బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1971లో జరిగిన బంగ్లా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఇస్తున్న 30 శాతం కోటాను 5 శాతానికి తగ్గించింది. 93 శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. మరో 2శాతం కోటా మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ఉద్యోగాల్లో కోటా కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేయడం వల్ల బంగ్లా ప్రభుత్వం 2018లో నిలుపుదల చేసింది. జూన్‌లో బంగ్లాదేశ్ హైకోర్టు ఆ కోటాను తిరిగి అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు, 93శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా విద్యార్థులు ఆందోళనలు విరమించి తరగతులకు…
Author: Editor's Desk, Tattva News
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముంపు పొంచి ఉందా? యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా రామప్ప అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదా అంటే అవుననే స్థానికులు అంటున్నారు . చిన్నపాటి వర్షానికి రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు కురవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ప్రమాదపుటంచుల్లో రామప్ప దేవాలయం ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తాం అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయలేదు. రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఉపాలాయాలకు పునరుద్ధరిస్తామని పురావస్తు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. నిధులు మంజూరు కాలేదు. దీంతో రామప్ప అభివృద్ధి నత్తనడకన సాగుతుంది. మరోవైపు రామప్ప ఆలయానికి ప్రస్తుతం ముంపు పొంచి ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన…
పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతుండగా ఉభయసభల్లో సభ్యులు అడ్డుతగలడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ ఈ విజ్ఞప్తి చేశారు. ఇదెంత మాత్రం పార్లమెంటరీ సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయం మీడియాకు తెలిపారు. సభ్యులంతా ప్రజాసామ్య పరిపుష్టతకు కృషి చేయాలని, సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం కానీ, అంతరాయం కలిగించడం కానీ చేయరాదని అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేసినట్టు రిజిజు తెలిపారు. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు మంచి సూచనలు చేసిన అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్లకు ఆయన కృతజ్ఞతలు…
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని నిలదీశారు. రాష్ట్రంలో జెండా మాత్రమే మారింది తప్ప ఏమాత్రం మార్పులేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంటోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజలందరూ స్వస్తి చెబుతారని జోస్యం పలికారు. కాంగ్రెస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా అవినీతి జరుగుతోందని అన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రజల తీర్పును…
ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్‌గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది. జమ్ములో యాభైమంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్టు రక్షణ శాఖ ఇప్పటికే గుర్తించింది. వారిని ఏరివేసే ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉగ్రవాదులకు అందుతున్న సహకారంపై దృష్టి పెట్టింది. నిర్మాణ పనులు చేసే కూలీల ద్వారా నెట్‌వర్క్‌ను పెంచుకున్న ఉగ్రవాదులకు ఏఏ మార్గాల్లో ఆహారం, వసతి సౌకర్యాలు లభిస్తున్నాయనేది గుర్తించే పనిలో పడింది. మరోవైపు తాజా ఉగ్ర దాడుల వెనుక ఎవరు ఉన్నారనేదీ రక్షణ శాఖ కూపీ లాగుతోంది. ఈ క్రమంలో…ఉగ్ర కార్యకలాపాల ప్రధాన కేంద్రం కశ్మీర్ నుంచి జమ్ముకు మారిన విషయం బయటపడింది. జమ్ము, ఆ ప్రాంత పరిధిలోని…
సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో శ్రీరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముంద, ఆ తర్వాత కూడా శ్రీరెడ్డి టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ బీసీ సెల్ నాయకులు రాజుయాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సభ్య సమాజం తలదించుకునే విధంగా శ్రీరెడ్డి తమ నేతలను దూషిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు టీడీపీ నేతల ఫిర్యాదుతో కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో శ్రీరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి మీద…
ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.1,000 సాయం వంటి హామీలు ప్రకటించింది. ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ హర్యానాలో ‘కేజ్రీవాల్ కి హామీలు’ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, అందరికీ ఉచిత వైద్యం, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1000 వంటి హామీలు అందులో ఉన్నాయి. కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌తో కలిసి పంచకులలో ఎన్నికల ప్రచారానికి సునీతా కేజ్రీవాల్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఢిల్లీ, పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. మొహల్లా క్లినిక్‌ల విజయాలు, దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి…
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని అడుగడుగునా తుంగలో తొక్కుతోందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్రమంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఫిరాయింపుపై న్యాయ ప్రక్రియ నడుస్తోందని గవర్నర్‌కు తెలిపామని.. సమస్యలపై గవర్నర్ వెంటనే స్పందించారని కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్న విషయం గురించి గవర్నర్‌కు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని, ఈ విషయంపై స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు కూడా గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.…
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న ప్రవేశపెట్టనుంది. 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకే కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా రూపకల్పన చేయాలని సూచించింది. గత పదేళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5 శాతం వ్యయమైనట్లు శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయ, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ. 2.50 లక్షల కోట్ల వరకు చేరే…
ఇండియన్ ఉమెన్స్ టీమ్ మరోసారి సత్తా చాటింది. ఆసియా కప్ 2024లో భాగంగా పాకిస్థాన్ వుమెన్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన మన టీమ్.. సరిగ్గా ఆ హోదాకు తగిన ఆటతీరుతోనే దాయాదిని చిత్తు చేసింది. 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఉమెన్స్ ఆసియా కప్ ను చివరిసారి టీమిండియానే గెలిచింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ టీమ్.. 19.2 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్ దీప్తి శర్మతోపాటు మిగిలిన బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు ఎదురు నిలవలేకపోయారు. దీప్తి శర్మ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం.…