Author: Editor's Desk, Tattva News

కేంద్ర బడ్జెట్‌2024-25లో ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), మధ్యతరగతి ప్రజలుపై ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతీ, యువకులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రంగాలపై దృష్టి సారిస్తుందని సీతారామన్ చెప్పారు. ఈ రంగాలలో పథకాలు, చర్యలు – ప్రస్తుతం ఉన్నవి, ప్రకటించబోయేవి అన్నింటికి కలిపి ఐదు సంవత్సరాల వ్యవధిలో రూ. 2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. స్వయం…

Read More

పార్లమెంట్ ఉన్నది పార్టీ కోసం కాదని, దేశం కోసం అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై ప్రధాని ధ్వజమెత్తుతూ, తమ రాజకీయ వైఫల్యాలను మెరుగుపరచుకోవడానికి కొన్ని పార్టీలు ‘ప్రతికూల రాజకీయాలు’ చేశాయని, పార్లమెంట్‌ను ‘దుర్వినియోగం చేశాయి’ అని విమర్శించారు. పార్లమెంట్ సెషన్‌కు ముందు మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మంగళవారం ప్రవేశ పెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ వచ్చే ఐదు సంవత్సరాల ప్రస్థానానికి మార్గాన్ని నిర్దేశిస్తుందని, 2047లో ‘వికసిత్ భారత్’ కల సాఫల్యానికి పునాది వేస్తుందని సూచించారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తమ తీర్పు వెలువరించారని, వచ్చే ఐదు సంవత్సరాలకు దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సంఘటితంగా పోరాడాలని చెప్పారు. ‘ఎంపిలు ఏ పార్టీవారైనా కావచ్చు, మనం ఎన్నికల పోరు సాగించిన జనవరి నుంచి మనం ఏమి చెప్పాలని అనుకున్నామో తెలియజేశామని, కొంత మంది మార్గం సూచించారని, మరికొందరు తప్పుదారి పట్టించారని, కాని ఆ కాలం…

Read More

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లు దహనం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తక్షణమే డీజీపీ, సీఐడీ చీఫ్ లు ఘటనస్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడం ప్రమాదమా? లేదా కుట్రపూరితమా అనే కోణం లో విచారణ జరుపుతూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన మదనపల్లికి చేరుకుని విచారణ చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలతో బిజిబిజిగా ఉన్నా, మదనపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయ్యాయి అనే సమాచారం రావటం తో సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని అయన ఆదేశించారు. వెనువెంటనే ఘటపై జిల్లా కలెక్టర్ తో సీఎం…

Read More

ఇంటర్-మినిస్టీరియల్ గ్రూప్(ఐఎంజి) రిపోర్టు 2012 ప్రకారం బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఝంఝార్‌పూర్ లోక్‌సభ ఎంపీ రాంప్రీత్ మండల్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలిపారు. “ప్రణాళిక సహాయం కోసం ప్రత్యేక కేటగిరీ హోదాను గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) కొన్ని రాష్ట్రాలకు మంజూరు చేసింది. ఈ లక్షణాలలో ప్రత్యేక పరిశీలన అవసరం (i) కొండలు, కష్టతరమైన భూభాగం, (ii) తక్కువ జనాభా సాంద్రత /లేదా గిరిజన జనాభాలో గణనీయమైన వాటా, (iii) పొరుగు దేశాలతో సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక స్థానం, (iv) ఆర్థిక , అవస్థాపన వెనుకబాటుతనం , (v) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క ఆచరణీయం కాని స్వభావం” అని వివరించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్…

Read More

గతంలో 58 ఏళ్ల క్రితం ఆరెస్సెస్‌కు సంబంధించిన ఓ విషయంపై అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. ఆరెస్సెస్‌ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  గత వారమే ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినా, తాజాగా బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.  ఈ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని ఆరెస్సెస్ నేతలు స్వాగతించగా, కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది.  58 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జారీ చేసిన రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలను ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని అమిత్ మాలవీయ ట్విటర్‌లో వెల్లడించారు.  ఇక ఆరెస్సెస్ నిర్వహించే ఎలాంటి కార్యకలాపాల్లోనైనా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే అమిత్ మాలవీయ చేసిన…

