోసం రూ.40,000 కోట్లు ఖర్చవుతున్నాయని ఆయన చెప్పారు.…