జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించింది. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో దాదాపు 50 నగరాల్లో 200కుపైగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ పార్టీలు పలు సూచనలు చేశాయి. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ జి20 ప్రెసిడెన్సీలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘ఇది దేశానికి లభించిన గౌరవం. ఒక పార్టీ లేదావ్యక్తికి కాదు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. దీనిని విజయవంతం చేయడానికి మనమందరం సహకారంతో పని చేద్దాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన జి-20 అధ్యక్ష పదవిని దేశ…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించగా, డిసెంబర్ 5కు స్టే విధించిన ధర్మాసనం.. ఈ నెల 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు కేరళకు చెందిన జగ్గుస్వామిపై సిట్ అధికారులు జారీ చేసిన లుకౌట్ నోటిసులపై ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించగా… వాటిపై కూడా న్యాయస్థానం స్టే విధించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ కేసుతో సంబంధముందని అనుమానిస్తోన్న పలువురిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సిట్ అధికారులు బీఎస్ సంతోష్‌తో పాటు తుషార్, జగ్గుస్వామికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. మొదట సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు నవంబర్ 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అంతేకాదు..…
బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పిడులను తీవ్రమైన సమస్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. సోమవారం దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిల్ మెయింటెనెన్స్‌పై అభ్యంతరాలను తిరస్కరించింది. ‘ప్రతి స్వచ్ఛంద సంస్థ లేదా మంచి పనిని స్వాగతించాల్సిందే, కానీ ఉద్దేశాలను మాత్రం తనిఖీ చేయాల్సిందే..’ అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మందులు, ఆహార ధాన్యాలు అందించి ఇతర మతాల్లోకి మారేలా ప్రజలను ప్రలోభపెట్టడం చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. ‘ప్రత్యేకమైన వ్యక్తులకు సహాయం చేయాలని మీరు విశ్వసిస్తే వారికి సహాయం చేయండి. అంతే కానీ అది మత మార్పిడి కోసం ఉండకూడదు. ప్రలోభపెట్టడం చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా తీవ్రమైన సమస్య. మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధం. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతదేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలి..’ అని జస్టిస్ ఎంఆర్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ఎంఆర్…
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి విజయవంతమైంది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు ఆయన కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సోమవారం ట్వీట్ చేశారు. పాప(నాన్న) కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారు. అక్క రోహిణి ఆచార్యతో సహా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. తండ్రిని బెడ్‌పై షిష్ట్ చేస్తున్న వీడియోను షేర్చే శారు. సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు నేడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. లాలూ కుమార్తె రోహిణి తండ్రికి కిడ్నీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్ కు చెందిన ఓ ఐటీ నిపుణుడిని పెళ్లాడి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో…
పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారని ఆక్స్‌ఫామ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో మూడోవంతు మంది మహిళలు మాత్రమే ఉన్నారని అధ్యయనం నివేదిక పేర్కొంది. ‘ఇండియా ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్-2022 : డిజిటల్ డివైడ్” నివేదికను ఆదివారం విడుదల చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతం, భారతదేశం 40.4 శాతం లింగ బేధంతో అధ్వాన్నంగా ఉందని అధ్యయనం తెలిపింది. గ్రామీణ-పట్టణ డిజిటల్ విభజనను నివేదిక సూచిస్తున్నది. సంవత్సరానికి 13 శాతం గణనీయమైన డిజిటల్ వృద్ధి రేటును నమోదు చేస్తున్నప్పటికీ, పట్టణం వాసులతో (67శాతంతో) పోలిస్తే.. గ్రామీణ జనాభాలో 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్నారు. జనవరి 2018 నుంచి డిసెంబర్ 2021 వరకు నిర్వహించిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ఇంటింటి సర్వే ప్రాథమిక డేటాను ఈ నివేదిక విశ్లేషించింది. అత్యధికంగా ఇంటర్నెట్‌ను వ్యాప్తిని కలిగి ఉన్న రాష్ట్రాల్లో…
హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను తక్షణమే రీ ఓపెన్ చేసి విచారణను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. ఈ కేసులు కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆరోపిస్తూ ఈ కేసును వెంటనే రీఓపెన్ చేసి విచారణ జరిపి దోషులను నడిబజార్లో నిలబెట్టాలని దర్యాప్తు సంస్థలను కోరారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత జరగబోయే సీబీఐ విచారణకు హాజరుకావడం లేదని చెప్పడంపై ఎద్దేవా చేశారు. ‘‘లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డ విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుంది. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నరు. అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు” అని చెప్పారు. ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి కోసం స్కెచ్ వేస్తున్నారని, తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర నిర్వహించేలా నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలొస్తే పాదయాత్రకు బదులు బస్సు యాత్ర నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర నిర్వహించేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర చేపట్టి.. 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నామని ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ ఛార్జ్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా పాదయాత్ర శిబిరంలోనే సంజయ్ ఉదయం, రాత్రి వేళ్ళల్లో జిల్లాల నాయకత్వంతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు జనవరి నుంచి బస్సు యాత్రకు…
నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన ప్రదర్శనను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1971 యుద్ధంలో చారిత్రాత్మక విజయానికి దోహదపడిన భారత నౌకాదళ సాహస కృత్యాలను స్మరించుకోవడానికి ఈ రోజును నిర్వహించుకుంటున్నామని ఆమె చెప్పారు. ఇది చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొంది, తరతరాలకూ స్ఫూర్తిదాయకంగా ఉన్న మన అమరవీరులను స్మరించుకునే, సత్కరించే రోజని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, అమృత్ కాల్ ద్వారా గొప్ప భవిష్యత్తు వైపుకు తీసుకెళ్లడానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని కూడా ఈ రోజు గుర్తుచేస్తుంది అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మూడు వైపులా సముద్రం,…
దేశంలోనే అత్యుత్తమ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోన్న నాయిస్ సంస్థ ఇప్పుడు తమ స్మార్ట్ వాచ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా యూత్ ఐకాన్, కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా విరాట్ కోహ్లీని నియమించింది. ఈ సందర్భంగా నాయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రీ మాట్లాడుతూ “భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని నాయిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విరాట్ ఎలా అయితే ప్రపంచస్థాయి విజేతగా మారాడో మేం కూడా మా స్మార్ట్‌వాచ్ డొమైన్‌లో అలాగే విశ్వవిజేతగా మారాం” అని తెలిపారు. “విరాట్ ఎలా అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడతాడో మేం కూడా మనసు చెప్పే శబ్దాన్ని వినేందుకు నిరంతర ఉత్సాహంతో పనిచేస్తుంటాం. ఇప్పుడు విరాట్‌తో అనుబంధం ద్వారా భారతదేశంలో, విదేశాలలో ఉన్న యూత్ అందరికి మా బ్రాండ్ మరింత దగ్గర అవుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము” అని పేర్కొన్నారు. “స్మార్ట్ కనెక్టెడ్…
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల్లో ఇదే జోష్‌ను కంటిన్యూ చేసేందుకు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగబోతున్నారు. ప్రియాంక నేతృత్వంలో 2023లో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2023లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత.. రెండు నెలల పాటు ప్రియాంక మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో మహిళా మార్చ్ నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇక రాహుల్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జోడో యాత్రతో కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. దీన్ని మరింత రెట్టింపు చేసేందుకే మహిళా మార్చ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చత్తీస్‌ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.…