Author: Editor's Desk, Tattva News

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి క‌మ‌లా హ్యారిస్‌కు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామామ‌ద్ద‌తు తెలిపారు. ఈ న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హ్యారిస్ పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. రేసు నుంచి త‌ప్పుకున్న అధ్య‌క్షుడు బైడెన్‌ త‌న స్థానంలో క‌మ‌లా హ్యారిస్‌ను ప్ర‌తిపాదించారు.  అయితే క‌మ‌లా హ్యారిస్ విష‌యంలో డెమోక్ర‌టిక్ నేత‌లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న మ‌ద్ద‌తును తెలప‌లేదు. అయితే ఇవాళ ఒబామా దంప‌తులు .. క‌మ‌లాహ్యారిస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.  మాజీ తొలి దంప‌తుల నుంచి హ్యారిస్‌కు ఫోన్ కాల్ వ‌చ్చింది. మిచెల్‌తో పాటు నేను కూడా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని, ఈ ఎన్నిక‌ల్లో గెలుపు సాధించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని బ‌రాక్ ఒబామా తెలిపారు. క‌మ‌లా నీ ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని, నువ్వు చ‌రిత్ర సృష్టిస్తావ‌ని మిచెల్ ఆ ఫోన్…

Read More

అయిదేళ్ల వైసీపీ పాలన ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, ఆర్థిక అవకతకలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై, వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సరైన విధానం లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. రాజధానిగా హైదరాబాద్ ను కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటంతో ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి 46 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని చెబుతూ 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వస్తే..42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం వస్తోందని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు ఏపీలో ఉంటే దాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో…

Read More

మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.  ముంబై, పుణేల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షపాతం నమోదవగా ఈ నగరాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు.  ముంబై, పుణే నగరాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఈ రెండు రోజులు ముంబైలో స్కూళ్లు, విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు.  ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు, బీఎంసీ అధికారులు కోరుతున్నారు.  వరద నీటికి ప్రజా రవాణ, ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ ల రాకపోకలు విఘాతం ఏర్పడింది. లో విజిబిలిటీ కారణంగా విమానాలను కూడా ముంబైలో రద్దు చేశారు. భారీ వర్షం, నీటి ఎద్దడి కారణంగా కనీసం 10 విమానాలను దారి మళ్లించారు.…

Read More

అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. జులై 26వ తేదీ కార్గిల్ దివాస్. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు.  సైన్యంలో సంస్కరణల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. సైన్యంలోకి యువ రక్తాన్ని తీసుకు రావడంతోపాటు యుద్దానికి ఎల్లవేళలా సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తయారు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ సున్నితమైన అంశమని చెప్పారు. అలాంటి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు.. తమ వ్యక్తిగత లాభం కోసం అగ్నిపథ్‌ పథకాన్ని రాజకీయ అంశంగా మలుచుకున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలు చేస్తున్న ఆ యా పార్టీల్లోని వ్యక్తులు.. గతంలో సైన్యంలో వేల కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడి సైన్యాన్ని బలహీన పరిచాయని…

Read More

పోలవరం నిర్మాణం జాప్యానికి గత ప్రభుత్వమే కారణమని లోక్ సభలో కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ర్ ను మార్చడంతోనే ఈ జాప్యం జరిగిన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. లోకసభలో టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021లో హైదరాబాద్ ఐఐటీ నివేదికలో ప్రాజెక్టు ఆలస్యానికి కారణాలు పేర్కొన్నట్టు కేంద్ర మంత్రిస్పష్టం చేశారు. కాంట్రాక్టరును మార్చడంతో పాటు… భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని పార్లమెంటుకు జలశక్తి శాఖ చెప్పింది. గత మూడేళ్ళలో రూ. 8,044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్లు సీఆర్ పాటిల్ తెలిపారు. మూడేళ్ల పనుల పురోగతి వివరాలను కూడా సమాధానంలో పొందుపరిచారు. 2021..-22 నుంచి మూడేళ్ళలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21శాతం మట్టి…

Read More

రాష్ట్రపతి పదవిలో ఉన్నా ఉపాధ్యాయ వృత్తిపై ద్రౌపది ముర్ముకు మక్కువ తగ్గలేదు. ఆమె ఒకప్పుడు 1994-97 మధ్య కాలంలో రాయ్‌రంగ్‌పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రెల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో గౌరవ అసిస్టెంట్ టీచర్‌గా వ్యవహరించారు. తాను రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టి గురువారం నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ప్రెసిడెంట్ ఎస్టేట్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాక్షాత్తు రాష్ట్రపతియే వచ్చి తమకు పాఠాలు చెప్పడం విద్యార్థులకు చక్కని అనుభూతిని కలిగించింది. మొదట ఆమె విద్యార్థులను వారి పేర్లతో సహా వారి వ్యక్తిగత లక్షాలు, అభిరుచులు అడిగి తెలుసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్‌పై బోధించి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వీలైనన్ని మొక్కలు నాటితే పర్యావరణ మార్పు ప్రభావం మనపై ఉండబోదని సూచించారు. ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక…

Read More

సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించింది. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు గురువారం విచారించింది.  ఈ సందర్భంగా ఈ కేసులో తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు. అలాగే వివేకా హత్య కేసులో సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇదే సమయంలో సీబీఐ కూడా తనను అభియోగపత్రంలో సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్  వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.  మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కొన్ని ఏళ్ల పాటు జైలులో ఉన్నారు. అనంతరం…

Read More

రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రకటించారు. కీలక రంగాలైన వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.29,816 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని, అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్​ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్​ అని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి రూ.75,577 కోట్ల అప్పు 2023 డిసెంబరు నాటికి రూ.6,71,757 కోట్లుకు చేరిందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు పది…

Read More

అవినీతి అసమర్థతతో పాలన చేతకాక కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామని చెబుతూ కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం గత పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పన్నుల వాటాలో రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసిందని చెప్పారు. వాటిని దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే ఫండ్స్‌ను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారని ఆక్షేపించారు. రామగుండంలో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాజీపేటలో రైల్వే…

Read More

కేంద్ర బడ్జెట్‌ విపక్షాపూరితంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. విపక్షాలు ‘దారుణమైన ఆరోపణలు’ చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. తమ రాష్ట్రాలకు నిధులు, పథకాలు మంజూరు చేయలేదంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. దేశంలోని రాష్ట్రాల పట్ల బడ్జెట్‌లో వివక్ష చూపారంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలపై నిర్మలా సీతారామన్ రాజ్యసభలో బుధవారంనాడు మాట్లాడుతూ, విపక్షాలు మరీ ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ”చాలా రాష్ట్రాల పేర్లు మంత్రి ప్రస్తావించ లేదని, కేవలం రెండు రాష్ట్రాల పేర్లే ప్రస్తావించానని ఖర్గే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలాకాలం ఈ దేశాన్ని పాలించింది. చాలా బడ్జెట్‌లు కూడా ప్రవేశపెట్టింది. ప్రతి బడ్జెట్‌లోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించే అవకాశం రాదనే విషయం ఆ పార్టీకి బాగా…

Read More