ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్ వంటి నేరాలు సరిహద్దులు దాటి జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. హర్యానాలోని సూరజ్ కుండ్ లో హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన చింతన్ శివిర్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని అందుకనే నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 5 జీతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉందన్న ప్రధాని… క్రిమినల్స్ కంటే 10 అడుగులు ముందు ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడి నేరాలను అరికట్టాలని సూచించారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఒక రాష్ట్రానికే రిస్ట్రిక్ట్ అయింది కాదని, సాంకేతికతను క్రిమినల్స్ దుర్వినియోగ పరుస్తున్నారని చెబుతూ …
Author: Editor's Desk, Tattva News
ఎమ్యెల్యేల కొనుగోలు ఉదంతం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) నేతలపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ మీడియా హెడ్ అనిల్ బలూని, బీజేపీ ఎన్నికల కమిటీ నేత ఓం పాఠక్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. మనుగోడు ఉప-ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రెండు పేజీల ఫిర్యాదు అందజేశారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీకి వస్తున్న స్పందన, ఆదరణ చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఈ క్రమంలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోడానికి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. వీటిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ఇది చాలదన్నట్టుగా కాంగ్రెస్ గుర్తుపై…
మునుగోడు ఉపఎన్నికల సమయంలో తమ ఎమ్యెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ బేరసారాలు చేస్తున్నట్లు అధికార టిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రేపిన దుమారం చల్లారిపోయింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించడమే కాకుండా, వారిని వెంటనే విడుదల చేయమని గత అర్ధరాత్రి ఆదేశించారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు నిబంధనలు అనుసరించలేదని స్పష్టం చేయడమే కాకుండా, ఈ కేసును అవినీతి నిరోధక చట్టం పరిధిలో నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వజూపినట్లుగా ఎలాంటి నగదు లభ్యం కాకపోవడంతో పీసీ యాక్ట్ కేసుల కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. నిందితుల అరెస్ట్ విషయంలోనూ 41 సీఆర్‌పీసీ నిబంధనలు పాటించలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి విచారించిన తరువాత తమ ముందు ప్రవేశపెట్టాలని గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు పార్టీ మారేందుకు రూ.100 కోట్లు…
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై విద్వేష ప్రసంగాలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విద్వేషప్రసంగాలు ఎవరు చేసినా ఉక్కుపాదం మోపాలని యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గతవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ, యోగితో పాటు నాటి రాంపూర్ కలెక్టర్ ఆంజనేయకుమార్ సింగ్‌పై ఆజంఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దేశంలో ఉండేందుకు వీల్లేని వాతావరణం కల్పించారని ప్రధానిపై ఆరోపణలు చేశారు. దీనిపై ఐపీసీ 153ఏ (మతవిద్వేషాలను రెచ్చగొట్టడం), 505ఏ (వివిధ వర్గాల నడుమ శత్రుత్వం, ద్వేషభావాలు సృష్టించే తప్పుడు ప్రకటనలు ఇవ్వడం) సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 (ఎన్నికల్లో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన నేరాన్ని రాంపూర్‌లోని ప్రత్యేక కోర్టు నిర్ధారించిందని,…
తెలంగాణలో దుర్మార్గమైన కేసీఆర్ పాలన పోతేనే ప్రజల బతుకులు బాగుపడతాయని చెబుతూ మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయేలా తీర్పు ఇవ్వాలని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోరారు. ఇక్కడి ఓటర్ల తీర్పుతో తెలంగాణ రాత మారబోతోందని ఆయన చెప్పారు. చండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన రాజీనామా దెబ్బకి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ మునుగోడుకు క్యూ కట్టారని గుర్తు చేశారు. తనపై మునుగోడు ప్రజలకు ఎనలేని ప్రేమ ఉందని, అందుకే 2018లో గెలిపించారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బానిసలుగా మారారని ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపిచ్చారు. మునుగోడు ప్రజలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీలో ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారం, డబ్బునే నమ్మకున్నారని..తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. శాసనసభలో…
