వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, రాజ్యాంగబద్ధ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఆయన నాయకత్వంలో బీసీ సంఘాల నాయకులు శుక్రవారం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ను కలిసి చర్చలు జరిపారు. బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, దక్షిణ భారత సంఘం అధ్యక్షులు జబ్బాల శ్రీనివాస్, జాతీయ ఓబీసీ సంఘం అధ్యక్షులు ఏ. వరప్రసాద్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలు ఇలా కేంద్రంలో 74 ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉండగా, బీసీలకు మాత్రం లేవని కృష్ణయ్య వాపోయారు. 56 శాతం జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల బీసీ కులాల అభివృద్ధి కుంటుపడుతోందని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. మండల కమిషన్ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ…
Author: Editor's Desk, Tattva News
తొమ్మిది నెలలు అవుతున్నా ఉక్రెయిన్ పై యుద్ధంలో ఆధిపత్యం వహించలేక పోవడంతో అసహనంతో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణుబాంబు ప్రయోగంకు సిద్ధపడుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. ఆ విధంగా చేయడం ద్వారా నాటో, ఉక్రెయిన్‌కు భయం పుట్టించేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తన బలాన్ని ప్రదర్శించేందుకు పుతిన్ నల్ల సముద్రంలో అణు బాంబును పరీక్షించే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెప్తున్నాయి. తన సత్తాను నిరూపించుకొనేందుకు భూ ఉపరితలంపై గానీ, నల్ల సముద్రంలోగానీ పుతిన్ అణు బాంబు పరీక్ష చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో అనుకొన్నట్టుగా రష్యా పైచేయి సాధించటం లేదు. పైగా, ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ఉక్రెయిన్ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలవైపు ఆ దళాలు దూసుకొస్తున్నాయి. ఇలాంటప్పుడు పుతిన్ తీసుకోగల అసాధారణ నిర్ణయం అణుబాంబు దాడి మాత్రమే. పుతిన్ అటువంటి దుశ్చర్యకు పాల్పడితే పెను విపత్తు తథ్యం కాగలదు. అణుబాంబు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు టీఆర్ఎస్ నేతలు సమాధి కట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. బతికున్నవాళ్లకు సమాధి కడతారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్యలే లేదని, మిషన్ భగీరథ నీళ్లతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని పదేపదే గప్పాలు కొట్టిన టీఆర్ఎస్ నేతలు అదే అంశంపై సమాధి కట్టడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు సహా ఇఛ్చిన హామీలన్నీ విస్మరించిన నీకు తెలంగాణలో ఎన్ని సమాధులు కట్టాలి? అంటూ ప్రశ్నించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్నది కమ్యూనిస్టు నేతేనని… ఆ కేసును మాఫీ చేసేందుకే కమ్యూనిస్టు పార్టీని, కార్యకర్తల పోరాటాలను సీఎం కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.…
తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేండ్లలో నిధులు, నియామకాల మాట అటుంచితే, చాలా ప్రాంతాల్లో నీళ్ల గోస ఇంకా అట్లనే ఉన్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. స్వంత రాష్ట్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పేమీ లేదని, రాష్ట్రం రాకముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో… ఇప్పుడు కూడా అలానే ఉందని ఆమె పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా సబ్బండ వర్గాల ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం నాడు రోడ్డెక్కి కొట్లాడారని అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలు కొనసాగుతూనే ఉన్నయి. భూమి ఉన్నా పండించుకోలేని దీనస్థితిలో ఎంతో మంది అన్నదాతలున్నారని ఆమె చెప్పారు. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి… పొట్టకూటి కోసం దేశం నలుమూలలకు పాలమూరు వాసుల వలస బాట ఇంకా కొనసాగుతూనే ఉందని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిస్థితి మారుతుందనే భావన ఉండేది. కానీ, ప్రాజెక్టుల నిర్మాణంలోను, వాటిని పూర్తి చేయడంలోను…
రైతుల కోసం కొత్త పథకాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారంనాడు ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులు రూ.50,000 వరకూ ప్రోత్సహకాలను అందుకుంటారు. స్వల్పకాలిక రుణాలను పూర్తిగా చెల్లించిన వారికి ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ”మహాత్మా జ్యోతిరావ్ ఫులే ఫార్మర్స్ డెబ్ట్ రిలీఫ్ స్కీమ్”లో భాగంగా ఈ ప్రోత్సాహకాలను రైతులు అందుకుంటారు. 6.90 లక్షల మంది రైతుల అకౌంట్లలో ప్రభుత్వం రూ.2.500 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిన తొలి రాష్ట్రం క్రెడిట్ మహారాష్ట్రకు దక్కుతుందని చెప్పారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఈ పథకానికి అర్హులు కావాలంటే వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2017-18, 2018-19, 2019-20) రెండు ఆర్థిక సంవత్సరాలు పూర్తి రుణం చెల్లించి ఉండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్ 30 లోగా…