Read More

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన క్రమంలో ఇవాళ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంగళవారం రోజున సమర్పించనున్న క్రమంలో ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. ఆర్థిక సర్వేతో పాటుగా గణాంక అనుబంధాన్ని సైతం సభలో ప్రవేశపెట్టారు.  బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఒక రోజు ముందుగా ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పని తీరు, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసి చెప్పేదే ఈ ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల విభాగంలోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను తయారు చేస్తుంది. మొట్టమొదటి ఆర్థిక సర్వేను 1950-51 సంవత్సరం నుంచి బడ్జెట్‌తో పాటు…

Read More

సోమవారం ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆదివారం సాయంత్రం ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు. 16వ అసెంబ్లీ మొదటి సెషన్‌ రెండో సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో సభలో జాతీయ గీతాలాపన తర్వాత గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో సేవ్ డెమోక్రసి నినాదాలు ప్రారంభించారు. దీంతో సభలో గవర్నర్ ప్రసంగానికి పలుమార్లు ఆటంకం కలిగింది. ఏపీలో హత్య రాజకీయాలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతకు ముందు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణానికి నల్లకండువాలతో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌…

Read More

గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరింది. పాండ్‌ లెవెల్‌ 13.75 మీటర్లుగా ఉంది. బ్యారేజీ నుంచి రాత్రి 9గంటలకు 8,18,853 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు.  ఈ ప్రవాహం 10లక్షల క్యూసెక్కులు దాటినా.. బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరినా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 43 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు వరద నీరు పెరగడంతో తెలంగాణలోని భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతంలోని మెట్లు నీట మునిగాయి. చర్ల మండలం వద్ద ఈత వాగుపై నుంచి…

Read More

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ‘‘నేను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలంటే.. ఆ దేవుడే దిగి రావాలి. లేదంటే.. నేను అనారోగ్యం బారిన పడడమో.. రైలు ఢీకొని చనిపోవడమో జరగాలి’’ అంటూ శనివారం వరకు భీష్మించుకున్న బైడెన్‌ ఆదివారం ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ‘‘డెమోక్రాట్‌ సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. నిజానికి రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందే ఆయన విజయావకాశాలు 60 శాతం దాకా ఉండగా, కాల్పుల ఘటన తర్వాత ఒక్కసారిగా 78 శాతానికి పెరిగిపోయాయి. అప్పటి నుంచి డెమోక్రాట్లు బైడెన్‌ ఉంటే ఓటమి తప్పదని ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్‌ను ఎదుర్కోవడం బైడెన్‌ వల్ల కాదంటూ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఇతర సీనియర్లు వ్యాఖ్యానించారు.…

Read More

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభమవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. మోడీ 3.0 ప్రభుత్వానికి ఇది తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. సోమవారం పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే వెలువడుతుంది. ఈసారి పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి సంఘటితంగా ఉండటం, రాహుల్ గాంధీ సభలో ప్రతిపక్ష నేత కావడం వంటి పరిణామాలతో ఈ వర్షాకాల సెషన్ ఆద్యంతం ఉరుములు మెరుపులుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి నీట్ పరీక్షా పత్రాల లీక్ కేసు, రైల్వే భద్రత వంటి పలు విషయాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిలదీసే వీలుంది. సోమవారం ఆరంభమయ్యే సెషన్ మొత్తం 19 సిట్టింగ్‌లుగా ఆగస్టు 12వ తేదీవరకూ సాగుతుంది. ఈసారి సమావేశాలలో మోడీ ప్రభుత్వం మొత్తం ఆరు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో నూతన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్. దీనిమేరకు దేశంలో 90 సంవత్సరాల నాటి విమానాల యాక్ట్‌కు ప్రత్యామ్నాయ చట్టం అమలులోకి రానుంది.…

Read More