కేంద్ర జలశక్తితో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణం నిలుపుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ ఎంబీ)కు లేఖ రాశారు. చట్టవిరుద్ధంగా కృష్ణా జలాలను తరలించేందుకు ప్రాజెక్టులు నిర్మించటంతో పాటు కొత్త పనులకు టెండర్లు పిలుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ తాము ఇప్పటికి 40 లేఖలు రాసినా కృష్ణా బోర్డు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్దం పెంపు ద్వారా కృష్ణా జలాలను బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోందని లేఖలో ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్దం పెంపుదల వల్ల కృష్ణాలో తెలంగాణ వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనీ,…
బిగ్ బాస్ షో నిలిపేయాంటూ దాఖలైన పిటీషన్‌పై ఎపి హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ షోకి హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, షో నిర్మాహకులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే..బిగ్‌బాస్ షో నిలిపివేయాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్జంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో కూడా ప్రజాప్రయోజన వాజ్జం వేశారు. రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గతంలో విచారణ జరిపి.. ‘బిగ్‌బాస్ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ…
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్కు గట్టి హెచ్చరికలు పంపారు. పీఓకేలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని..వీటిపై పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు..త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని గురువారం నిర్వహించిన శౌర్యదివస్ కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. “జమ్మూ, కశ్మీర్, అడఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్థాన్‌లను చేరుకున్నాకే మా లక్షంనెరవేరుతుంది. పిఓకె ప్రజలపై పొరుగుదేశం అకృత్యాలకు పాల్పడుతోంది. పిఓకె ప్రజలు అనుభవిస్తున్న బాధ వారిని మాత్రమే కాదు, మనల్నికూడా బాధిస్తోంది. దాని పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు” అంటూ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ మానవహక్కుల కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటోందని, కానీ పీవోకేలో మాత్రం ప్రజల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. పీవోకేలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని చెప్పారు. త్వరలో వారి…
మరో వారం రోజులలో కీలకమైన ఉపఎన్నిక జరుగుతుండగా, నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు బిజెపి బేరాలు ఆడుతున్నట్లు బుధవారం రాత్రి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం రేపింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని ఒక వంక టిఆర్ఎస్, మరో వంక బిజెపి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ ఉదంతంతం రాజకీయ సంచలనం కలిగిస్తున్నది. ఎట్లాగూ తమకు ఓటమి తప్పదనే భయంతో బిజెపి ఈ దురాగతానికి దిగినదని టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా, ఇదంతా ఓ రాజకీయ డ్రామా అంటూ బిజెపి నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారం మేరకు తాము ఫాంహౌజ్‌ను ముట్టడించి బేరసారాలకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వి చారిస్తున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు హైదరాబాద్ శివార్లలోని పివిఆర్ ఫామ్‌హౌస్‌లో దాడులు చేశారు. …
కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య వెనుక హనీట్రాప్, బ్లాక్‌మెయిల్ వంటి కోణాలున్నాయని పోలీసులు తెలిపారు. ఆయన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు ఆ మఠానికి సంబంధించిన వారేనని వెల్లడించారు. రామనగర జిల్లాలోని కంచుగల్ బందే మఠాధిపతి సంత్ బసవలింగ స్వామి తన ప్రార్థన మందిరంలో సోమవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లింగాయత్ మఠాలకు చెందిన సాధువులు ఇటీవల వరుసగా మరణిస్తుండటం కర్ణాటకలో కలకలం రేపుతున్నది. రెండు నెలల క్రితం బెల్గాంలోని గరు మడివళేశ్వర మఠంలో బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభించింది. కాగా, బసవలింగ స్వామి సూసైడ్ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను హనీట్రాప్‌నకు గురైనట్లు, తనను బ్లాక్‌మెయిల్ చేసి వేధించినట్లు ఆయన ఆరోపించారు. నాలుగు అసభ్యకర వీడియోలు విడుదల చేస్తామంటూ ఒక మహిళ, మరి కొందరు కలిసి తనను బెదిరించినట్లు ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తన స్థానం నుంచి తొలగించాలని భావించిన కొందరు వ్యక్తులు ఇలా కుట్రపన్నిన్నట్లు…