బ్రిటన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆమె గురువారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ‘‘నేను దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఉన్నట్లు కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నాను’’ అని లిజ్ ట్రస్ ప్రకటించారు. కాగా, సెప్టెంబరు తొలివారంలోనే ఆమె బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. ‘‘దేశంలో తీవ్ర ఆర్థిక అస్థిరత, అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానిగా ఎన్నికయ్యా. ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో బ్రిటన్‌కు మరింత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. పార్టీలో విశ్వాసం కోల్పోయా. ప్రధానిగా ఎన్నికయ్యే క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను’’ అని రాజీనామా విషయం వెల్లడి సందర్భంగా ట్రస్ పేర్కొన్నారు. కన్జర్వేటివ్…
మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. గతవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సత్య నాదెళ్ల పద్మభూషన్ అవార్డును అందుకున్నారు. అంతకుముందు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అవార్డును అందుకునేందుకు సత్యనాదెళ్ల భారత్ కు రాలేకపోయారు. భారత్ కు రాలేకపోవడంతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకోవడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. సాంకేతికతను మరింత పెంచే విధంగా దేశం అంతా తిరిగి ప్రజలతో కలిసి పని చేయడం కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన 17 మంది అవార్డు గ్రహీతల్లో సత్యనాదెళ్ల ఒకరిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సత్యనాదెళ్ల వయసు 55 సంవత్సరాలు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్ ఈ విశిష్ట అవార్డును సత్యనాదెళ్లకు అందజేశారు. దీని పట్ల సత్య…
చైనా అధ్యక్ష పదవిని జీ జిన్‌పింగ్ మూడోసారి చేపట్టబోతూ మరో తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టింపబోతున్న తరుణంలో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తోంది. చైనాకు మహా నేత అక్కర్లేదని, ప్రజాస్వామ్యం కావాలని నిరసనకారులు కోరుకుంటున్నారు. ఇటీవల బీజింగ్ నగరంలోని ఓ ఫ్లైఓవర్‌పైన దర్శనమిచ్చిన రెండు బ్యానర్లలో జీ జిన్‌పింగ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కనిపించింది. ఆయన అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీపై విమర్శలు కనిపించాయి. ఈ సంఘటన తర్వాత నిరసనలు పెరుగుతున్నాయి. అన్ని చోట్ల నిఘా కట్టుదిట్టంగా ఉంటుండటంతో నిరసనకారులు మరుగుదొడ్లను ఎంచుకున్నారు. తమ నినాదాలను మరుగుదొడ్లలోనూ, పాఠశాలల నోటీసు బోర్డుల్లోనూ రాస్తున్నారు. ప్రజాస్వామ్యం కావాలంటూ గుర్తు తెలియని చైనా జాతీయులు ‘వాయిస్ ఆఫ్ సీఎన్’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించారు. జీ జిన్‌పింగ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ చైనాలోని దాదాపు ఎనిమిది ప్రధాన నగరాలకు చేరింది. ఈ నగరాల్లో షెంజెన్, షాంఘై,…
ఆత్మనిర్భర్ ఢిల్లీని బీజేపీ కోరుకుంటోందని, అడ్వర్‌టైజ్‌మెంట్లతో అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ నిర్భర్ కావాలో, ఆత్మనిర్భర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దక్షిణ ఢిల్లీలోని తెహ్కండ్ ప్రాంతంలో వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను అమిత్‌షా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపించిందని, మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.40,000 కోట్ల బకాయి పడిందని చెప్పారు. ఆప్ ప్రభుత్వం అడ్వర్‌టైజ్‌మెంట్లపై భారీగా ఖర్చు చేసిందని, అడ్వర్‌టైజ్‌మెంట్లతో అభివృద్ధి సాధించగలమనే అభిప్రాయంతో ఆప్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కానీ ఇలాంటి భ్రమలన్నీ కేవలం ఐదు నుంచి ఏడేళ్ల పాటు మాత్రమే ఉంటాయని చెప్పారు. అడ్వర్‌టైజ్‌మెంట్ల ప్రభుత్వం కావాలో, అభివృద్ధి రాజకీయాలు కావాలో ప్రజలు ఎంచుకోవాలని సూచించారు. ఎంసీడీ పరిధిలో వార్డుల మార్పులకు చేపట్టిన డీలిమిటేషన్…
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్ తో కలిసి మిషన్ లైఫ్ ప్రోగ్రాంను ప్రారంభిస్తూ వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని చెప్పారు. వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని తెలిపారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలు కూడా జీవన శైలిని మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని సూచించారు. ప్రపంచంలోని 80 శాతం కాలుష్యం జీ 20 దేశాల్లో ఉందని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్ తెలిపారు. అందుకే జీ 20 దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని సూచించారు. వ్యక్తులు, సంఘాలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని గుటేరస్ చెప్పారు. కాగా, సుస్థిర అభివృద్ధి దిశగా ప్రజల సమిష్ఠి వైఖరిని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడమే మిషన్ లైఫ్ లక్ష్యం. సులువుగా, సమర్థవంతంగా ఉండే…